చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్‌

విజ్ఞప్తుల త్వరితగతిన పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న మంత్రి

by చైతన్యరధం
Nov 5, 2024 at 6:00am
in ముఖ్య వార్తలు
కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న ప్రజాదర్బార్‌
  • కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 45 ప్రజాదర్బార్‌ల నిర్వహణ
  • ప్రజల నుంచి 4,753 విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి లోకేష్‌
  • 2,219 సమస్యలకు పరిష్కారం చూపిన ప్రజాదర్బార్‌
  • విన్నపాల్లో సగానికి పైగా రెవెన్యూ, హోంశాఖకు సంబంధించిన సమస్యలే
  • విజ్ఞప్తుల త్వరితగతిన పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న మంత్రి

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, అనుకోని ఆపద ఎదురైనా మొదటగా గుర్తుకువచ్చేది విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ నేతృత్వంలో చేపడుతున్న ప్రజాదర్బార్‌. ఇక్కడకు వస్తే చాలు.. తమ సమస్యలకు, కన్నీళ్లకు పరిష్కారం లభించినట్లేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. మంత్రి లోకేష్‌కు తమ గోడు వినిపిస్తే.. ఆలకించి అండగా నిలుస్తారని గట్టిగా నమ్ముతున్నారు. దీంతో ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మొదట మంగళగిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్బార్‌ ఏర్పాటుచేయగా.. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా బాధితులు తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు.

ఇప్పటివరకు 2,219 సమస్యలకు పరిష్కారం
ప్రజాదర్బార్‌ ద్వారా ఇప్పటివరకు 4,753 విజ్ఞప్తులు స్వీకరించారు. 2,219 సమస్యలకు మంత్రి నారా లోకేష్‌ ప్రజాదర్బార్‌ పరిష్కారం చూపింది. విజ్ఞప్తుల్లో సగానికి పైగా భూవివాదాలు, హోంశాఖకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. తర్వాత మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పాఠశాల విద్య, ఇళ్ల నిర్మాణం, పంచాయతీ రాజ్‌ శాఖకు సంబంధించిన విజ్ఞప్తులు ఉన్నాయి. వీటితో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ అదనంగా 863 మంది ప్రజాదర్బార్‌ ద్వారా విన్నవించారు. ఆయా విన్నపాల్లో మొదటి విడతగా 350 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. త్వరలోనే వీరికి నియామక పత్రాలు అందించనున్నారు.
ప్రజాదర్బార్‌ ద్వారా పరిష్కరించిన సమస్యలు
– ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ మంజూరుచేయకపోవడంతో చనిపోయిన తన భర్త పేరుపై ఉన్న 12.98 ఎకరాల వ్యవసాయ భూమిని తమ కుటుంబ సభ్యులతో కలిసి పార్టిషన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని పొన్నూరుకు చెందిన మాడభూషి సరోజిని విజ్ఞప్తి చేశారు. తన నలుగురి సంతానంలో ఒక కుమారుడు సహకరించనందున ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ మంజూరుకు తహశీల్దార్‌ నిరాకరించారని తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. సదరు సమస్యపై ప్రజాదర్బార్‌ యంత్రాంగం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తో విచారణ చేయించారు. అర్జీదారునితో ఫోన్‌లో సంప్రదించి కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కోసం సచివాలయంలో దరఖాస్తు చేయించారు. దీంతో సమస్య పరిష్కారమైంది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

– నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఇస్కపల్లి గ్రామానికి చెందిన పాదర్తి రామానాయుడు ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేష్‌ ను కలిసి తన సమస్యను విన్నవించారు. గ్రామంలో తన 4.95 ఎకరాల భూమిని సర్వేచేసి హద్దు రాళ్లు వేయాల్సిందిగా అధికారులను కోరారు. ఆ విధంగానే సర్వేచేసి హద్దురాళ్లు వేశారు. అయితే తన పొలం పక్కనే ఉన్న గుమ్మడి రామచంద్రయ్య సర్వేరాళ్లను పెకలించి భూమిని ఆక్రమించుకున్నారు. దీనిపై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేయగా హద్దురాళ్లు వేయటం వరకే తమ బాధ్యయత అని, పెరికేస్తే తమకు సంబంధం లేదని, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలని చెప్పారని రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆక్రమణకు గురైన తన భూమిని తిరిగి ఇప్పించి, న్యాయం చేయాలని మంత్రిని కోరారు. సదరు అర్జీని పరిశీలించిన మంత్రి లోకేష్‌ రెవెన్యూ అధికారులకు పంపించారు. వారు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి భూమికి హద్దులు ఏర్పాటుచేసి, సదరు భూమిని అర్జీదారునికి అప్పగించారు. దీంతో సమస్యకు పరిష్కారం లభించింది.

-పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన గుజ్జర్లపూడి ఉషా కుమారి ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేష్‌ను కలిసి తమ సమస్యను విన్నవించారు. తాము ఎస్సీ(హిందూ) సామాజికవర్గం అయితే .. గత వైసీపీ ప్రభుత్వంలో ఓసీగా నమోదుచేసి ప్రభుత్వ పథకాలు అందకుండా చేశారని ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదని వాపోయారు. తనకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సదరు అర్జీని సత్తెనపల్లి పదో వార్డు రెవెన్యూ సెక్రటరీతో విచారణ జరిపించారు. గుజ్జర్లపూడి ఉషాకుమారి కుటుంబం 2021లో విజయవాడలో నివసించేవారు. అనంతరం సత్తెనపల్లికి మారగా.. హౌస్‌ మ్యాపింగ్‌లో వీరి ఆధార్‌ కార్డుపై హిందూ(ఓసీ)గా నమోదు చేశారని గుర్తించారు. అర్జీదారురాలితో మళ్లీ దరఖాస్తు చేయించి, సదరు అర్జీదారురాలి హౌస్‌ మ్యాపింగ్‌లో కులాన్ని మార్చారు. రీ ఇష్యూ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ ఆప్షన్‌ ద్వారా అర్జీదారురాలికి ఆధార్‌ కార్డును అనుసరించి ఎస్సీ(హిందూ) కుల ధవీకరణ పత్రాన్ని మంజూరు చేశారు. దీంతో సమస్య పరిష్కారమైంది.

బారికేడ్లు, పరదాలు లేవు
గత వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో సతమతమైన వారి గోడు ఆలకించిన వారు లేరు. ఐదేళ్ల పాటు సమస్యలు పరిష్కారం కాక సామాన్యులు అనేక ఇబ్బందులు పడ్డారు. కష్టాలు చెప్పుకుందామని తాడేపల్లి ప్యాలెస్‌ కు చేరుకున్న బాధితులను నిర్దాక్ష్షిణ్యంగా బయటకు గెంటివేసిన పరిస్థితి. గేటు కూడా తాకనివ్వలేదు. ఐదేళ్లలో ఏనాడూ ప్రజలను తాడేపల్లి ప్యాలెస్‌లోకి రానివ్వలేదు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డును బ్లాక్‌ చేశారు. బారికేడ్లు, పరదాలతో ప్రజలను నిలువరించారు. దీంతో ప్రజాగ్రహానికి గురై వైసీపీ భారీ ఓటమిని చవిచూసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ లభించింది. ఐదేళ్లలో తాము పడిన బాధలు చెప్పుకునేందుకు ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్‌ నివాసానికి ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. వారిపట్ల ఎలాంటి ఆంక్షలు, సెక్యురిటీ నిబంధనలు లేవు.

ప్రజలను స్వయంగా కలుసుకుని విజ్ఞప్తుల స్వీకరణ
తుఫాన్లను సైతం లెక్కచేయకుండా సమస్యల పరిష్కారం కోసం బాధితులు ప్రజాదర్బార్‌కు తరలివస్తున్నారు. ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్‌ నిలబెట్టుకున్నారు. మంగళగిరి ప్రజలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకుంటున్న ప్రజలను స్వయంగా కలుసుకుని.. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి నారా లోకేష్‌ వినతులు స్వీకరిస్తున్నారు. పలు సమస్యలపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజాదర్బార్‌కు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఉండవల్లి నివాసంలోనే కాకుండా జిల్లాల పర్యటనలోనూ ప్రజాదర్బార్‌ నిర్వహించి అక్కడి ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం
ప్రజాదర్బార్‌కు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు. ప్రజా విజ్ఞప్తులను శాఖల వారీగా విభజించి ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. ప్రజాదర్బార్‌ సిబ్బందితో ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల వారీగా వచ్చిన సమస్యల్లో ఎన్ని పరిష్కారం చేయగలిగాం అని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. స్వయంగా తానే మంత్రులతో మాట్లాడి సంబంధిత శాఖల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రతి కేబినెట్‌ సమావేశంలో అప్పటివరకు తాను స్వీకరించిన విజ్ఞప్తులను మంత్రులకు అందజేస్తున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సిబ్బంది సంబంధిత శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2024

Next Post

వ్యవస్థలను కూలదోశారు!

మరిన్ని వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం
ఆంధ్రప్రదేశ్

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా
ఆంధ్రప్రదేశ్

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి
ఆంధ్రప్రదేశ్

ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

చైతన్యరధం
@ July 18, 2026
అభివృద్ధికి రుణహస్తం
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి రుణహస్తం

చైతన్యరధం
@ July 18, 2026
పోలవరానికి పర్యాటక శోభ
ఆంధ్రప్రదేశ్

పోలవరానికి పర్యాటక శోభ

చైతన్యరధం
@ July 15, 2026
పాలనలో టెక్నాలజీ అనుసంధానం
ఆంధ్రప్రదేశ్

పాలనలో టెక్నాలజీ అనుసంధానం

చైతన్యరధం
@ July 15, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist