- పేదలను క్రీడలకు దూరం చేశారు
- పాఠశాలల్లో మైదానాల కొరత
- జాతీయ క్రీడల్లో దిగజారిన రాష్ట్ర ప్రతిభ
- రాజకీయ పునరావాస కేంద్రాలుగా క్రీడా సంఘాలు
- టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రీడలకు మహోన్నత దశ
అమరావతి,చైతన్యరథం: యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసి యువత జీవితాలతో ఆడుకుంటున్న వైసీపీ ప్రభుత్వం..ఎన్నికల ముందు యువత ఓట్ల కోసం ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడ పోటీలు అంటూ డ్రామాలాడటం సిగ్గుచేటు. 4 ఏళ్ల 8 నెలల వైసీపీ పాలనలో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా, నేడు ఆటల పేరుతో తలా నాలుగు కిట్లు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమానికి సీఎం జగన్ రెడ్డి తెర లేపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవు, కొత్తగా పరిశ్రమలు, పెట్టబడులు రాలేదు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన లేనందున నిరుద్యోగ యువత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారిని ఎలాగైనా ఉత్సాహపరిచి, తమ వైపునకు తిప్పుకునేందుకు కంటి తుడుపు చర్యగా ‘ఆడుదాం ఆంధ్ర’కు శ్రీకారం చుట్టింది. రాబోయే ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పొందేందుకు ప్రభుత్వం ఆరాటపడటం సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికారసంస్థ అధ్వర్యంలో డిసెంబరు 15 నుంచి జనవరి 3 వరకు ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడలకు ప్రణాళిక రూపొందించారు.
క్రీడలకు దూరమైన పేదలు
నాలుగున్నరేళ్లుగా క్రీడా రంగాన్ని భ్రష్టు పట్టించిన ప్రభుత్వం ఎన్నికల ముందు తూతూ మంత్రంగా క్రీడా పోటీల నిర్వహణ అంటూ హడావుడి చేస్తే నమ్మడానికి ప్రజలు అమాయకులా? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాఫ్ ఆధ్వర్యంలో పేద క్రీడాకారులకు ఉచితంగా అందుబాటులో ఉండే ప్రభుత్వ స్టేడియాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు కట్టబెట్టారు. శిక్షణ కోసం వచ్చేవారి నుంచి రుసుములు వసూలు చేసే విధానాన్ని ప్రారంభించాక చాలామంది పేదలు మైదానాలకు దూరమవుతున్నారు. క్రీడాంశాలను బట్టి రూ.50 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారు. రుసుముల వసూళ్ల విషయంలో శిక్షకుల మెడపై శాప్ కత్తి పెట్టడంతో పలుచోట్ల క్రీడాకారులపై ఒత్తిడి పెంచుతున్నారు. కొన్నిచోట్ల శిక్షకులే సొమ్ము చెల్లిస్తున్నారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించి ఉచిత శిక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం వారి నుంచి ఫీజులు వసూలు చేయటం ఏంటి? రుసుముల వసూళ్లపై శాప్ చూపిస్తున్న శ్రద్ధ మైదానాల్లో సదుపాయలు కల్పించడంలో చూపించడం లేదు. చాలా మైదానాల్లో తాగునీటి సౌకర్యం కూడా లేదు. చాలాచోట్ల అసలు మరుగుదొడ్లే లేవు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో క్రీడా క్లబ్సులు ఏర్పాటు చేస్తున్నామంటూ ఆర్బాటింగా ప్రకటించారు, అవి ఎక్కడైనా పనిచేస్తున్నాయా? స్రోర్ట్స్ క్లబ్బులకు జగన్ స్పోర్ట్స్ క్లబ్బులంటూ పేరు మార్చుకున్నారు తప్ప నిధులు కేటాయించలేదు.
పాఠశాలల్లో మైదానాల కొరత
టీడీపీ హయాంలో గ్రామ స్ధాయిలో క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు మండల, నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఒక్కో కేంద్రానికి రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు కేటాయించారు. దాదాపు 50 నియోజకవర్గాల్లో పనులు అసంపూర్తిగా జగన్ రెడ్డి ప్రభుత్వం నిలిపేసింది. ఇవి పూర్తయితే క్రీడాకారులకు గ్రామ స్ధాయిలో శిక్షణ అందుబాటులోకి వచ్చేది, భవన నిర్మాణాలు పూర్తయిన చోట వీటి నిర్వహణకు నిధులివ్వటం లేదు. ఆట స్ధలాలు లేని పాఠశాలలకు స్థలాలు కొనుగోలు చేసి ఇస్తామని 2021 జూన్ లో సీఎం చెప్పారు, 22 వేల బడుల్లో ఆట స్ధలాలు కొనివ్వటం దేవుడెరుగు, కనీసం ఉన్నవాటి నిర్వహణకు కూడా నిధులివ్వటం లేదు. దాదాపు 20,010 ప్రభుత్వ పాఠశాలల్లో ఆట స్థలాలు లేవు, వందలాది పాఠశాలల్లో పీఈటీ మాస్టార్లు లేరు. కొత్తగా ఒక్కరినీ కూడా నియమించలేదు. పాఠశాలల్లో క్రీడలకు జగన్ ప్రభుత్వం ఏడాదికి కేవలం రూ. 2 కోట్లు మాత్రమే కేటాయించారు, కానీ వాటిని కూడా ఖర్చు చేయటం లేదు. విద్యా కానుకలో అధనంగా క్రీడా దుస్తులు, బూట్లు ఇస్తామన్న జగన్ రెడ్డి హామీలకు మాటలకే పరిమితమయ్యాయి.
