• 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result

డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు

గుంటూరులో సరస్‌ మేళా 2026ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

చైతన్యరధం by చైతన్యరధం
January 9, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
0
డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు
  • ఆడబిడ్డలు సొంతకాళ్లపై నిలబడాలనే డ్వాక్రా స్థాపన
  • మహిళలతో టీడీపీకి ప్రత్యేక అనుబంధం
  • వారి కష్టాలు చూసే దీపం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం
  • సంజీవనితో ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా
  • గుంటూరులో సరస్‌ మేళా 2026ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

గుంటూరు (చైతన్యరథం): మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. గుంటూరులో సరస్‌ (సేల్‌ ఆఫ్‌ రూరల్‌ ఆర్టిసన్స్‌ సొసైటీ) మేళా` 2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…డ్వాక్రా సంఘాలను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై సొంతగా నిలబడాలనే ఉద్దేశంతో నేను 30 ఏళ్ల క్రితం డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చాను. ఆనాడు డ్వాక్రా మహిళలు మీటింగుల కోసం బయటకు వస్తే ఎంతోమంది ఎగతాళి చేశారు. కానీ నేడు డ్వాక్రా సంఘాలు తిరుగులేని వ్యవస్థగా దేశంలోనే రికార్డు సృష్టించాయి. డ్వాక్రా, మెప్మా సంఘాలు నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. రాష్ట్రంలో కోటీ 13 లక్షలమంది డ్వాక్రా మహిళలు రూ. 26 వేల కోట్ల నిధిని, రూ. 5,200 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ను ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం. 2024-25లో డ్వాక్రా సంఘాలు రూ. 46,590 కోట్ల బ్యాంకు రుణాలు తీసుకున్నారు. దేశ రాజధాని ఢల్లీిలో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను అభినందిస్తున్నాను. ఈ ఎక్స్‌పోను చూస్తుంటే మినీ ఇండియాను తలపిస్తోంది. అంతటా పండుగ వాతావరణం నెలకొంది. సరస్‌ మేళా సంప్రదాయ హస్తకళలు, హ్యాండ్లూమ్స్‌, స్థానిక ఆహార ఉత్పత్తులకు బ్రాండిరగ్‌ తీసుకురావడంతో పాటు మార్కెట్‌ లింకేజీ సదుపాయాన్ని కల్పిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఆడబిడ్డలతో ప్రత్యేక అనుబంధం
ఆడబిడ్డలతో తెలుగుదేశం పార్టీ అనుబంధం ఈ నాటికి కాదు. ఆనాడు ఎన్టీఆర్‌ మగవారితో సమానంగా మహిళలకు ఆస్తిహక్కు కల్పించారు. మహిళల కోసం తిరుపతిలో పద్మావతీ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాల ద్వారా మహిళకు ఆర్థిక భరోసా కల్పించాను. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల్లో 89 లక్షలమంది, మెప్మా సంఘాల్లో 24 లక్షల మంది సభ్యులున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు మరిన్ని రుణాలు ఇస్తాయని నేను చెప్పిన మాటను పొదుపు మహిళలు తూచా తప్పకుండా పాటించి ఆర్థిక ప్రగతి సాధించారు. 2024-25లో రూ.46 వేల 590 కోట్ల రూపాయి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. నేనిచ్చిన ఐటీ పిలుపుతో ఎంతోమంది దేశ విదేశాల్లో ఆర్థికంగా ఉన్నతంగా స్థిరపడ్డారు. ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 93 వేలమంది మైక్రో, ఎంఎస్‌ఎంఈ ఎంట్రప్రెన్యూర్లు అయ్యారు. డ్వాక్రా మహిళలు విదేశాలు కూడా వెళ్లి ఎంతోమందికి ట్రైనింగ్‌ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలను మరింత సమర్థవంతంగా తయారుచేసే బాధ్యత నాదని సీఎం చంద్రబాబు అన్నారు.
ముఖ్యమంత్రి అంటే పెత్తందారు కాదు
ముఖ్యమంత్రి అంటే పెత్తందారు కాదు. ప్రజా సేవకుడు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోంది. తల్లికి వందనం కింద ఏడాదికి రూ.10,090 కోట్లు 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం స్త్రీ శక్తి పథకం తీసుకువచ్చాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్ల ఉచితంగా అందిస్తున్నాం. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా పౌరుల వద్దకే ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. సంజీవని కార్యక్రమం ద్వారా ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాం. పేదరికం లేని రాష్ట్రం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అంతకుముందు స్త్రీ నిధి పథకం కింద డ్వాక్రా సంఘాలకు రుణంగా రూ.1,375 కోట్ల చెక్కును సీఎం అందించారు. సెర్ప్‌ నుంచి రూ.2171 కోట్లను పొదుపు సంఘాలకు రుణంగా అందించారు. చేనేత వస్త్ర స్టాళ్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి తన సతీమణి భువనేశ్వరికి చీరను కొనుగోలు చేశారు. భర్తకు ఆరోగ్యం బాగోలేదని తన దృష్టికి తీసుకొచ్చిన పొదుపు మహిళకు సీఎం సహాయ నిధి నుంచి రూ.6 లక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు మంజూరు చేశారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 08-01-2026

Next Post

అమరావతికి అపజయం ఉండదు

Next Post
అమరావతికి అపజయం ఉండదు

అమరావతికి అపజయం ఉండదు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.