చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

‘రియల్‌టైమ్’ ఛేదన

వాహన చోరీ కేసు చేధనలోనూ కీలక పాత్ర

by చైతన్యరధం
May 3, 2026 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
‘రియల్‌టైమ్’ ఛేదన
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పోలీసులకు ఆర్టీజీఎస్ సాంకేతిక తోడ్పాటు
  • కీలక సహకారం అందిస్తున్న సీసీటీవీ 360
  • అదృశ్యమైన ముగ్గురు మహిళల ఆచూకీ లభ్యం
  • హత్య కేసులో నిందితుడిని పట్టించిన టెక్నాలజీ
  • వాహన చోరీ కేసు చేధనలోనూ కీలక పాత్ర

అమరావతి(చైతన్యరథం): వివిధ కేసుల దర్యాప్తులో పోలీసు లకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ తనదైన సాంకేతిక తోడ్పాటు అందిస్తూ కేసుల ఛేదనలో పోలీసులకు తగినంత సహకారం అందిస్తోంది. తాజాగా ఐదు కేసుల్లో ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ కీలకపాత్ర పోషించి ఈ కేసుల దర్యాప్తులో పోలీసుల పని సులభతరం చేసింది. అదృశ్యమైన ముగ్గురు మహిళల ఆచూకీ కనుగొనడంలో ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 కీలకపాత్ర పోషించింది. ఈ ముగ్గురిలో ఇద్దరు బాలికలు కూడా ఉన్నారు. అలాగే తాడేప ల్లిగూడెంలో హత్య చేసి ఇంట్లో సొత్తు దోపిడీ చేసి వెళ్లిన హంతకుడిని కూడా సకాలంలో పట్టించడంలో ఆర్టీజీఎస్‌కు చెంది న సర్వైలెన్స్ కెమెరాలు కీలకంగా పనిచేశాయి. మోటారుసైకిల్ దొంగిలించి పరారైన మరో నిందితుడి కదలికలను సైతం పసిగట్టి నిందితుడిని పట్టించేలా చేయడంలో ఆర్టీజీఎస్ సాంకేతికత సమర్థ వంతంగా పనిచేసింది. శాంతిభద్రత పరిరక్షణకే కాకుండా పలు కేసుల దర్యాప్తులోనూ పోలీసులకు సహకరించేలా ఆర్టీజీఎస్‌లో సీసీటీవీ 360 అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా తాగాజా ఐదు కేసుల్లో పోలీసులు ఆర్టీజీఎస్ సీటీటీవీ360 సాంకేతి క సహకారాన్ని సమర్థంగా వినియోగించుకున్నారు.

కేస్ 1: అదృశ్యమైన బాలిక..విజయవాడలో గుర్తింపు
కర్నూలు జిల్లాల నందవరం పోలీసుస్టేషన్ పరిధిలో ఏప్రిల్ 22న 17 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. బాలిక ఆచూకీ కనుక్కోవ డానికి ఆర్టీజీఎస్ సహకారాన్ని పోలీసులు కోరారు. ఆమె ఫొటోను ఆర్టీజీఎస్ సీసీటీవీ360 అప్లికేషన్లో అప్‌లోడ్ చేసి టైమ్ సెన్సిటివ్ అప్రోచ్ ద్వారా డిజిటల్ గాలింపు చేపట్టారు. ఆమె విజయవాడకు వచ్చి నగరంలోని ఒక ప్రధాన కూడలిలో తచ్చాడుతున్నట్లు ఆర్టీజీ ఎస్ రియల్ టైమ్ అలర్టులను పోలీసులకు పంపింది. దీంతో నందవరం పోలీసులు విజయవాడ పోలీసుల సహకారంతో బాలిక ను పట్టుకుని ఆమె తల్లిదండ్రులకు అప్పగించగలిగారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-05-2026