జాతీయ క్రీడల్లో దిగజారిన రాష్ట్ర ప్రతిభ
జాతీయ స్ధాయి పాఠశాలల క్రీడల్లో రాష్ట్రం 15వ స్ధానంలో ఉంది, కరోనా తర్వాత ఈ ఏడాది మే నెలలో అండర్ -19 పోటీల్లో కేవలం మూడు బంగారు పతకాలు మాత్రమే వచ్చాయి. జీవో 74 ప్రకారం 33 అంశాల్లో క్రీడలు నిర్వహించాల్సి ఉంది, వీటన్నింటికి విద్యార్దులను సన్నద్దం చేయాలంటే ప్రభుత్వం పాఠశాల క్రీడలకు రూ. 2 కోట్లు మించి కేటాయించటం లేదు. వాటిని కూడా సక్రమంగా విడుదల చేయటం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో దాతల నుంచి చందాలు తీసుకుని ఆడిరచాల్సిన పరిస్ధితి నెలకొంది. జాతీయ అంతర్జాతీయ స్ధాయిలో ఆడిన క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదు.
రాజకీయ పునరావాస కేంద్రాలుగా క్రీడా సంఘాలు
పుట్ బాల్ కి, వాలీబాల్ కి తేడా తెలియని రోజాకు క్రీడాశాఖ కట్టబెట్టారు, వైసీపీ నేతలు క్రీడా సంఘాల్లో చొరబడి రాజకీయాలు చేస్తున్నారు.ఏసీఏ ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షునిగా డిల్లీ లిక్కర్ స్కాంలో నిందితునిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డిని నియమించారు. ఒలంపిక్ సంఘాన్ని సైతం కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. శాప్ ని అవినీతికి నిలయంగా మార్చారు. టెండర్లలో ఎండీ అవినీతికి పాల్పడ్డారని శాఫ్ డైరక్టర్లే బహిరంగంగా ఆరోపించారు. లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుని అర్హత లేనివారికి స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ వన్ ఉద్యోగాలకు సర్టిఫికెట్లు ఇచ్చారని, కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం ఎక్కువ రేటుకు టెండర్లు అప్పగించారని, రూ. 65 లక్షలకు టెండర్ వేస్తే.. అందులో పది రెట్లు అధికంగా ధరలు కోట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. 150 హాకీ స్టిక్స్ రూ. 750 కి ఇవ్వమంటే, ఒక్కో స్టిక్ కు రూ. 10,020కి బిల్ పెట్టారని శాఫ్ డైరక్టర్లే బహిరంగంగా చెప్పారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా వైసీపీ పాలనలో క్రీడా రంగం అభాసుపాలయ్యింది.
టీడీపీ హయాంలో క్రీడలకు మహోన్నత దశ
టీడీపీ ప్రభుత్వం, శాప్, ఒలింపిక్, క్రీడా సంఘాలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి బాటలు వేశాయి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా,నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులను తయారుచేసి, రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. మంగళగిరిలో 24 ఎకరాల్లో 34,000 సీటింగ్ సామర్థ్యంతో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పట్టుదలతో 2002లో హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రంగా జాతీయ క్రీడలు, 2003లో ఆఫ్రో ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చిన ఘన మైన చరిత్ర ఆంధ్రప్రదేశ్ కి ఉంది. చంద్రబాబు నాయుడు ఉప్పల్, గచ్చిబౌలి, సరూర్ నగర్ క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు ఎల్బీ స్టేడియంలో టెన్నిస్ కోర్టు నిర్మాణం చేపట్టి టెన్నిస్ క్రీడకు ప్రోత్సాహం అందించారు. చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో కరణం మల్లీశ్వరి, పుల్లెల గోపీ చంద్, కోనేరు హంపి, పీవీ సింధు వంటి వారు తమ ప్రతిభతో ఆంధ్రప్రదేశ్ పేరును విశ్వవ్యాప్తం చేశారు. చంద్రబాబు నాయుడు పుల్లెల గోపిచంద్ అకాడమికీ హైదారాబాద్ (2003) లో 5 ఎకరాలు, అమరావతి 2017 లో 12 ఎకరాలు కేటాయించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ కనపర్చిన వారిని చంద్రబాబు నాయుడు అన్ని విధాల ప్రోత్సహించారు. కానీ నేడు జగన్ రెడ్డి క్రీడారంగాన్ని నిర్వీర్వం చేసి కేవలం ఓట్ల కోసం ఆడుదాం ఆంధ్రపేరుతో ఆడుతున్న డ్రామాను యువత గమనిస్తున్నారు. ఈ క్రీడలతో యువతకు ఒరిగేదేంటి, ఉపయోగం లేని పధకాలు, సర్టిఫికెట్లతో ఎవరిని మోసం చేస్తారు? అందుకే యువతంతా ఆడుదాం ఆంధ్ర కాదు.. జగన్ రెడ్డి చేతుల్లోనుంచి ఆంధ్రని కాపాడుదాం అంటూ నినదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని చిత్తుగా ఓడిరచి తగిన గుణపాఠం చెప్పేందేందుకు యువత అంతా సిద్దంగా ఉన్నారు.