- పథకం ప్రకారమే బ్యారేజీపైకి బోట్లు
- ప్లాన్ జగన్‌ది.. అమలు చేసింది తలశిల, నందిగం
- కుట్రలు కప్పిపెట్టుకునేందుకే ప్రభుత్వంపై విషప్రచారం
- వైసీపీపై మండిపడ్డ మంత్రి లోకేష్
అమరావతి(చైతన్యరథం): విజయవాడ వరద ముంపుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ వైసీపీ విషప్రచారం చేస్తోందంటూ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల కుట్రలు ప్రజలకు తెలియనివ్వడకుండా ఉండేందుకు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో లోకేష్ పోస్ట్ చేశారు.
గతంలో అధికారం అండతో సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి, 50మందిని బలి తీసుకున్నారు. అలాగే ఐదు ఊళ్లను ఆనవాలు లేకుండా చేశారు. ప్రస్తుత వరదల సమయంలో విజయవాడతోపాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా చేసి లక్షలాది మంది జల సమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలయింది. ప్రకాశం బ్యారేజీని ఇనుప పడవలతో కూల్చేయాలనే కుట్రకు ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే, దానిని అమలు చేసింది వైసీపీ నేతలు ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అని పేర్కొన్నారు. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ సైకో జగన్ ముఠా విషప్రచారం చేస్తుందన్నారు. ఇక, ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనక కుట్ర కోణం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిన సంగతి తెలిసిందే. ఈ పడవలు ఢీకొని బ్యారేజీ దెబ్బతింటే , ప్రభుత్వాన్ని బద్నాం చేయవచ్చుననే అజెండాతోనే వైసీపీ నేతలు అనుచరుల ద్వారా ఘటనకు పాల్పడి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.