పులివెందుల: పులివెందుల మున్సిపల్ కార్యాలయం వైసీపీ కార్యాలయంగా మారిపోయిందని టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి నల్లగారి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ భాష ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ నాయకుల వ్యక్తిగత కార్యాలయంగా మార్చుకుని అనేక అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజలు చీదరించుకొంటున్న విషయం గమనిస్తే బాగుంటుందని హితువు పలికారు. ఈ మధ్య వై.యస్ మధు సూధన్‌రెడ్డి కుమారుడైన వై.యస్ అభిషేక్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం దారుణమన్నారు. అధికారులు సైతం ప్రభుత్వ పెద్దలకు ఒత్తాసు పలకడం భావ్యం కాదన్నారు. ప్రజల అవసరాల కోసం ఉపయోగించే ప్రభుత్వ కార్యాలయం కొంతమంది వ్యక్తుల అడ్డాగా మారాడం బాధాకరమన్నారు.