అమరావతి : తుని నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు, తుని ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు పోల్నాటి శేషగిరిరావుపై స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అనుచరులు గొడ్డళ్లతో దాడి చేయడాన్ని తెలుగు దేశంపార్టీ తీవ్రంగాఖండిరచింది. శేషగిరిరావు ఇంట్లో ఉండగానే వైసీపీ గూండాలు దాడికి దిగారని తెలుగు దేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. జగన్ రెడ్డి గొడ్డలిపోటును మంత్రులు, ఎమ్మెల్యేలు వారస త్వంగా తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఆగడాలకు అడ్డుగా నిలబడి, ప్రజలకు జరుగు తున్న అన్యాయాలను నిలదీసే టీడీపీ నేతల గళాలను అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. తుని నియోజకవర్గంలో కాపులకు అన్యాయం చేస్తున్న వైసీపీ చర్యలను నిలదీస్తున్నందుకే శేషగిరిరావును చం పడానికి ప్రయత్నించారన్నారు. కాపు సామాజికవర్గా న్ని జగన్రెడ్డి, వైసీపీ నాయకులు గొడ్డళ్లతో వేటాడుతు న్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హత్యలు, దాడులు చేసి బెదిరించే ఈదుష్ట ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి, ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని పిలుపు ఇచ్చారు. హత్యాయత్నం చేసిన వారిని, చేయించిన వారిని కటకటాల వెనక్కి పంపే వరకు బాధితుల తరపున పోరాడుతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.