చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ధాన్యం కొనాలని అడిగిన రైతులను ఎర్రిపప్పలంటారా? నారా లోకేష్

by చైతన్యరధం
May 10, 2023 at 8:15pm
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
nara lokesh

Nara Lokesh comments on Karumuri Nageswara Rao

Share on FacebookShare on TwitterShare on Whatsapp

అదే పదంవాడి జగన్ ను ధాన్యం ఎప్పుడు కొంటావని అడగొచ్చా?
ధాన్యం కొనమని అడగడం రైతులు చేసిన తప్పా?
వైసిపి మంత్రులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు
జగన్ కు చెబుతున్నా… 6సమస్యలకు జవాబు ఇవ్వండి
నందికొట్కూరు సభలో నిప్పులు చెరిగిన యువనేత లోకేష్

వైసిపి మంత్రులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు, రైతుల్ని ఎర్రిపప్ప నోరు మూసుకో అంటూ తిడుతున్నారు, మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఎర్రిపప్పకి కొత్త అర్ధం చెప్పారు, ఎర్రిపప్ప అంటే బుజ్జినాన్నా అని అర్ధం అంట. అదే పదంవాడి నేను జగన్ ను ధాన్యం ఎప్పుడు కొంటావని అడగొచ్చా? అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

చేతులు చాచిన సాయం!

బోప్పూడిలో ఈ నెల 17న జరగబోయే ఉమ్మడి టిడిపి, జనసేన, బీజేపి సభ ఏర్పాట్ల కి భూమి పూజ చేస్తున్న లోకేష్

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – తాడిపత్రి నియోజకవర్గం

రైతులు చేసిన నేరం ఏంటి? తడిచిన ధాన్యం కొనమని అడగటం తప్పా? గోల్ మాల్ జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని యువనేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నందికొట్కూరులో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ రైతుల్ని అవమానించిన మంత్రి, గోల్ మాల్ జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలి. కనీసం సీఎం మంత్రి వ్యాఖ్యల్ని ఖండించలేదు. రైతులు అంటే కనీస గౌరవం లేని వ్యక్తి గోల్ మాల్ జగన్. అబద్దానికి మానవ రూపం జగన్. ఆయనకి ఒక శాపం ఉంది. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలు అవుతుంది.

అందుకే ఆయన ఎప్పుడూ అబద్దాలే చెబుతాడు. లక్ష కోట్ల ఆస్తి పరుడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల నీళ్ల బాటిల్ తాగే జగన్ పేదవాడా? బెంగుళూరు యలహంకలో 23 ఎకరాల్లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయ లో ప్యాలస్, వైజాగ్ లో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు? సొంత ఛానెల్, సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు? సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు? దేశంలోనే ధనిక సీఎం నేను పేదవాడ్ని అంటూ చెవిలో క్యాలీఫ్లవర్ పెడుతున్నాడు. ఈ మోసగాడ్ని నమ్మి మరోసారి మోసపోతారా? అని లోకేష్ ప్రశ్నించారు.

పేదల గళం వినిపించేందుకే యువగళం

పేదలు గళం వినిపించే వేదిక యువగళం. పేదలు ఎప్పటికీ పేదరికంలో ఉండాలి అనేది ధనిక సీఎం జగన్ కోరిక. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నది మీ లోకేష్ కోరిక అని లోకేష్ వెల్లడించారు. జగన్ జీవితం అంతా గోల్ మాల్. ఆయన ఏ స్కీమ్ ప్రవేశ పెట్టినా అందులో గోల్ మాల్ ఉంటుంది. అందుకే ఆయనకు గోల్ మాల్ జగన్ అని పేరు పెట్టా. నందికొట్కూరు నాటు దెబ్బ అదుర్స్. మీ దెబ్బకి జగన్
దిమ్మతిరిగిపోతుంది. సప్తనదుల సంగమం సంగమేశ్వర ఆలయం, సరస్వతి దేవాలయం కొలనుభారతిదేవి క్షేత్రం, శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి ఈ నందికొట్కూరు.

రాయలసీమకు తాగు, సాగునీరు అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు పుట్టినిల్లు నందికొట్కూరు నియోజకవర్గం. ఎంతో చరిత్ర ఉన్న నందికొట్కూరు నియోజకవర్గంలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం…మనగళం…ప్రజాగళం. యువగళం పాదయాత్ర దెబ్బకి వైసిపి దొంగల బ్యాచ్ అంతా రోడ్డు మీదకి వస్తోంది. లోకేష్ ని అడ్డుకుంటాం అంటూ సవాల్ చేస్తున్నారు. రాజకీయంగా చచ్చిన శవాలు కూడా సవాళ్లు విసరడం వింతగా ఉంది. నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర. అడ్డుకుంటే దండయాత్ర అని. అడ్డుకోవడానికి ఎంత మంది వచ్చినా మేము రెడీ తన్నులు తినడానికి మీరు రెడీనా? అని సవాల్ చేశారు.

