- నెలవారీ ఆర్థిక నివేదికలతో ఆశించిన పురోగతి
- పారిశ్రామికంగా అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యం
- అర్జీల పరిష్కారం, క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి
- ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి
- సుపరిపాలనతోనే ఫలితాలు, ప్రజలకు మెరుగైన సేవలు
- మంత్రులు, కార్యదర్శులతో సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): డేటా డ్రైవెన్ గవర్నెన్స్ రియల్ టైమ్ రిజల్ట్స్ సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్ ఆధారంగా పాలనను మరింత సులభతరం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దీనికోసం దేశంలోనే మొదటిసారిగా మంత్లీ ఎకనామిక్ రిపోర్టుల ద్వారా వృద్ధిని సమీక్షించుకుంటున్నామని తెలిపారు. ఇక నుంచి ప్రతీ నెలా నెలవారీ ఆర్థిక నివేదికలను విడుదల చేస్తామని, దానికి అనుగుణంగా రాష్ట్ర పురోగతి కోసం ప్రభుత్వ శాఖలు పనిచేయాలని స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ఎంఈఆర్పై మంగళవారం నిర్వహించిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. నెలవారీ ఆర్థిక నివేదికల ద్వారా ఎప్పటికప్పుడు రెవెన్యూ రాబడులను అంచనా వేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. అధికారులు, ఉద్యోగుల నెలవారీ పనితీరును, నైపుణ్యాలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసు కుని ముందుకువెళతామని తెలిపారు.
వనరుల సమర్థ వినియోగం ప్రభుత్వ లక్ష్యం
2019-2024 ລ້ చిన్నాభిన్నం అయ్యాయి. రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. సంక్షేమం, అభివృద్ధి, సుపరి పాలన కోసం రెండేళ్లుగా సమిష్టిగా పనిచేశాం. ప్రభుత్వ ఆలోచన లను అధికార యంత్రాంగం సమర్థంగా అమలు చేసింది. క్షేత్రస్థాయిలో కొంతవరకు ఆశించిన మార్పులు సాధించగలిగాం. మరిన్ని రంగాల్లో మరింతగా మెరుగుపడాలి. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర-2047 విజన్ రూపకల్పన చేశాం. తలసరి ఆదాయం, జీఎస్టీపీ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. సుపరిపాలన అందించేలా ప్రతీ సోమవారం ఆర్టీజీఎస్ నుంచి సమీక్షలతో పాటు నాలుగు సార్లు మంత్రులు, కార్యదర్శుల సమావేశాలు, 7 సార్లు కలెక్టర్ల సదస్సులు నిర్వ హించాం. 19 ఎస్ఐపీబీ సమావేశాలు, 52 క్యాబినెట్ సమావే శాల ద్వారా పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. గత పాలనలో ఏపీపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం పోయింది. మేం అధికారంలోకి వచ్చాక పరిస్థితిలో మార్పు తెచ్చాం. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించాం. ఏపీ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా మారింది. పెట్టుబడులు, ఉపాధి అవకా శాలు పెరిగాయి. వనరులను సమర్థంగా వినియోగించుకోవాల న్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఏపీని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలబెట్టాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. రాయలసీమ, ఉత్తరాం ధ్ర, కోస్తాంధ్ర ఇలా అన్ని జిల్లాల్లో అపారమైన వనరులు, పెట్టుబ డి అవకాశాలు ఉన్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్, సిలికా, గ్రానైట్, బాక్సైట్ సహా విలువైన వనరులను వాల్యూ అడిషన్ చేసేలా ప్రణాళికలు రూపొందించాం. ఇన్నోవేషన్ ద్వారా మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీ, వనరులు, నాలెడ్జి మన దగ్గర ఉన్నాయి. దానిని అందిపుచ్చుకునే నాయకత్వం మనకు కావాలి. పాలసీలు తీసుకురావటం సులభమే అయినా వాటిని అమలు చేయటమే అత్యంత కీలకం. ఇక నుంచి నెల వారీ ఆర్థిక నివేదికల ద్వారా ముందుకువెళ్లాలని నిర్ణయించాం. ప్రతీనెలా ఒకసారి కార్యదర్శులు, హెచ్్వడీల సమావేశం ద్వారా ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకుం దామని తెలిపారు.
