- హృదయ విదారక అవమానాలను ఎత్తి చూపిన నేతలు
- చంద్రబాబు హయాంలో లభించిన ఆదరణ, నేటి దుస్థితిల వెల్లడి
- దళితులపై వైసీపీ మూకలు మూత్రం పోయడం పట్ల తీవ్ర ఆగ్రహం
- జగన్‌పాలనకు, వైసీపీకి సమాధి కట్టి దళితులను రక్షించాలని పిలుపు
- ఎంఎస్ రాజు సైకిల్ యాత్ర ముగింపు సందర్బంగా దళిత సమ్మేళన సభ
అమరావతి, చైతన్యరథం: టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుండి మంగళగిరి వరకు 616 కిలోమీటర్ల మేరుకు నిర్వహించిన సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమ వారం నాడు దళితులంతా బాబుతోనే నినాదంతో దళి తుల సమ్మేళన సభ జరిగింది. వైఎస్ జగన్‌రెడ్డి పాలన లో దళితులకు జరుగుతున్న హృదయ విదారకర అవ మానాలను నేతలు ఏకరవు పెట్టడం సభలో పాల్గొన్న దళితులను కదిలించింది. వైసీపీ మూకలు దళితుల నోట్లో మూత్రం పోయడం లాంటి అవమానాలు, దాడు లు,అన్యాయలపై సభలో పాల్గొన్న దళితులల్లో ఆగ్రహం వ్యక్తమయింది. చంద్రబాబు పాలన కాలంలో దళితు లకు లభించిన ఆదరణ, ప్రస్తుత జగన్‌రెడ్డి పాలనలో జరుగుతున్న అవమానాలను సభలో పాల్గొన్న నాయకు లు ఎత్తిచూపారు. జగన్‌రెడ్డి పాలనకు, వైసీపీకి చరమ గీతం పాడితేనే దళితులకు రక్ష అని పేర్కొన్నారు. జగన్ రెడ్డి పాలనలో దళితులపై జరిగినన్ని దాడులు, వారు ఎదుర్కొన్న అవమానాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ జరగలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం లోని దళిత మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉన్న మొత్తం దళితుల ఆత్మగౌరవాన్ని జగన్‌రెడ్డి కాళ్ల ముందర తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యఅతిధిగా పాల్గొనగా… టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్వాగతోపన్యాసం చేశారు. రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్ సమన్వయకర్తగా వ్యవహరించారు.