- రైస్ మిల్లు వర్కర్ నుంచి పరిశ్రమనే శాసించేస్థాయి వరకు
- ఇసుక నుంచి టిడిఆర్ బాండ్ల దాకా అన్నింటా దోపిడీ పర్వమే
- తణుకు నియోజకవర్గంలో మండలానికో వైసిపి బ్రోకర్‌తో కలెక్షన్లు
- అడ్డగోలు సంపాదనతో పొరుగు రాష్ట్రాల్లోనూ వందల కోట్ల ఆస్తులు
- ఎందెందు వెదికినా అందందే కారుమూరి అక్రమాలు
అమరావతి : ఒక రైస్ మిల్ వర్కర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఏకంగా ఒక రాష్ట్రంలో రైస్‌మిల్లింగ్ పరిశ్రమనే శాసిం చేస్థాయికి చేరడమంటే మామూలు విషయం కాదు. ఎవరో మహానుభావుడు జీవితంలో కష్టపడి ఉన్నతశిఖ రాలకు చేరుకున్నారని మీరు అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. డబ్బు సంపాదించేందుకు అడ్డదా రులను అవపోసనపట్టి అందుకు రాజకీయాన్ని పెట్టు బడిగా మార్చుకొన్నారు ఆనేత.అధికారాన్ని అడ్డుపెట్టు కొని వేలకోట్లు ఏవిధంగా దోచేయొచ్చనే విషయంలో యావత్ ప్రపంచంలో కేస్‌స్టడీగా నిలచిన జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని దోపిడీ పర్వాన్ని యథేచ్చగా కొన సాగిస్తున్నారు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. నియోజకవర్గం లో మట్టి, ఇసుక నుంచి టిడిఆర్ బాండ్ల కుంభకోణం వరకు 40నెలల్లో 1400కోట్లరూపాయలకు దోచుకొని చరిత్ర సృష్టించారాయన. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే సిద్ధాంతాన్ని నమ్మిన మంత్రి కారుమూ రి… భూములు, మద్యం,ఇసుక, బియ్యం.. ఇలా దేన్నీ వదలకుండా దోపిడీ అడ్డగోలు దోపిడీపర్వాన్ని కొనసా గించారు. తణుకు నియోజకవర్గంలో కారుమూరి ఆగ డాలకు,దోపిడీలకు,దౌర్జన్యాలకు అడ్డూ అదుపూలేకుం డా పోయింది. ప్రభుత్వ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టు కుని పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను సైతం చేజిక్కిం చుకుంటున్నారు. వైసిపిలోనే గతమంత్రివర్గంలో పని చేసిన ఒక బడానేత వద్ద పూర్వాశ్రమంలో వర్కర్‌గా పనిచేసిన కారుమూరి అనుభవానికి అధికారం తోడైం ది. ఇంకేముంది నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం మొత్తం రైస్ మిల్లర్లను సిండికేట్‌గా మార్చి రైతులను అడ్డంగా దోచుకుంటున్నారు. మరోవైపు రేషన్ బియ్యా న్ని అక్రమంగా మిల్లులకు తరలించి అక్కడి నుంచి పాలిష్ చేయించి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలి స్తూ 7వేలకోట్ల బియ్యం కుంభకోణంలో కారుమూరి కీలకపాత్ర పోషిస్తున్నాడు.
టిడిఆర్ బాండ్ల కుంభకోణం
ఉభయ తెలుగురాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని విధం గా టిడిఆర్ బాండ్ల పేరుతో భారీకుంభకోణానికి కారు మూరి తెరలేపారు. ఒక తణుకు మున్సిపాలిటీలో సుమారు 700 కోట్లరూపాయల మేర టిడిఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందంటే కారుమూరి చేతివాటం ఎం త చాకచక్యంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంమై జగన్ రెడ్డి ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. ఈయన చేసిన పాపానికి తణుకులో ఒక మున్సిపల్ కమిషనర్ సైతం బలయ్యాడు.