ఈ 6సమస్యలకు సమాధానం చెప్పండి!

గోల్ మాల్ జగన్ కొత్త స్కీం తెచ్చాడు అంట దాని పేరు ఏంటో తెలుసా? జగన్ కి చెబుదాం అంట అని లోకేష్ ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో ఉన్న 1100 రియల్ టైం గవర్నెన్స్ ని నిర్వీర్యం చేసాడు. పేరు మార్చి స్పందన అని పేరు పెట్టాడు. స్పందన లో ఎన్ని అర్జీలు పెట్టినా స్పందన లేదు. ఇప్పుడు దాని పేరు జగన్ కి చెబుదాం అని మార్చి కొత్త డ్రామా మొదలు పెట్టాడు. నాకు ఆరు సమస్యలు ఉన్నాయి గోల్ మాల్ జగన్ కి చెప్పేదాం. ఎప్పుడు పరిష్కరిస్తాడో చూద్దాం. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు.

ఎప్పుడు చేస్తారు? 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో రైతులు నష్టపోయారు. ప్రభుత్వం తడిచిన ధాన్యం కొనాలి. ఎప్పటిలోగా కొంటారు? బీసీల్లో ఉన్న ఉపకులాలకు నిధులు కేటాయిస్తాం అన్నారు. బీసీలకు చెందాల్సిన డబ్బులు ఎప్పటిలోగా బీసీలకు ఇస్తారు? ఎస్సీలకు కేటాయించిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసారు ఎప్పటి లోగా అవి తిరిగి ప్రారంభిస్తారు? పన్నుల భారంతో పెంచేసిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి. ఎప్పటిలోగా తగ్గిస్తారు? అని లోకేష్ ప్రశ్నించారు.

యువత భవితకు గోల్ మాల్ జగన్ తూట్లు

గోల్ మాల్ జగన్ పాత ఫీజు రీఎంబర్స్మెంట్ పధకాన్ని రద్దు చేసి విద్యా దీవెన, వసతి దీవెన అని చెత్త పధకాలు తెచ్చాడు అని లోకేష్ విమర్శించారు. ఇప్పుడు దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు కాలేజీ
యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. గోల్ మాల్ జగన్ దెబ్బకి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఉన్నత చదువులు చదవాలి అంటే సిర్టిఫికెట్లు లేవు. ఉద్యోగాలకి అప్లై చెయ్యాలి అంటే సర్టిఫికెట్లు
లేవు. గోల్ మాల్ జగన్ గోల్ మాల్ స్కీమ్స్ దెబ్బకి విద్యార్థులు, తల్లిదండ్రులకు అప్పులు, తిప్పలు మాత్రమే మిగిలాయి.

గోల్ మాల్ జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. గోల్ మాల్ జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు అని ధ్వజమెత్తారు.

దమ్ముంటే ఆ బిల్లులమీద స్టిక్కర్లు వేయండి

గోల్ మాల్ జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు. కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి అని లోకేష్ సవాల్ చేశారు. గోల్ మాల్ జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ గోల్ మాల్ జగన్.

గోల్ మాల్ జగన్ యువత భవిష్యత్తును నాశనం చేసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సీ లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని లోకేష్ వెల్లడించారు.

మహిళల పసుపు,కుంకుమ చెరిపేస్తున్నారు

గోల్ మాల్ జగన్ మహిళల పసుపు, కుంకుమ చెరిపేస్తున్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎం అయ్యింది? అని లోకేష్ ప్రశ్నించారు. సొంత జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. గోల్ మాల్ జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. గోల్ మాల్ జగన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి.

రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. గోల్ మాల్ జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది అని లోకేష్ విమర్శించారు.

బిసిల బ్యాక్ బోన్ విరిచిన జగన్

బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు గోల్ మాల్ జగన్ అని లోకేష్ ఆరోపించారు. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి
16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. అందుకే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం.

దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం. గోల్ మాల్ జగన్ దళిత ద్రోహి. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. ఒక్క కేసులో అయినా దళితులపై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి రాగానే రద్దుచేసిన దళితసంక్షేమ పథకాలను మళ్లీ తీసుకువస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

మైనారిటీలను కూడా మోసగించాడు

మైనారిటీలను మోసం చేసాడు గోల్ మాల్ జగన్. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు అని లోకేష్ విమర్శించారు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి
కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. గోల్ మాల్ జగన్ సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది.

కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగంబీ కి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. ఇప్పటికీ ఆ తల్లికి న్యాయం జరగలేదు. తాజాగా మదనపల్లిలో అక్రమ్ అనే ముస్లిం యువకుడ్ని పులివెందుల బ్యాచ్ దారుణంగా కొట్టి చంపింది. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు. గోల్ మాల్ జగన్ రెడ్డి సోదరులను కూడా మోసం చేసాడు. కోట్లు ఖర్చు చేసి జగన్ ని సీఎం చేస్తే రెడ్డి సోదరులకు కనీస గౌరవం దక్కడంలేదు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ

గోల్ మాల్ జగన్ నేను రాయలసీమ బిడ్డని అంటాడు కానీ ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ అని లోకేష్ ధ్వజమెత్తారు. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు
పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11,700 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రాయలసీమ
రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం.

జగన్ దెబ్బకి రాయలసీమ ఎత్తిపోతల పధకం ఎత్తిపోయింది. గ్రీన్ ట్రైబ్యూనల్ లో కేసు ఉందనే సాకుతో వదిలేశారు. వివేకా హత్య కేసులో నిందితులను కాపాడటం పట్ల ఉన్న శ్రద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకంపై లేదు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు మర్చిపోవడంతో ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని లోకేష్ పేర్కొన్నారు.

నందికొట్కూరులో వైసిపి నేతల ఆగడాలు

2019లో నందికొట్కూరు ఎమ్మెల్యే గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ధర్ గారిని మీరు భారీ మెజారిటీతో గెలిపించారు. ఒక్క దళితుడి జీవితం అయినా మారిందా? అని లోకేష్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే గారే రోడెక్కి
హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి. ఆర్థర్ గారికి ఆర్డర్ వేసే అధికారాలు లేవు. జగన్ పాలనలో దళితులకు జరుగుతున్న అవమానం చూడాలి అంటే నందికొట్కూరు రావాలి. నందికొట్కూరుని వైసిపి
నాయకులు భూకబ్జాలకు, అక్రమ మద్యానికి ల్యాండ్ సెటిల్మెంట్స్ కి అడ్డాగా మార్చేసారు. నందికొట్కూరు లో ఉన్న ఎన్టీఆర్ జలాశయాన్ని కబ్జా చేసారు వైసిపి నేతలు. సుమారు 2 కోట్లు విలువ చేసే భూమి
కొట్టేసారు. జలాశయాన్ని పూడ్చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నందికొట్కూరులోని బ్రహ్మం గారి మఠం సమీపంలో 22 ఎకరాల భూమిని సెంటు స్థలాల కోసం ఎకరా 5 లక్షలకు కొని ప్రభుత్వానికి ఎకరా
60 లక్షలకు అమ్మాలని పెద్ద స్కెచ్ వేసారు వైసిపి నేతలు.

టిడిపి నాయకుల పోరాటంతో అది ఆగింది. 4 వే రోడ్డులో పోయిన సుమారు 75 సెంట్ల మున్సిపాలిటీ స్థలాన్ని ప్రయివేట్ స్థలంగా చూపించి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము కొట్టేయాలని చూస్తున్నారు వైసిపి నేతలు. జూపాడుబంగ్లా గ్రామంలో సర్వే నంబర్ 711-2 లో భూమిని వైసిపి నేతలు కొట్టేసారు. టిడిపి హయాంలో గోకులం కి కేటాయించిన భూమిని కబ్జా చేసారు. ఆఖరికి అంగన్వాడీ స్థలాన్ని కూడా కబ్జా చేసారు. ముబారక్ షాదీఖానా పక్కనున్న 20 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని వైసిపి నేతలు కబ్జా చేసి అమ్మేసారు. తెలంగాణ నుండి లిక్కర్ తెచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ అమ్ముతున్నారు వైసిపి నేతలు అని ఆరోపించారు.

టిడిపి హయాంలోనే నందికొట్కూరు అభివృద్ధి

నందికొట్కూరుని అభివృద్ధి చేసింది టిడిపి. రూ.1200 కోట్లతో నందికొట్కూరు నియోజకవర్గంలో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు.. వంటి అభివృద్ధి పనులు చేసాం అని లోకేష్ వెల్లడించారు. రూ.300 కోట్లతో ముచ్చుమర్రి లిఫ్ట్ 17 నెలల్లో పూర్తి చేసి కేసీ కాలువ, హంద్రీనీవాకు కృష్ణా జలాలు అందించింది టిడిపి. తంగడంచ గ్రామం వద్ద 1,800 ఎకరాల్లో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేసి.. 30 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని రూ.100 కోట్లు బడ్జెట్ కేటాయించి టిడిపి ప్రభుత్వం పనులు మొదలు పెడితే… జగన్ వచ్చాక సీడ్ పార్క్ రద్దు చేశారు. జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తంగడంచ దగ్గర భూములు కేటాయించి టిడిపి ప్రభుత్వంలో పనులు మొదలు పెడితే… జగన్ వచ్చాక పనులు ఆగిపోయాయి.

