చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సంస్కరణలే సంపద సృష్టికి పునాది

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ

by చైతన్యరధం
Apr 26, 2026 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
సంస్కరణలే సంపద సృష్టికి పునాది
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సంస్కరణలను అందిపుచ్చుకుంటున్నాం… పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం
  • పారిశ్రామికాభివృద్ధితోనే సంక్షేమం సాధ్యం
  • వివిధరంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు
  • ప్రధాని మోదీ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్…
  • గ్రీన్ ఎనర్జీ, ఏఐతో నవయుగం
  • మహిళలు సంకల్పిస్తే రిజర్వేషన్ బిల్లు అమలు
  • ఎకనమిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానోత్సంలో సీఎం చంద్రబాబు
  • బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025 అవార్డు అందుకున్న సీఎం
  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ

ముంబయి (చైతన్య రథం): ‘సంపద సృష్టికి సంస్కరణలే పునాది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారతదేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. ముంబయిలో ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025 అవార్డును కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అందుకున్నారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్వీకరించడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు ద్వారా మరికొన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని ఆశిస్తున్నాను. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రావాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. ఏపీలో అనుమతుల వేగాన్ని పారిశ్రామికవేత్తలు గుర్తించాలి. వివిధరంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. దేశంలో సంస్కరణలు అమలవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. ఇది పెట్టుబడులకు కూడా మెరుగైన సమయం. భారత్‌కు అత్యుత్తమ పెర్ఫార్మర్, రిఫార్మర్, విన్నర్‌గా ప్రధాని మోదీ ఉన్నారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అనే విధానాల ద్వారా సుపరిపాలన అందిస్తున్నాం. ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్, ఏఐ అగ్రానమిలాంటి సేవలు అందిస్తున్నాం. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థాయి దేశంగా మారుతుంది. దేశంలో ఆర్ధిక సంస్కరణల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండడం నా అదృష్టం. సంస్కరణలకు అనుగుణంగానే నాడు ఉమ్మడి ఏపీలో విజన్ 2020 అమలు చేశాం. ఆ ఫలాలనే ఇప్పుడు హైదరాబాద్ చూస్తోంది. ప్రధాని మోదీ కూడా ఇప్పుడు 2047 `వికసిత్ భారత్ రూపకల్పన చేశారు. అందులో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నదే నా ఆకాంక్ష. 1990లో వచ్చిన ఐటీ విప్లవాన్ని మేం అందిపుచ్చుకున్నాం. ఇప్పుడు క్వాంటం, ఏఐలాంటి ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ టెక్నాలజీలను అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాల్సి ఉంది” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026

అండగా నిలబడతాం

స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

విద్యుత్ సంస్కరణలతో మిగులు విద్యుత్ సాధించాం
“గతంలో విద్యుత్ సంస్కరణలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసి మిగులు విద్యుత్ సాధించాం. రాష్ట్రంలో వినియోగదారులకు మేలు కలిగేలా నియంత్రణ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశాం. సౌర, పునరుత్పాదక విద్యుత్‌కు పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పించాం. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ అమ్మోనియాలాంటి రంగాల్లో విద్యుత్ ఉత్పత్తి కావాలి. అప్పుడే ఇంధన రంగంలో భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. డీజిల్, పెట్రోలు, గ్యాస్ లాంటి ఇంధనాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి అనేది కీలకం. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తేనే ప్రయోజనాలుంటాయి. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదన చేయాలని ప్రధాని లక్ష్యం విధిస్తే అందులో ఏపీ 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పటికే 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా ముందడుగు వేశాం. ప్రొజ్యూమర్ అనే విధానంలో పెద్దఎత్తున విద్యుత్ ఉత్పాదన చేసి త్వరలోనే ఎగుమతులు సాధించగలుగుతాం. గతంలో సౌర విద్యుత్ ప్యానళ్ల కోసం చైనాపై ఆధారపడే వాళ్లం. ఇప్పుడు వాటిని దేశీయంగానే ఉత్పత్తి చేయగలుగుతున్నాం. గ్రీన్ అమ్మోనియాలాంటి వాటి ద్వారా ఈ ఇంధన లక్ష్యాలను చేరుకోగలుగుతాం. డేటా సెంటర్లకు కూడా పెద్దఎత్తున విద్యుత్ కావాలి. గూగుల్ సంస్థ విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. 28న మేం విశాఖలో గూగుల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నాం” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఫ్యూచర్ సిటీగా అమరావతి నిర్మాణం
“ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం ద్వారా దేశానికి టెక్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయగలిగాం. రాష్ట్ర విభజన అనంతరం ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం దక్కింది. ఫ్యూచర్ సిటీగా గ్రీన్, బ్లూ సిటీ, నెట్ జీరో కాన్సెప్టుతో హైదరాబాద్ ప్లస్ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. రెవెన్యూ వస్తేనే సంక్షేమం చేయగలం. అభివృద్ధితోపాటు సంక్షేమం కూడా కీలకమైన అంశం. మన సమాజం కేవలం మిలియనీర్లు, బిలియనీర్ల కోసం మాత్రమే కాదు. సాధారణ ప్రజలది కూడా. అందుకే పీ4 పేరిట వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. సమాజంలో ప్రతీ ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందాలి. పది శాతం మంది ధనవంతులు మార్గదర్శులుగా మారి… సమాజంలో 20 శాతం మంది పేదలను ఆదుకునేలా పీ4 కార్యక్రమాన్ని రూపొందించాం. ఎంబీకే 10-20 అనే ఫార్ములాతో సమాజంలో అట్టడుగున ఉండిపోయిన వారిని సంపద ఆర్జించిన వారు ఆదుకోవటమే ఈ కార్యక్రమం” అని సీఎం వ్యాఖ్యానించారు.

