- రెవెన్యూ అధికారులు తక్షణమే కరకట్టల మరమ్మతు పనులు చేపట్టాలి
- కట్టలు బలహీనంగా ఉన్నచోట్ల పటిష్టతపై దృష్టి పెట్టాలి
- మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశం
అమరావతి(చైతన్యరథం): భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే విజయవాడ, గుంటూరు, రేపల్లెలోని తన క్యాంపు కార్యాలయాలను పునరావాస కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని అధికారులకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. గతంలో వరదల వల్ల కోతలకు గురైన కరకట్టల మరమ్మతు పనులను రెవెన్యూ అధికారులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కరకట్టలు దెబ్బతిన్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన చోట్ల కరకట్ట పనులను వెంటనే చేపట్టాలి. కరకట్టలు బలహీనంగా ఉన్నచోట్ల కట్ట పటిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. కట్ట కింద ఉండే గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయం చేసుకోవాలి. భారీ వర్షాలు , వరదల సమయంలో నదీ తీర గ్రామాల ప్రజలు ముంపు బారిన పడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోని కరకట్టల పటిష్టతపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఇప్పుడు మరింత ప్రమాదం ఏర్పడిరది. ఈ క్రమంలో మరమ్మతు పనులు చేపడుతూనే తీర గ్రామాల వెంబడి మరిన్ని కరకట్టలను నిర్మించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలి. ఈ వర్షాల వల్ల పాము కాట్లకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్టూ పాము కాటు మందులను అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి అనగాని సూచించారు.