చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పులివెందుల చేజారిపోయిందన్న…నిరాశ, నిసృహలతో కొట్టుమిట్టాడుతున్న జగన్

ఎమ్మెల్సీ వర్ల రామయ్య

by చైతన్యరధం
November 22, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జగన్‌ ఆడిన డ్రామా కోడికత్తి దాడి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మేకపోతు గాంభీర్యంతో అధికారులను బెదిరిస్తూ సొంత మీడియాలో సీనియర్ అధికారుల
  • ఫోటోలు ప్రచురించి బ్లాక్ మెయిల్ చేయడం సబబా?
  • సొంత చెల్లిని యలహంక ప్యాలెస్‌లోకి అడుగు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని
  • న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఓ అన్నగా జగన్‌కు తగునా?
  • ఎన్ని కుప్పిగంతులు వేసినా జగన్‌కు తిరిగి అధికారం కలే
  • ఎమ్మెల్సీ వర్ల రామయ్య

అమరావతి (చైతన్యరథం): నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడానికి చేతికి ఏది దొరికితే దాన్ని పట్టుకుని బయటపడాలని ప్రయత్నించినట్లుగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రాజకీయంగా ఉనికి కాపాడుకోవడానికి ఏది పడితే అది పట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి జగన్ వ్యవహారశైలి చూస్తుంటే ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు లభించకపోవడం, వైసీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు కూడా ముందుకు రాకపోవడం, పోటీ చేసిన చోట్ల ప్రజల నుంచి ఆదరణ లేకపోవడంతో జగన్ నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా వస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని విమర్శించారు. ఈ నిరాశ, నిస్పృహల్లో భాగంగానే జగన్ బృందం గవర్నర్‌ను కలిసిందని వర్ల రామయ్య అన్నారు. అయితే గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు.. ఎన్నికల సంఘానికి వారు ఇచ్చిన నివేదికలు తప్పుడువని అధికారులు గుర్తించినందునే చర్యలు తీసుకోలేదని వివరించి ఉంటే బాగుండేదన్నారు. నామినేషన్లు అడ్డుకున్నారంటున్నారు.. ఎక్కడ? ఎప్పుడు? ఎవరు అడ్డుకున్నారు? జగన్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం స్పష్టత లేదని వర్ల రామయ్య అన్నారు. ఇప్పటికీ నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని పదేపదే చెబుతున్నారని, అసలు ఏ గ్రామంలో అడ్డుకున్నారు? ఏ అభ్యర్థిని అడ్డుకున్నారు? ఎవరు అడ్డుకున్నారు? ఏ సమయంలో ఈ ఘటన జరిగింది? అప్పట్లో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ఎవరు? ఏ నామినేషన్ దాఖలు కేంద్రంలో అభ్యర్థులను అడ్డుకున్నారో కనీసం ఒక్క ఘటననైనా ఆధారాలతో వివరించగలరా? బాధితులెవరు? ఫిర్యాదు ఎక్కడ చేశారు? అన్న వివరాలేవీ బయటపెట్టకుండా అడ్డుకున్నారు.. అడ్డుకున్నారు అంటూ గాలిలో ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

జరిగిన ఘటనలను ఆధారాలతో చూపించకుండా పదేపదే ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని వర్ల రామయ్య స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను అధికారులు, ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో వైసీపీ చేస్తున్న రాజకీయ డ్రామాలు, తప్పుడు ఫిర్యాదులు బయటపడుతున్నాయన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా, ఎన్నికల్లో ఎదురవుతున్న పరాజయాలను అంగీకరించలేక ప్రభుత్వంపై, పోలీసులపై, ఎన్నికల సంఘంపై నిందలు వేయడం జగన్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. గవర్నర్‌ను కలిసే ముందు వారి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సిద్ధం చేసుకోవాలనే కనీస స్పృహ కూడా జగన్‌కు లేదని, కేవలం రాజకీయ ప్రచారం కోసం రాజ్యాంగబద్ధమైన పదవులను వేదికగా చేసుకోవద్దని వర్ల రామయ్య హితవు పలికారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే డ్రామాలు
పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శాంతియుతంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వారు ఆడుతున్న “మాయ నాటకాలను” ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి, బయటకు రావద్దని రాతపూర్వక నోటీసులు ఇచ్చి సంతకం తీసుకున్నారని వర్ల రామయ్య తెలిపారు. అయితే ఎంపీగా చట్టాలను గౌరవిస్తారని పోలీసులు భావిస్తే, వారు వెళ్ళిన పావుగంటలోనే అవినాష్ రెడ్డి 5 కార్లతో బయలుదేరి, క్రమంగా 35 కార్ల కాన్వాయ్‌తో సింహాద్రిపురం వైపు వెళ్లారని ఆయన వివరించారు.

పోలీసులు కాన్వాయ్‌ను నిలువరించిన సమయంలో, తమపై పెట్రోల్ బాంబులు, ఐరన్ రాడ్లు, కర్రలతో హత్యాయత్నం జరిగిందని, త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నామని వారి సొంత ఛానెల్ ద్వారా ప్రచారం చేసుకున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. కానీ ఘటనా స్థలం ఎక్కడో చెప్పాలని పోలీసులు అడిగితే “మీరే ఏదో ఒకటి రాసుకోండి, నేను ఫిర్యాదు ఇవ్వను” అని అవినాష్ రెడ్డి చెప్పినట్లు పులివెందుల డీఎస్పీ స్వయంగా ప్రకటించారని వర్ల రామయ్య గుర్తు చేశారు. వాస్తవానికి అక్కడ కనీసం ఒక చిన్న రాయి కూడా పడలేదని పోలీసులు స్పష్టం చేశారని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి జగన్ మోహన్ రెడ్డి తీసుకెళ్లగలరా అని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు. ఇలా పదేపదే అబద్ధపు ప్రచారాలు చేస్తే ‘నాన్న పులి’ కథలాగా మారి, భవిష్యత్తులో నిజంగా ఏదైనా జరిగినా ఎవరూ నమ్మని పరిస్థితి వస్తుందని ఆయన హితవు పలికారు.

పులివెందులలో గత 40 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఎట్టకేలకు తమ ఓటు తాము వేసుకునే స్వేచ్ఛ లభించిందని, వైఎస్ కుటుంబ అరాచకాలకు తెరపడిందని భావించిన పులివెందుల ప్రజలు ఆ రోజు నిజమైన దీపావళి పండుగను జరుపుకున్నారని ఆయన అన్నారు. ప్రజలు 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ మోహన్ రెడ్డిలో మార్పు రాలేదని విమర్శించారు.

“ఒక్క ఛాన్స” పేరుతో ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు రెండేళ్ల తర్వాత మళ్లీ వస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ ఆయనకు అధికారం ఇచ్చే పరిస్థితి లేదని, కేవలం మిగిలిన కొద్దిపాటి క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకే “మళ్లీ వస్తాం” అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. నిరాశ నిస్పృహలతో ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు.

ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం తగదు..
ప్రభుత్వ అధికారులను బెదిరించే ధోరణిలో జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు “రెండేళ్లలో మేము వస్తాం, మాకు వ్యతిరేకంగా పనిచేసిన వారి సంగతి తేలుస్తాం” అంటూ ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. సొంత పత్రిక, ఛానల్‌లో సీనియర్ అధికారులు చెరుకూరి శ్రీధర్, నచికేత్ విశ్వనాథ్, కోయ ప్రవీణ్, ప్రద్యుమ్న, మహేష్ చంద్ర లడ్డా, డీజీపీ, ఎసఈసీలపై “గుండెలు తీసిన పచ్చ బంట్లు” అంటూ తప్పుడు కథనాలు రాయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసి ఈ కథనాలను చూపించే ధైర్యం జగన్ మోహన్ రెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. పులివెందులలో 40 ఏళ్లుగా నిర్మించుకున్న అక్రమ కోటను ప్రజలు ఓటు అనే ఆయుధంతో కూల్చేశారని వ్యాఖ్యానించారు. ఆ ఓటమి తాలూకు నిరాశ, నిస్పృహలతోనే జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి తప్పుడు రాతలు రాయిస్తున్నారని అన్నారు.

సొంత చెల్లెలిపైనే కోర్టుకెక్కడం జగన్ నైజానికి నిదర్శనం
మరోవైపు సొంత చెల్లెలు వైఎస్ షర్మిలను బెంగళూరులోని బంగ్లాలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించారని వర్ల రామయ్య తప్పుబట్టారు. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి సీనియర్ సివిల్ జడ్జ్ అండ్ జేఎంఎఫ్‌సీ కోర్టులో జగన్ మోహన్ రెడ్డి తన చెల్లెలు షర్మిలపై దావా వేశారని వర్ల రామయ్య ఆ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 20న ఫైల్ అయిన ఈ ఒరిజినల్ సూట్ (ఫైలింగ్ నెం. 1525/2026, రిజిస్ట్రేషన్ నెం. 1509/2026, సీఎన్ = నెం. కేఏబీ =310019262026) 21న రిజిస్టర్ అయిందని ఆయన తెలిపారు. బెంగళూరులోని యలహంక బంగ్లాలోకి తన చెల్లెలు షర్మిల అడుగుపెట్టకుండా నిరోధించాలని కోరుతూ జగన్ మోహన్ రెడ్డి ఈ కేసు వేశారని వివరించారు.

