అమరావతి: అభ్యర్థులు పారిపోయినా, సీట్లు మార్చినా మునిగిపోయే వైసీపీ నావను ఏ శక్తీ అడ్డుకోలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎక్స్ వేదికగా లోకేష్ స్పందిస్తూ.. ప్రజాగ్రహానికి గురైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పరారీలో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 35మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు భయపడి పారిపోయా రన్నారు. వైసీపీలో ఓటమి భయానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని అన్నా రు. ఎన్నికలకు ముందే వైసీపీ అభ్యర్థు ల్లో సన్నగిల్లిన విశ్వా సానికి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థు ల్లో తాజా మార్పులు ప్రతిబింబిస్తున్నాయన్నారు. ప్రస్తుత 35 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో 50మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడాతమసొంత స్థానాల్లో పోటీ చేసేందుకు విముఖంగా ఉన్నారని కూడా వినిపిస్తోందన్నారు.2024లో ఇక జగన్ సీఎంగా ఉండరని.. ఏపీ రాష్ట్రం బైబై జగన్ అంటోందని లోకేష్ వ్యాఖ్యానించారు.