అర్జీలు వేగంగా పరిష్కరించి ప్రజలకు స్వాంతన
గత పాలనలో కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనితీరు మెరుగ్గా లేకపోవటంతో ప్రజల నుంచి పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టమ్ ద్వారా ఈ అర్జీలను వేగంగా పరిష్కరించి ప్రజలకు స్వాంతన కలిగించాలి. గత పాలకుల వల్ల రెవెన్యూ శాఖలో అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. భూ వివాదాలకు సంబంధించిన అర్జీలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సి వచ్చింది. పీజీఆర్ఎస్లో జీరో పెండెన్సీ అనేది లక్ష్యం కావాలని అన్ని శాఖలకూ నిర్దేశిస్తున్నాను. శెట్టిపల్లి, వట్టిచెరుకూ రు, కంగుంది, గుటుపల్లి లాంటి ప్రాంతాల్లో భూ సమస్యలు పరిష్కరించాం. రీసర్వే ప్రక్రియ ద్వారా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను ప్రతీ నెలా 9 తేదీన పంపిణీ చేస్తు న్నాం. ఇంకా 72 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ శాఖలు ఆర్జీల పరిష్కారం కోసం నిబంధనల్లో మార్పులు తీసుకురావడం, లేదంటే చట్టాలను సవరించే అంశంపై విశ్లేషణ చేయాలి. మెరుగ్గా పనిచేస్తే 15 శాతం వృద్ధి రేటును సాధించే అవకాశం ఉంది. పాలన సులభ తరం చేసేందుకు, రెవెన్యూ వసూళ్లు పెంచుకునేలా కొన్ని ఏఐ టూల్స్ కూడా రూపొందించాం. ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖ ల్లో 24 శాతం మేర రెవెన్యూ వసూళ్లు పెరిగాయి. జీఎస్టీపీ వృద్ధి రేటు 2017తో పోలిస్తే గత ఏడాదిలో 20 శాతం మేర పెరిగిం ది. కీలక స్థానాల్లో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు అభివృద్ధి నిరోధ కులుగా పనిచేయటం సరికాదని హెచ్చరించారు.
సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలి.
ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోనూ పర్యటించాలి. ప్రజల సమస్యలు, వాస్తవాలు తెలియాలంటే క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. వినూత్న ఆలోచనలతోనే సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకు వెళ్లాలి. మూడో ఏడాదిలోకి అడుగుపెట్టినప్పటికీ విద్యుత్ ఛార్జీల ను పెంచలేదు. ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని చెప్పిన మాటను నిలబెట్టుకున్నాం. తొలిసారి ట్రూ డౌను కూడా అమలు చేస్తున్నాం. పట్టిసీమ నీటితో గోదావరి నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరు అందించగలుగుతున్నాం. రాష్ట్రంలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ఎల్న్ని కారణంగా తలెత్తిన తీవ్ర వర్షాభావ పరిస్థితులపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి. ఒక మంచి అధికారి సమస్యలను పరిష్కరిస్తే… అద్బుతంగా పనిచేసే అధికారి అసలు సమస్యలనేవే తలెత్తకుండా చూస్తారనే కోణంలో అందరూ పనిచేయాలి.
ముందుచూపుతో అంతా పనిచేస్తేనే మెరుగైన పాలనను, ఫలితా లను ప్రజలకు అందించగలం. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఆగస్టు 14 తేదీన అనకాపల్లికి పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను విడుదల చేస్తాం. సెప్టెంబరు 1న వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను కూడా జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రంలోని 36 ప్రాజెక్టుల ను కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం. ప్రతీ నెలా జరిగే మంత్లీ ఎకనామిక్ రిపోర్టుల ఆధారంగా ఎప్పటికప్పుడు సమీక్షిం చుకుని ముందుకువెళదామని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధిలో సహకరిస్తున్న అధికారులు, ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు, సీఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీష్కుమార్ గుప్తా, ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్డీలు హాజరయ్యారు.