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన ఆ బంగ్లాలో, తన కుమార్తె వివాహ వేడుకలు నిర్వహించుకోవడానికి షర్మిల ప్రయత్నించగా, మేనమామ అయిన జగన్ మోహన్ రెడ్డి అందుకు ససేమిరా అనడమే కాకుండా కోర్టుకు వెళ్లడం ఆయన వ్యవహారశైలికి అద్దం పడుతోందని విమర్శించారు. మన తెలుగు సంస్కృతిలో మేనకోడలి పెళ్లిని సొంత కూతురి వివాహం కంటే ఘనంగా నిర్వహిస్తారని గుర్తు చేశారు. కానీ, జగన్ మోహన్ రెడ్డి తన మేనకోడలి పెళ్లికి బెంగళూరులోని ఇంట్లోకి రానివ్వనని చెప్పడమే కాకుండా, ఏకంగా చెల్లెలు షర్మిల ఇంట్లో అడుగుపెట్టకుండా కోర్టులో కేసు వేయడం బాధాకరమన్నారు. సొంత చెల్లెలి పట్ల ఇలా వ్యవహరించే వ్యక్తి, రాష్ట్రంలోని మిగతా అక్కచెల్లెళ్లను ఏ విధంగా గౌరవిస్తారని ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.

నాయకుల ప్రతి చర్య ప్రజల పరిశీలనలోనే
ప్రజా జీవితంలో ఉన్న నాయకుల వ్యవహారశైలి సమాజానికి ఆదర్శంగా ఉండాలన్నారు. సాధారణ వ్యక్తులు ఇంట్లో ఏం చేసినా ఎవరూ పట్టించుకోరని, కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి ప్రతి అడుగు పబ్లిక్ డొమైన్‌లోనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎన్టీ రామారావు, ఇందిరా గాంధీ వంటి మహామహులే ఎన్నికల్లో ఓడిపోయారని, కానీ వారు ఎప్పుడూ ఇలా నిరాశా నిస్పృహలతో వ్యవహరించలేదని వర్ల రామయ్య పేర్కొన్నారు. పులివెందుల ప్రజలు నిరాకరించారనే అసహనంతో జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.

Previous Post

కూటమి గెలుపుతోనే సమగ్ర అభివృద్ధి

Next Post

పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ హింసాకాండ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026

November 23, 2026
ఐక్యతే మన బలం…
ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

November 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-11-2026

November 22, 2026
పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ హింసాకాండ
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ హింసాకాండ

November 22, 2026
కూటమి గెలుపుతోనే సమగ్ర అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

కూటమి గెలుపుతోనే సమగ్ర అభివృద్ధి

November 22, 2026
రైతు సంక్షోభానికి వైసీపీ కారణం
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు భరోసా.. ఆక్వా రంగానికి కొత్త ఊపు!

November 22, 2026
Next Post
పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ హింసాకాండ

పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ హింసాకాండ

ముఖ్య వార్తలు

ఐక్యతే మన బలం…

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

by చైతన్యరధం
November 23, 2026

పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

by చైతన్యరధం
November 22, 2026

తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

by చైతన్యరధం
November 22, 2026

కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

by చైతన్యరధం
November 20, 2026

ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

by చైతన్యరధం
October 23, 2026

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026

by కార్యకర్త
November 23, 2026

ఐక్యతే మన బలం…

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

by చైతన్యరధం
November 23, 2026

పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...

చైతన్యరధం ఈ పేపర్ 22-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 22-11-2026

by కార్యకర్త
November 22, 2026

పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ హింసాకాండ

పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ హింసాకాండ

by చైతన్యరధం
November 22, 2026

ఓటమి భయంతో పథకం ప్రకారం పల్నాడులో టీడీపీ నేతలపై దాడులు టీడీపీ మద్దతుదారులను అడ్డుకుని, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరింపులు దాడులకు పాల్పడిన వైసీపీ గుండాలపై కఠినమైన చర్యలు...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.