బ్రోకర్లతో కారుమూరి దోపిడీ పర్వం
తన చేతికి మట్టి అంటకుండా మండలానికొక వైసిపినేతను బ్రోకర్‌గానియమించుకున్న మంత్రి కారు మూరి నాగేశ్వరరావు యథేచ్చగా దోచుకుంటున్నారు.
1. పోలేపల్లి వెంకట ప్రసాద్: ఇతన్ని పీబీఆర్ అంటారు. తెలంగాణలో కారుమూరికి ఉన్న ఆస్తులు, పరిశ్రమలు మొత్తం ఈయనే పర్యవేక్షిస్తూ ఉంటారు.
2. బోడపాటి నరేంద్ర: సెటిల్‌మెంట్లు, భూదందాలు, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసి అప్పజెప్పే బాధ్యత.
3. శ్రీమన్నారాయణ:కారుమూరి నాగేశ్వరరావుకు పీఏ గా చెలామణి అవుతూ ప్రతి దందాను ఇతనే మొదలుపెడతాడు. మంత్రి దగ్గరకు ఎవరు వచ్చి నా ధర నిర్ణయించేది, వసూలు చేసేది ఇతనే.
4. మల్లిరెడ్డి నాగార్జున: ఇసుక నుంచి డబ్బులు వసూ లు చేసే బాధ్యత ఇతనిదే.తణుకులోని ఇసుక లారీ వచ్చిందంటే రూ.5వేల నుంచి రూ.10వేలు వసూ లు చేస్తారు.
5. కావలవరపు రాజ్‌కోటి: కారుమూరి నాగేశ్వరరావు కు డ్క్రెవర్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తూ పోలీసుల దగ్గర,కాంట్రాక్టరు దగ్గర డబ్బులు వసూ లు చేసే బాధ్యత.
6. వల్ల సందీప్: ఇతను మంత్రి యొక్క బ్లాక్ మనీ మొత్తం కంపెనీలలో పెట్టడం, మనీలాండరింగ్ లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు.
ఇసుకనుంచి సున్నపురాయి వరకు
అడ్డగోలు దోపిడీకి ఇసుక నుంచి మట్టి, సున్నం వరకు దేనిని కారుమూరి వదల్లేదు. ఇసుక దందాలో మాత్రం మిగతా మంత్రుల కంటే ముందున్నాడు. నియోజకవర్గంలోని పెండ్యాల,కూసన్నమర్రు ప్రాంతా ల్లోని ఇసుక రీచ్‌ల నుంచి రోజుకు వేలాది లారీలను అక్రమంగా తరలిస్తూ వందల కోట్లు ఆర్జించారు. కరో నా సమయంలో ఇసుక లెక్కల్లో తేడాలొస్తే… పంది కొక్కులు తినడం వల్లే ఇసుక మాయమైందంటూ కొత్త సందేశమిచ్చారు.
ద్వారకా తిరుమల వద్ద 10 ఎకరాల పైన సున్నపు రాయి గనులను ఆక్రమించుకుని నెలకు రూ.2కోట్ల చొప్పున ఆర్జిస్తున్నారు. ఒక్క గోపాలపురంలోనే 3 చోట్ల మైనింగ్ నిర్వహిస్తూ రూ.10 కోట్ల మేర నెలకు వసూలు చేసి బెంగుళూరుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పంపిస్తున్నారు.
భూబకాసురుడు కారుమూరి
తణుకు నియోజకవర్గంలో ఖాళీ జాగా కనిపిం చిందంటే సాయంత్రంకల్లా మంత్రి అనుచరులు వాలి పోతారు. మూడున్నరేళ్లలో 1000ఎకరాలకు పైగా భూములను అన్యాక్రాంతం చేశారు. తణుకు నియోజ కవర్గంలో రైతు ప్రయోజనాల కోసం పూర్వీకులు తవ్వించిన చెరువును సైతం మింగేశా రు.అత్తిలిలో 30ఎకరాలు, తణుకులో 12ఎకరాలు, ఇరగవరంలో 38ఎకరాలు మొత్తం 150ఎకరాలు.. మూడున్నరేళ్లలో అన్యాక్రాంతం చేశారు. ఇవేకా కుండా జి.చోడవరం లో 30ఎకరాలు నాగేశ్వరరావు పేరు మీద, 28 ఎక రాలు ఆయన సతీమణి పేరుమీద, కుమారుడి సునీల్ పేరు మీద 18ఎకరాలు ఉన్నాయి. నిజాం పార్కులోని సర్వే నెం.11/3లో 10ఎకరాలు, ప్రకాశం జిల్లాలోని చీరాలలో 8 ఎకరాలు వీళ్ల పేరు మీద ఉన్నాయి. రాజమండ్రి విమానాశ్రయం సమీపంలోని బూరు గు పూడి వద్ద 12ఎకరాల భూమిని అధికారంలోకి రాగా నే కుటుంబసభ్యుల పేరు మీద రాయించుకు న్నారు. రాజమండ్రి బస్టాండ్ సమీపంలో 2కమర్షియల్ అపా ర్ట్‌మెంట్లు కూడా కొనుగోలు చేశారు. తణుకు పట్టణం లో రంగారావు అనే పెద్దమనిషికి చెందిన 3వేల గజా లను అక్రమంగా చేజిక్కించుకున్నారు.ఈస్థలాన్ని కొను గోలు చేసిన వారిని బెదిరించి లాక్కున్నారు. ఇలాంటి భూదందాలు మూడేళ్లలో 20కి పైగా జరిగాయి.
తెలంగాణాలో ఆస్తులు
ఒకప్పుడు హైదరాబాద్‌వస్తే రూ.100రూమ్‌లో అద్దె కుండే కారుమూరి నాగేశ్వరరావు నేడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వందల కోట్లతో పరిశ్రమలు పెట్టే స్థాయికి ఎదిగారు. షాద్‌నగర్ సమీపంలో స్టీల్ పరి శ్రమ పెట్టారు. దీనికోసం రూ.70 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.శంషాబాద్ దగ్గరమరో రూ.80 కోట్లతో ఇంకో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ `పూణె రోడ్డులో అంటే పటాన్‌చెరువుకు 40 కి.మీ. దూరంలో 160ఎకరాల భూమిని కొనుగోలు చేసేందు కు రూ.33 కోట్లు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవికాకుండా హైదరాబాద్ నగరం నడిబొడ్డున 6నివాస స్థలాలతోపాటు 2 విల్లాలను కొనుగోలు చేశారు.
బెంగుళూరులోనూ భూములు
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగుళూరులో కూడా పెద్ద ఎత్తున భూములు, విల్లాలు కొనుగోలు చేశారు. బెంగుళూరులో కూతురి పేరుతో 10 ఎకరా లు, అల్లుడి పేరుతో 8ఎకరాలు, 3విల్లాలు, 1 కమర్షి యల్ కాంప్లెక్స్ ఉన్నట్లు సమాచారం. పౌరసరఫరాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి బెంగుళూరుకు నెలకో సూట్‌కేసు పంపించడం ఠంచ నుగా జరుగుతోంది. అల్లుడు దిలీప్‌కుమార్ అంటే మంత్రి కారుమూరికి ఆరో ప్రాణం.అతన్నిపార్టీ మార్చి మరీ ఎమ్మెల్యే చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. కర్నాటక నుంచి ఎవరొచ్చినా ఖాళీగా తిరిగే అల్లుడి గురించే గొప్పలు చెబుతూ ఉంటారు. అతని కోసమే పెద్దఎత్తున బెంగుళూరులో ఆస్తులు కూడబెడుతున్నా రని సమాచారం. ఇలా కారుమూరి అవినీతి చరిత్ర చెప్పుకుంటూపోతే ఓ మహా గ్రంథమవుతుంది. ప్రజా స్వామ్యంలో ప్రజలే ప్రభువులు… కారుమూరి వంటి అక్రమార్కులకు ఏ శిక్షవేయాలని విజ్జులు, చైతన్యవం తులై తణుకుప్రజలే నిర్ణయించుకోవాలని చైతన్యరథం విజ్జప్తిచేస్తోంది.