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

జగన్ రెడ్డి అండ్ కో వక్రబుద్ధి

కేస్2: నంద్యాలలో అదృశ్యం..ఒంగోలులో బాలిక
నంద్యాల జిల్లా గడివేముల పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 25న 16 సంవత్సరాల బాలిక అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వెళ్లిన మోటారుసైకిల్ నెంబరు ఆధారంగా ఆమె ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు ఆర్టీజీఎస్ సహకారం కోరారు. ఆ బాలిక ఫొటో, ఆమె వెళ్లిన వాహనం నెంబ ర్‌ను ఆర్టీజీఎస్ సీసీటీవీ360 అప్లికేషన్‌లో అప్‌లోడు చేసి ఆమె కదలికలను గాలించారు. ఆమె ఏప్రిల్ 29న ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఒక ప్రధాన కూడలిలో ఉండగా సీసీటీవీ కెమెరాలు కనిపెట్టాయి. ఆర్టీజీఎస్ పోలీసులకు రియల్ టైమ్ అలర్టులు పంపడంతో నంద్యాల, ఒంగోలు పోలీసులు సమన్వ యంతో వ్యవహరించి ఆమెను ఆమె తల్లిదండ్రులకు అప్పగిం చారు.

కేస్3: చిత్తూరులో యువతి ఆచూకీ గుర్తింపు
చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో ఈ నెల 24న 22 ఏళ్ల యువతి అదృశ్యమైనట్లు అక్కడి పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈ అదృశ్యం వెనుక ఉన్నారనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఈ కేసు ఛేదనకు ఆర్టీజీఎస్ సహకారం కోరారు. ఆ యువకుడి వాహనం నెంబర్, ఆ యువతి ఫొటోలను ఆర్టీజీఎస్ సీసీటీవీ360 అప్లికేషన్‌లో అప్‌లోడు చేసి పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (పీఓఐ), ఆటోమే టిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) టెక్నాలజీ అప్రోచ్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. వారు వెళ్లిన వాహనం 28వ తేదీ వరకు తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో తిరుగాడినట్లు గుర్తించి అటు నుంచి చిత్తూరుకు వెళుతున్నట్లు సీసీటీవీల ద్వారా గుర్తిం చారు. ఆ సమాచారాన్ని ఆర్టీజీఎస్ పోలీసులకు రియల్ టైమ్ అలర్టులు పంపడంతో పోలీసులు వారిని చిత్తూరు పట్టణంలో పట్టుకున్నారు.

కేస్4: హత్య, దోపిడీ కేసు ఛేదనలో సహకారం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ 15న నమో దైన హత్య, దోపిడీ కేసుకు సంబంధించి నిందితుడ్ని పట్టుకోవ డంలో ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్యవస్థ కీలకంగా పనిచేసింది. నిందితుడి ఆచూకీ కనుగొనడానికి పోలీసులు ఆర్టీజీఎస్ సహకా రం కోరారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఆర్టీజీఎస్‌కు చెందిన మ్యాట్రిక్స్ సర్వైలెన్స్ కెమెరాల్లో నిందితుడి అనుమానిత కదలికలు రికార్డు అయ్యాయి. ఇది పోలీసులకు గోల్డెన్ లీడ్‌గా మారింది. దీని ఆధారంగా పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేయడంతో పాటు అతడి నుంచి బంగారు నగలు, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇది డిజిటల్ ఎవిడెన్సుగా కూడా పోలీసులకు ఉపయోగపడనుంది.