టిడిపి హయాంలో రూ.1,030 కోట్లతో హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు చేపట్టి.. రూ.280 కేట్లు ఖర్చు చేశారు. వైసీపీ వచ్చాక పనులు ఆపేశారు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి నందికొట్కూరు మునిసిపాలిటీకి త్రాగునీటి పథకం కోసం పైప్ లైన్ ఏర్పాటుకు టిడిపి హయాంలో రూ.110 కోట్లు కేటాయించాం. ఆ పనులు వైసిపి ప్రభుత్వం ఆపేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు అయినా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరమ్మతులు చేపట్టలేదని లోకేష్ ఆరోపించారు.

పాదయాత్రలో హామీలు ఏమయ్యాయి?

జగన్ పాదయాత్రలో భాగంగా నందికొట్కూరు వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారని లోకేష్ వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు – గుంటూరు (కేజీ) రోడ్డు విస్తరణ, ఆధునీకరణ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. నాలుగేళ్లు అయినా దిక్కు లేదు. మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. అన్ని మండలాల్లోని లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తాం అన్నారు. శ్రీశైలం నీటి ముంపు వాసులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు.

నందికొట్కూరులో ఎక్కువగా ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులు జీవో నంబరు – 98 మేరకు ఇంకా 674 మంది ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో జాబితా తయారు చేశారు. ఇంతలో ప్రభుత్వం పడిపోయింది. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత మీకు న్యాయం చేస్తామని లోకేష్ వెల్లడించారు.

రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేస్తాం

నందికొట్కూరు పట్టణంలో కేజీ రోడ్డు విస్తరణలో ఇళ్లు, భవనాలు, దుకాణాలు కోల్పోయే బాధితులకు నష్టపరిహారం అందిస్తామని లోకేష్ చెప్పారు. మొక్కజొన్న రైతుల్ని ఆదుకుంటాం. అవసరమైన
కొనుగోలు కేంద్రాలు, గౌడౌన్స్ ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తాం. నియోజకవర్గంలో 1400 ఎకరాల ఏపిఐఐసి భూమి ఉంది.

ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం. 2014 లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిడిపి గెలిచింది 3 సీట్లే. అయినా కర్నూలు జిల్లా ని అభివృద్ధి చేసాం. ఎయిర్పోర్ట్, మెగా సీడ్ పార్క్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, 3 వేల కోట్ల తో ఇరిగేషన్ ప్రాజెక్టులు, డెప్యూటీ సీఎం పదవి ఇచ్చాం. 2019 లో 14 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు వైసిపి కి ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కి వైసిపి పీకింది ఏంటి? 16 మంది రండి నేను చర్చ కు రెడీ. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా? వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించి, చంద్రన్నను సిఎం చేసేందుకు సహకరించండి. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని లోకేష్ వెల్లడించారు.

Tags: ap latest newsDalit Bandhu CBNDalitBandhuCBNlokeshlokesh padayatraNara lokeshnara lokesh latest newsnara lokesh padayatranara lokesh padayatra in apnara lokesh padayatra yuvagalamnara lokesh speechNara lokesh yuvagalamnara lokesh yuvagalam padayatratdp nara lokesh yuvagalamtdp nara lokesh yuvagalam padayatratdp political newsyuvagalamyuvagalam padayatra
Previous Post

పన్నుల విధానాన్ని సమీక్షిస్తాం నారా లోకేష్ హామీ

Next Post

Day 96 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

మరిన్ని వార్తలు

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

చైతన్యరధం
@ April 24, 2026
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు
ఆంధ్రప్రదేశ్

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

చైతన్యరధం
@ April 24, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ ఇంధన స్వయం సమద్ధి

చైతన్యరధం
@ April 24, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి అభినందనలు

చైతన్యరధం
@ April 24, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
తూర్పు తీరానికి కార్గో రైల్ టెర్నినల్
ఆంధ్రప్రదేశ్

తూర్పు తీరానికి కార్గో రైల్ టెర్నినల్

చైతన్యరధం
@ April 23, 2026
నెలరోజుల్లో పట్టాలెక్కాలి
ఆంధ్రప్రదేశ్

సంతానోత్పత్తి పెరిగేలా కార్యాచరణ

చైతన్యరధం
@ April 23, 2026
నెలరోజుల్లో పట్టాలెక్కాలి
ఆంధ్రప్రదేశ్

నెలరోజుల్లో పట్టాలెక్కాలి

చైతన్యరధం
@ April 23, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

చైతన్యరధం
@ April 24, 2026
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

చైతన్యరధం
@ April 24, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

స్వచ్ఛ ఇంధన స్వయం సమద్ధి

చైతన్యరధం
@ April 24, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి అభినందనలు

చైతన్యరధం
@ April 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist