- టీడీపీ 16లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ అందిస్తే జగన్‌రెడ్డి 8 లక్షలకు కుదించారు
- బటన్ నొక్కుడు పేరుతో బడుగు బలహీన విద్యార్ధుల పీకనొక్కుతున్న జగన్‌రెడ్డి
అమరావతి: జగన్‌రెడ్డి బటన్ నొక్కుడు పేరుతో బడుగు బలహీన విద్యార్ధుల పీకనొక్కుతున్నారని టీడీపీ నాయకుడు, మాజీమంత్రి కేఎస్ జవహర్ విమర్శించారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్నే జగన్‌రెడ్డి విద్యా దీవెనగా మార్చారని విమర్శించారు. గత చంద్రన్న ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ అమలు చేస్తే జగన్‌రెడ్డి ప్రభుత్వం కేవలం 8.09 లక్షల మందికి, అది కూడా విడతల వారీగా అందిస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో జవహర్ ఆరోపించారు. అంటే దాదాపు 8 లక్షల మంది విద్యార్ధులను జగన్ మోసం చేశారు. జగన్ ప్రభుత్వం మొదట 11 లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకాన్ని అమలు చేసి ఇప్పుడు 8 లక్షల మందికి తగ్గించింది. అంటే జగన్ హయాంలోనే దాదాపు 3 లక్షల మంది విద్యార్ధులకు కోతపెట్టారు. ‘సాక్షి’లో ప్రభుత్వ ప్రకటన మేరకు జగన్‌రెడ్డి ప్రభుత్వం ‘విద్యాదీవెన’ కింద 8,09,039 విద్యార్థులకు త్రైమాసికానికి రూ.584 కోట్లు విడుదల చేయనున్నారు. అంటే ఒక్కో విద్యార్ధికి ఒక్కో విడతకు రూ.7,218 చొప్పున సగటున సంవత్సరానికి రూ.28,872 ఫీజు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని జవహర్ దుయ్యబట్టారు.
ఇప్పటికి వరకు 4 విడతలు ఎగ్గొట్టారు…
2023 అక్టోబర్-డిసెంబరు త్రైమాసికం ముగుస్తు న్నా జులై-సెప్టెంబరు త్రైమాసికానికి శుక్రవారం నిధు లు విడుదల చేస్తూ… క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నామనటం అబద్ధాలు చెప్పడం కాదా? అంతేకా కుండా ఇప్పటికి వరకు 4 విడతలు ఎగ్గొట్టారు. శుక్ర వారం వచ్చిన ప్రకటన ప్రకారమే ప్రభుత్వం ప్రతి విద్యార్థికి రూ.28,872 నష్టం కలిగించింది. దీనికి బాధ్యులెవరు జగన్‌రెడ్డీ? ఈ మేరకు మొత్తం 11 లక్షల విద్యార్థులకు జగన్‌రెడ్డి రూ.3,176 కోట్ల మేరకు వంచించారు. ఇదేనా క్రమం తప్పకుండా ఫీజులు విడు దల చేయడం అంటే? టీడీపీ 16లక్షల మంది విద్యా ర్ధులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ అమలు చేస్తే జగన్‌రెడ్డి 11 లక్షల మందికి కుదించి విద్యాదీవెనను ప్రారంభిం చారు. అంటే 5లక్షల మందిని తొలగించారు. దీని వలన ఈ 5 లక్షల మంది ఇప్పటివరకు రూ.6,496 కోట్ల సాయాన్ని కోల్పోయారు. మొత్తం మీద జగన్‌రెడ్డి నయవంచనతో విద్యార్థులు రూ.9,672 కోట్లు (3,176ం6,496) విద్యాదీవెన కింద కోల్పోయారు. వీటితో పాటు యూజీ, పీజీ విద్యార్ధులకు 2020-21కి రూ.600 కోట్లను కరోనా సమయంలో క్లాసులు జరపలేదనే సాకుతో ఎగవేశారు. ప్రైవేటు కళాశాలల్లో పీజీ విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ 2020-21 నుంచి సర్కారు నిలిపివేసింది. అప్పటికే దీనికి సంబం ధించి రూ.450 కోట్లు బకాయిలు ఉన్నాయి. అంటే మొత్తంగా దాదాపు రూ.10,722 కోట్లు విద్యార్ధులకు ఎగనామం పెట్టిందని జవహర్ విమర్శించారు.
బకాయిలతో విద్యార్థులకు అవస్థలు…
గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ నగదును నేరుగా కళాశాలలకు ఇచ్చేది. అదిపోగా మిగిలిన ఫీజు ఏదైనా ఉంటే అది మాత్రమే విద్యార్థులు చెల్లించాలి. దీనివల్ల ఒకవేళ ప్రభుత్వం ఏవైనాకారణాలతో ఆలస్యం చేసినా అది ప్రభుత్వం, కాలేజీల మధ్య వ్యవహారంగా ఉండేది. కానీ, వైసీపీ ప్రభుత్వం దాన్ని కాలేజీలు, తల్లిదండ్రుల మధ్యకు తీసుకొచ్చింది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రాకపోవడంతో విద్యార్థులు అవస్థ లు పడుతున్నారు. ఫీజులు చెల్లించలేదని కాలేజీ యాజ మాన్యాలు విద్యార్థుల చదువులు పూర్తైనా కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. శ్రీ కృష్ణదేవరాయ వర్సిటీలో 24 మంది విద్యార్థులను ఫీజు చెల్లించలేదని 2022 ఆగస్టులో నాలుగో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించలేదు. డిసెంబర్ 17, 2023న నెల్లూరు జిల్లా కావలిలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ డబ్బులు అందలేదని దాదాపు 30మంది ఫైనల్ ఇయర్ నర్సింగ్ విద్యార్థులను నర్సింగ్ కళాశాల బయటకు పంపేశారు.
ఉన్నత చదువుల కలను చిదిమేశారు…
ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు 2020-21 విద్యాసంవత్సరం నుం చి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలు నిలిపివేస్తూ జీవో నెం. 77ను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈపథకం నిలిపి వేతతో వారి ఉన్నత చదువుల కలను చెరిపి వేశారు. ఏపీలో విద్యలో నాణ్యత లేకపోవడంతో యూజీ, పీజీ విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. విడ తల వారీ పథకాలకు సైతం వందల కోట్లతో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. విద్యా దీవెన పథకానికి ఒక్కో విడతకి దాదాపు రూ.10కోట్లు ప్రకటనలకు ఖర్చు అయితే 4విడతలకు అయ్య ఖర్చు రూ.40కోట్లు. అంటే నాలుగేళ్లుగా రూ.160 కోట్లు ఒక్క ప్రకటనలకే ఖర్చు చేశారు. ప్రకటనలకు పెట్టిన ఖర్చుతో దాదాపు 50 వేల మంది విద్యార్ధులకు మేలు జరిగి ఉండేది. విద్యా ర్ధుల మేలు కన్నా జగన్‌రెడ్డి పత్రిక సాక్షికి మేలు చేయ డమే మిన్నా అని జవహర్ ప్రశ్నించారు.