చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రైవేటైజేషన్ కాదు… ప్రగతి వైపు ప్రస్థానం

ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం

by చైతన్యరధం
Nov 18, 2025 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఎస్క్రో
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం
  • 17 నెలల కాలంలో రూ.15 వేల కోట్ల సాయం అందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
  • ఉత్పత్తి సామర్థ్య వినియోగం 48 నుంచి 80 శాతానికి పెంపు
  • దేశంలో మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకీ ఇవ్వని స్థాయిలో ప్రభుత్వాల ఆర్థిక సాయం
  • నాడు స్టీల్స్టాప్లాంట్ నష్టాల్లో ఉన్నా పట్టించుకోని జగన్
  • పైపెచ్చు భూములు అమ్మేసేందుకు కుట్రలు
  • అప్పుడూ.. ఇప్పుడూ ప్లాంట్ను నిలబట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి

అమరావతి (చైతన్యరథం): ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు నినాదంతో ఏర్పాటైన  విశాఖ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టేందుకు కూటమి  ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల చేయూతతో ప్రైవేటైజేషన్ ప్రచారం నుంచి స్టీల్స్టాంట్ ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తోంది. కేంద్ర, రాష్ట్రాల సహకారంతో నేడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతోంది. నష్టాలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్లాంట్ను ఆదుకునేందుకు 17 నెలల కాలంలో కూటమి
ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకీ ఇవ్వని స్థాయిలో వేల కోట్ల ఆర్థిక సాయంతో అండగా నిలిచింది. విశాఖ ఉక్కును గట్టెక్కించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్లు అందించింది.
రూ.3 వేల కోట్ల వరకూ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేవలం 17 నెలల్లో పరిశ్రమకు రూ.15  వేల కోట్ల మేర సాయం అందింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
నిరంతర సంప్రదింపులతో ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా కేంద్ర ఉక్కు మంత్రితో పలు మార్లు భేటీ అయ్యి  స్టీల్ ప్లాంట్ కు ఆర్థికంగా సహకారం అందించేలా చేశారు. స్టీల్ ప్లాంట్ను
గట్టెక్కించడానికి 2024లో రూ.500 కోట్ల  ఈక్విటీని, వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్సుగా రూ.1140 కోట్లను కేంద్రం విడుదల చేసింది.  ఆర్థిక చేయూతతో 2024 అక్టోబరులో రెండో బ్లాస్ట్ ఫర్నెస్ ప్రారంభం కావటంతో ఉత్పత్తి సామర్థ్య వినియోగం 67 శాతానికి పెరిగింది. ఆ  తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదింపుల మేరకు మరో మారు రూ.9,800 కోట్ల ఈక్విటిని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో తీసుకున్న రూ.1140 కోట్ల  రుణాన్ని ప్రిఫరెన్సు షేర్ క్యాపిటల్గా మారుస్తూ
నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఈ ఏడాది  అక్టోబరు నాటికి ప్లాంట్ సామర్థ్య వినియోగం 80 శాతానికి పెరిగింది. ప్రస్తుతం రోజుకు 16,322  టన్నుల హాట్ మెటల్్ను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేయగలుగుతోంది. 13 వేల మంది
రెగ్యులర్, 15 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. రాజకీయ
-సంప్రదింపులతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కూటమి ప్రభుత్వం నిలువరించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 7.3. మిలియన్  టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తోంది. ఎంఎస్ఎంఈలు, స్థానిక పరిశ్రమలు,
ఆటోమొబైల్ విడిభాగాల కంపెనీలకు స్టీల్ ప్లాంట్  ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారు. నవరత్నకంపెనీ హోదాతో 2014-15   రూ .12,958 కోట్ల నికర లాభాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్జించింది.

