అమరావతి(చైతన్యరథం): వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది రోజున తీపి కబురు చెప్పారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. వారికి ఇప్పుడిస్తున్న నెలకు రూ. 5 వేల గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని ప్రకటించారు. వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించకుండా ప్రజలకు సేవ చేస్తే అండగా ఉంటామని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఉగాది వేడుకల్లో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వాలంటీర్లను రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు అడుగుతున్నారు. కానీ చాలా మంది చేయలేదు. జగన్ రెడ్డి నిన్నటి దాకా వాలంటర్లు రాజీనామాలు అడిగాడు. ఇప్పడు వాలంటీరు వ్యవస్థే లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ మళ్లీ తెచ్చేందుకు పెడతా అంటున్నాడు…మరి ప్రస్తుతం ఆ వ్యవస్థ లేనట్లే కదా.? వాలంటీర్లను జగన్ మోసం చేస్తున్నాడు. దగా…అవకాశ వాద రాజకీయం చేస్తున్నాడు. పూటకో మాట మాట్లాడుతున్నాడు.
వాలంటీర్లు రాజీనామా చేయకుండా పార్టీకి సేవ చేయాలని చెప్తున్నాడు..కేసుల్లో ఇరుక్కుంటే మంచి చదువులు చదువుకున్న వారి పరిస్థితి ఏంటి? కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్‌లో ఉద్యోగాలొస్తాయా? కూటమి తరపున వాలంటీర్లకు ఉగాది సందర్భంగా తీపి కబురు చెప్తున్నా…వాలంటీర్ ఉద్యోగాలు తొలగించం…కొనసాగిస్తాం. రూ.5 వేలు కాదు…రూ.10 వేలు పారితోషికం ఇస్తాం. మీలో సమర్థత, శక్తి ఉన్నాయి..మీ ఇంట్లో మీరు కూర్చుని వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు. నిరుద్యోగ భృతి కూడా అందిస్తాం. స్కిల్ డెవలెప్మెంట్ ద్వారా భవిష్యత్తును నిర్మిస్తాం. తప్పుడు పనులు చేసి జైలుకుపోయి జీవితాలు పాడు చేసుకుంటారా…రాష్ట్రాభివృద్ధిలో భాగమవుతారో వాలంటీర్లు తేల్చుకోవాలి. జగన్ మళ్లీ వచ్చేది లేదు..సచ్చేది లేదు. నమ్మి మోసపోవద్దు. పింఛన్లు నేనిస్తున్నా అంటున్నాడు….నువ్వు ఇవ్వడం ఏంటి… పింఛను ఎవరిచ్చారు…నువ్విచ్చావా.? నీ భారతి సిమెంట్ నిధుల నుండి ఇచ్చావా..? ప్రజలు కట్టిన పన్నుల నుండి పింఛన్ ఇస్తున్నారు. అప్పులు చేయడం కాదు…సంపద సృష్టింది అప్పుల భారం లేకుండా సంక్షేమాన్ని ఇస్తాం. మంచికి మీరంతా సహకరించి దుర్మార్గులను దూరంగా పెట్టాలని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.