- ఐదేళ్లలో అంతా విధ్వంసమే..!
- టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్
అమరావతి, చైతన్యరథం: వైసీపీ 5 ఏళ్ల పాలనలో విద్యతో పాటు అనేక రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్లు సీం జగన్ ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అబద్దాలు చెప్పడంలో జగన్ రెడ్డి దిట్ట అని ఎద్దేవా చేశారు. ఆయన తీసుకొచ్చిన మార్పులు ఏంటని,విధ్వంసం, నాశనం చెయ్యడం తప్ప,మార్పులు తీసుకు రావడం కూడా జగన్‌రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. ఈ మేరుకు ఆదివారం ఆయ న పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయన ‘‘టీడీపీ ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయం బర్స్ మెంట్ ఇస్తే వైసీపీ ప్రభుత్వం దానిని 10లక్షల మంది విద్యార్దులకు కుదించింది. పీజీ విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ను రద్దు చేసి వెనకబడిన వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేశారు. వసతి గృహాల్లోను విద్యార్ధులకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోవడం, బిల్లులు చెల్లించకుండా వేలాది మంది విద్యార్ధులను పస్తులుంచడం మీరు తీసుకొచ్చిన మార్పునా జగన్‌రెడ్డి? గడచిన 5 ఏళ్లలో 4,709 పాఠశాలలు మూతపడటం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చి న మార్పులా జగన్‌రెడ్డి? రైతులను ఉద్ధరి స్తానని అధికారంలోకివచ్చిన జగన్ మాయ మాటలతో రైతులను వంచించారు. రైతులు అప్పుల భారంతో కుప్పకూలుతుంటే, మరో పక్క ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేసాం, మాది రైతు పక్ష పాత ప్రభుత్వం అని బాకాలుదు కోవడం సిగ్గుచేటు. నేష నల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశంలోనే రైతు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్ధానంలో ఉంది.పండిరచిన పంట లకు గిట్టు బాటుధర కాదు, మద్దతు ధర కూడా దక్కడం లేదు. తెలుగుదేశం మిగు లు విద్యుత్ సాధించి కరంట్ కోతలు లేని రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే,విద్యుత్తు వ్యవస్థ ను సంక్షోభంలోకి నెట్టి రాష్ట్రాన్ని అంధ కారం చేసిన ఘనత జగన్‌రెడ్డిది. టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్తుచార్జీ లు పెంచలేదు, 5 ఏళ్లలో 9సార్లు విద్యుత్తు చార్జీలు పెంచి రూ.54 వేలకోట్ల భారం మోపిన ఘనత జగన్‌రెడ్డిదే.
టీడీపీ హయాంలో రూ.67వేల కోట్లు ఖర్చుచేసి సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించి, పట్టిసీమ నిర్మించి నదుల అను సంధానం చేశాం. 72శాతం పోల వరం పూర్తిచేస్తే.. సాగునీటి ప్రాజెక్టు లను మొండి గోడలుగా మిగిల్చింది జగన్ రెడ్డినే..! యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించింది, నిరుద్యోగ భృతి ఇచ్చింది తెలుగుదేశం కాగా. నిరుద్యోగం పెం చింది, నిరుద్యోగ భృతి రద్దుచేసిన వ్యక్తి జగన్‌రెడ్డి. బీసీ సబ్ ప్లాన్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగించి చంద్రబాబునాయుడు ఆవర్గాల అభ్యున్నతికి పాల్పడితే జగన్ రెడ్డి మాత్రం ఆనిధులుదారి మళ్లించి ద్రోహం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వానికి, జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ తేడా చాలా? ఇంకా కావాలా? జగన్‌రెడ్డి? ఇలా చెప్పుకుంటూ పోతే మీ 5ఏళ్ల పాలన లో విధ్వంసానికి, వికృతాలకు అంతే ఉండ దు. మీరా గత ప్రభుత్వానికి, వైసిపి ప్రభు త్వానికి తేడా గమనించమని ప్రజల్ని కోరేది? మీరేం చేశారో చెప్పే ధైర్యం లేక చంద్రబాబును విమర్శిస్తూ మీ పబ్బం గడుపు కొంటు న్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బహిరంగ సభల్లో చెబుతున్న పచ్చి అబద్దాలు వినలేక ప్రజలు పారిపోతున్నారు, అబద్దాలు, మోసాలతో ప్రజల్ని కొంతకాలమే మోసం చేయగలరు’’ అని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.