పట్టించుకోని జగన్.. పట్టు వీడని చంద్రబాబు
ఆ తరువాత 2019-24 మధ్య విశాఖ స్టీల్స్టాంట్ తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా నాడు ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ నిర్వహణకే పరిమితం అయింది. నష్టాల కారణంగా నాడు ఉత్పత్తి సామర్థ్యాన్ని బాగా కుదించాల్సి వచ్చింది. స్టీల్ ప్లాంట్ తీవ్ర నష్టాల్లో ఉన్నా గత వైసీపీ పాలకులు కనీసం స్పందించలేదు. పైపెచ్చు ప్లాంట్ భూములు అమ్మేందుకు ప్రయత్నించారు. స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేసి, రాష్ట్ర వాటాకు వచ్చే స్థలంలో రాజధాని పెడితే బావుంటుందనే కపట బుద్ధితో నాడు దాని మీద కన్నేసిన జగన్ రెడ్డి ఏ రోజూ ప్లాంట్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. 2024లో ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్తోనే కర్మాగారం నడవాల్సిన దుస్థితికి వచ్చింది. అప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు. ఉక్కు కార్మికుల గుండెల్లో భయం మొదలై నిరసనలు మొదలెట్టారు. తరువాత 2024లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యారు. 32 మంది అమరుల త్యాగంతో సాధించుకున్న ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. తెల్లవారు జామున రెండున్నర గంటలకు దేశమంతా నిద్రలో ఉన్న వేళ దేశ రాజధానిలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని వెంటబెట్టుకొని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు వెళ్లి, పరిస్థితిని అత్యవసరంగా సీఎం చంద్రబాబు నివేదించారు. అంతకు ముందు 1 గంటకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చంద్రబాబు కలిశారు. ఆ అర్ధరాత్రి దాటాక చర్చలు ముగిసిన అనంతరం, తెల్లవారుజామున 3 గంటలకు ఆర్థిక శాఖ స్వయంగా ట్వీట్ చేసింది. ఆ సమావేశం ఫలితంగానే, విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్రం కాపాడేందుకు రూ.10,300 కోట్ల ఈక్విటీ, రూ.1,140 కోట్ల రుణ సహాయంతో ముందుకు వచ్చింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

వాస్తవాలు దాచేసి విషప్రచారం
25 ఏళ్ల క్రితమే కేంద్రంలోని వాజ్ పేయి ప్రభుత్వం నుంచి దాదాపు రూ. 2800కోట్లు సాయం తీసుకొచ్చి నాడు సీఎం చంద్రబాబు విశాఖ స్టీల్ను ఆదుకున్నారు. అప్పుడూ.. ఇప్పుడూ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టేందుకు కట్టుబడిన సీఎం చంద్రబాబు ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేశారు. తప్పుడు ప్రచారాలతో వాస్తవాలు దాచిపెట్టి… కూటమి ప్రభుత్వంపై రాజకీయ పార్టీలు విషం చిమ్ముతున్నాయి. కార్మిక సంఘాల, రాజకీయ పార్టీల పేరుతో విశాఖ స్టీల్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూటమి పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ బలోపేతమవుతోంది. ఇకపై మరింత ప్రగతి సాధిస్తుంది.
కేంద్ర, రాష్ట్రాల మద్దతు తాత్కాలిక ఊరట మాత్రమే. ఉక్కు కర్మాగారం మళ్లీ లాభాల బాట పట్టాలంటే, ఆ పోరాట స్ఫూర్తిని, సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లి ప్రతి ఉద్యోగి కష్టపడాలి. గతంలో ఎప్పుడైతే ప్లాంట్ రేటెడ్ కెపాసిటీకి మించి పని చేసిందో, అప్పుడే లాభాలు గడించింది. కేంద్రం ఇచ్చిన నిధులతో వినియోగ సామర్థ్యాన్ని 80 శాతానికి పెంచగలిగారు. ఈ లక్ష్యాన్ని 100%కి చేరుకోవడానికి రాత్రింబవళ్లు శ్రమించడం అత్యవసరం. దీర్ఘకాలికంగా నిలబడాలంటే, ఖర్చుల నియంత్రణ తప్పనిసరి. ప్రభుత్వాలు వేల కోట్లు ఇచ్చినా, ఖర్చులపై కళ్లెం లేకపోతే, ఈ నిధులు పాత అప్పులు తీర్చడానికే, వడ్డీలకే సరిపోతాయి. ఏదైనా ఓ సంస్థ నిలబడాలంటే.. కష్ట పడాల్సింది ఉద్యోగులే. ఎవరి స్థాయిలో వారు తమ పనిని మనసు పెట్టి చేస్తే సంస్థ నిలబడుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా కార్మికులు, ఉద్యోగులు ఉద్యమం చేసినప్పుడు ప్రజలు మద్దతు ఇచ్చారు. కానీ ఇలా వేల కోట్ల ప్రజాధనాన్ని ఆ సంస్థలో పోసి కాపాడు కుంటూంటే.. ఉద్యోగులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే ఎవరూ మద్దతివ్వరు.

 

 

 

 

 

Previous Post

రైతులకు శుభవార్త.. రేపు అన్నదాత సుఖీభవ నిధుల జమ

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 18-11-2025

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మీ సంకల్పం నెరవేరుతుంది
ఆంధ్రప్రదేశ్

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి
ఆంధ్రప్రదేశ్

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist