టిడిపి అధికారంలోకి రాగానే ఇసుక పాలసీని సరళతరం చేసి అన్ని ప్రాంతాల్లో ఇసుకను అందుబాటులోకి తెస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళంపాదయాత్ర సందర్భంగా బుధవారం నంద్యాల నూనెపల్లి ఫ్రైఓవర్ వద్ద భవన నిర్మాణ కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మాకు
పనులు లేకుండా పోయాయి.
ఇసుక దొరక్కపోవడంతో నిర్మాణరంగం కార్మికులంతా ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా సమయంలో బ్రతకడానికి అప్పుల పాలయ్యాం, నేడు అప్పులు తీర్చడానికి ఇబ్బందులు పడుతున్నాం.
ప్రభుత్వం నుండి నేటికీ మాకు ఎలాంటి సహాయ, సహకారాలు అందలేదు.
కరోనాలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నేటికీ ప్రబుత్వం ఎటువంటి సహాయం అందలేదు.
నంద్యాల పట్టణంలో 75వేల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు.
మీరు అధికారంలోకి వచ్చాక మా కార్మికులందరినీ ఆదుకోవాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి వినతులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనదాహం కారణంగా రాష్ట్రంలోని 40లక్షలమంది భవననిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు.
కరోనా సమయంలో ప్రభుత్వం కనీస సాయం అందకపోవడంతో 70మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
నాలుగేళ్ల జగన్ రెడ్డి పాలనలో ఇసుక ద్వారా రూ.10వేల కోట్లు దోచుకున్నారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం టిడిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంక్షేమ బోర్డు నుంచి రూ.2వేలకోట్లు దారిమళ్లించారు.
టిడిపి మళ్లీ అధికారంలోకి రాగానే భవన కార్మికుల సంక్షేమ బోర్డును బలోపేతంచేసి, కార్మికులకు సాయం అందిస్తాం.
భవన నిర్మాణరంగానికి గతవైభవం చేకూర్చి, కార్మికులకు చేతినిండా పనికల్పిస్తాం అని హామీ ఇచ్చారు.