కేస్5: చోరీకి గురైన మోటారుసైకిల్ లభ్యం
ఏలూరు జిల్లా పోలవరం పోలీసుస్టేషన్ పరిధిలో గత మార్చి లో చోరీకి గురైన మోటారు సైకిల్‌ను కూడా పోలీసులు ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 సహకారంలో విజయవంతంగా పట్టుకోగలిగారు. చోరీకి గురైన మోటారుసైకిల్ నెంబర్ ఆధారంగా ఆర్టీజీఎస్ జనరల్ సర్వైలెన్స్ మ్యాట్రిక్స్ ద్వారా హై రిజల్యూషన్ ఇమేజెస్ ద్వారా ఆ వాహనం కదలికలను పసిగట్టారు. గోదావరి జిల్లా కడియం పోలీసు స్టేషన్ పరిధిలో సంచరిస్తున్నట్లు పోలీసులకు ఆర్టీజీఎస్ అలర్టులు పంపడంతో పోలీసులు సమన్వయంతో వ్యవ హరించి ఈ బైకును చోరీ చేసిన నిందితుడిని పట్టుకుని బైకును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల మధ్య మరింత సమన్వయం
ఆర్టీజీఎస్‌లోని సీసీటీవీల సాంకేతిక వ్యవస్థ పోలీసుల మధ్య సమన్వయం పెంపొందించడానికి దోహదపడుతోంది. కేసు దర్యాప్తులో పోలీసుల మధ్య జిల్లాల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపివేస్తూ, నేరస్థులు రాష్ట్రంలో ఎక్కడ సంచరిస్తున్నా వారి కదలికలను ఆర్టీజీఎస్ సీసీకెమెరాలు ఇట్టే పట్టేస్తున్నాయి. ఆయా కేసుల్లో ఆ నిందితులకు సంబంధించిన సమాచారాన్ని కేసు నమోదైన పోలీసు స్టేషన్ పోలీసులకు చేరవేస్తున్నాయి. దీంతో పోలీసులు సమన్వయంతో వ్యవహరించి నిందితులను ఇట్టే పట్టుకుంటుని కేసులను విజయవంతంగా ఛేదిస్తున్నారు.

Previous Post

స్వచ్ఛ రథాలకు హీరో నాని సహాయం

Next Post

జలధారతో భూగర్భజలాలు పెరిగాయి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-05-2026

కార్యకర్త
@ May 25, 2026
శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం
ఆంధ్రప్రదేశ్

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

చైతన్యరధం
@ May 25, 2026
జగన్ రెడ్డి అండ్ కో వక్రబుద్ధి
ఆంధ్రప్రదేశ్

జగన్ రెడ్డి అండ్ కో వక్రబుద్ధి

చైతన్యరధం
@ May 25, 2026
తెలుగు సినిమాను బతికించుకోవాలి
ఆంధ్రప్రదేశ్

తెలుగు సినిమాను బతికించుకోవాలి

చైతన్యరధం
@ May 25, 2026
నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్
ఆంధ్రప్రదేశ్

నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

చైతన్యరధం
@ May 25, 2026
ఉత్తరాంధ్రకు మహర్దశ..
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు మహర్దశ..

చైతన్యరధం
@ May 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-05-2026

కార్యకర్త
@ May 24, 2026
పండుగ వాతావరణంలో మహానాడు
ఆంధ్రప్రదేశ్

పండుగ వాతావరణంలో మహానాడు

చైతన్యరధం
@ May 24, 2026
Load More

ముఖ్య వార్తలు

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

చైతన్యరధం
@ May 25, 2026
నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

చైతన్యరధం
@ May 25, 2026
పండుగ వాతావరణంలో మహానాడు

పండుగ వాతావరణంలో మహానాడు

చైతన్యరధం
@ May 24, 2026
గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ తోక జాడిస్తే కట్ చేస్తాం

గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ తోక జాడిస్తే కట్ చేస్తాం

చైతన్యరధం
@ May 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

చైతన్యరధం
@ May 25, 2026
జగన్ రెడ్డి అండ్ కో వక్రబుద్ధి

జగన్ రెడ్డి అండ్ కో వక్రబుద్ధి

చైతన్యరధం
@ May 25, 2026
తెలుగు సినిమాను బతికించుకోవాలి

తెలుగు సినిమాను బతికించుకోవాలి

చైతన్యరధం
@ May 25, 2026
నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

చైతన్యరధం
@ May 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist