- డీజీపీ. ఇంటెలిజెన్స్ చీఫ్‌లు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
- అధికార పార్టీతో అంటకాగుతూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారు
- వారిని తక్షణం మార్చేసి, కొత్తవారిని నియమించాలి
న్యూఢిల్లీ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి రాజ్యసభ మాజీసభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాప్ట్వేర్ సాయంతో లోకేష్ ఐ ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు ఆపిల్ సంస్థ నుండి భద్రతా సందేశాలు సందేశాలు వచ్చాయ ఈసీకి రాపిన లేఖలో కనకమేడల తెలిపారు. ఇలాంటి సందేశాలే లోకేష్‌కు ఈ ఏడాది మార్చిలో సైతం వచ్చాయన్నారు. రాష్ట్ర డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇప్పటికే అనేకమార్లు ఈసీ దృష్టికి తీసుకొచ్చాం.
రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లు ఎన్డీఏ కూటమిలోని సభ్యులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. గత రెండేళ్లుగా ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం. పీఎస్ఆర్ ఆంజనేయులు అధికారపార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ఎన్నికల నేపధ్యంలో అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వీరిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకుని.. వారి స్థానాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని కనకమేడల కోరారు.