మహిళల సంకల్పంతో రిజర్వేషన్ బిల్లు అమలు
“మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్ర సరైన నిర్ణయమే తీసుకుంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు మహిళా బిల్లు తెచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకించాయో అర్ధం కావడం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకంటే 50 శాతంమేర సీట్లు పెరుగుతున్నాయి. మహిళలకు, పురుషులకు ఎక్కువ అవకాశాలు దక్కి ఉండేవి. ఇండి కూటమి పార్టీల వైఖరితో మహిళలు అవకాశాలు కోల్పోయారు. దేశంలోని మహిళలంతా గట్టిగా సంకల్పించుకుంటే ఈ బిల్లు ఎలాగైనా అమలు అవుతుంది. పరిశ్రమలను ప్రోత్సహిస్తేనే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయి. ప్రధాని మోదీ ప్రగతిశీల ఆలోచనలు ఉన్న నాయకుడు. నిబంధనల్ని సరళీకృతం చేయటం, పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తున్నారు. పెట్టుబడులకు ప్రోత్సాహం అందిస్తేనే సంపద సృష్టి జరుగుతుంది. 3 దశాబ్దాల క్రితం జనాభా నియంత్రణను గట్టిగా అమలు చేశాం. భవిష్యత్తులో జనాభా కొరతను మన దేశం ఎదుర్కోనుంది. అందుకే జనాభా నిర్వహణ ప్రక్రియను చేపట్టాలనే ఉద్దేశ్యంతో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ రూపొందించాం. డబ్బులుంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు పెట్టవచ్చు. కానీ భవిష్యత్తులో జనాభాను సాధించలేం. భారత్ ఫెర్టిలిటీ రేటు 1.9 ఉంది. ఏపీలో అది 1.5 మాత్రమే ఉంది. అందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. భవిష్యత్తులో జనాభా ఉన్న దేశాలే అత్యంత సంపన్న దేశాలుగా మారతాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకువచ్చి అమలు చేయాలని నిర్ణయించాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

Previous Post

ఇంధన కొరతపై సమీక్ష

Next Post

జూన్ నాటికి అనకాపల్లి వరకు గోదావరి జలాలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026

కార్యకర్త
@ June 10, 2026
అండగా నిలబడతాం
ఆంధ్రప్రదేశ్

అండగా నిలబడతాం

చైతన్యరధం
@ June 10, 2026
స్టీల్ ప్లాంట్ ప్రమాదం..
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

చైతన్యరధం
@ June 10, 2026
ఆన్లైన్ లో  ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్
ఆంధ్రప్రదేశ్

ఆన్లైన్ లో ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్

చైతన్యరధం
@ June 10, 2026
లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 10, 2026
ప్రాజెక్టులతో ‘ఆర్థిక’ పరుగులు
ఆంధ్రప్రదేశ్

ప్రాజెక్టులతో ‘ఆర్థిక’ పరుగులు

చైతన్యరధం
@ June 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-06-2026

కార్యకర్త
@ June 9, 2026
ఆంధ్రప్రదేశ్

విశాఖ ఉక్కు ప్రమాదం రాష్ట్రానికి షాక్

చైతన్యరధం
@ June 9, 2026
Load More

ముఖ్య వార్తలు

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
2027 నాటికి భూ రికార్డులు క్లీన్

2027 నాటికి భూ రికార్డులు క్లీన్

చైతన్యరధం
@ June 9, 2026
ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

చైతన్యరధం
@ June 7, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అండగా నిలబడతాం

అండగా నిలబడతాం

చైతన్యరధం
@ June 10, 2026
స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

చైతన్యరధం
@ June 10, 2026
ఆన్లైన్ లో  ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్

ఆన్లైన్ లో ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్

చైతన్యరధం
@ June 10, 2026
లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist