• ఉదయగిరి అసెంబ్లీ నియోకవర్గం సత్యవోలు గ్రామప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో పంచాయితీరాజ్ శాఖ పరిధిలోని కుమ్మరికుంట చెరువు కింద 150ఎకరాల ఆయకట్టు ఉంది.
• ఈ చెరువుకు వర్షాధారంగానే నీరు వస్తోంది, బాగా వర్షాలు కురిసినా చాలీచాలకుండా నీరుచేరుతోంది.
• మేము వరినార్లు పోసుకొని నాట్లు వేసిన నెలకే చెరువు ఎండిపోతోంది.
• దీనివల్ల పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోతున్నాము.
• మెట్టపైరు వేసుకోవడానికి చెరువులో నీరు లేనందున పొలాలను పెట్టుకోవాల్సి వస్తోంది.
• చెరువుకు 500 మీటర్ల దూరంలో సోమశిల కాల్వ ఉంది.
• దానినుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు నీరందించే ఏర్పాటుచేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్లక్ష్యంచేసి అన్నదాతలకు తీవ్ర అన్యాయం చేశారు.
• గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి రూ.68,293 కోట్లు ఖర్చుపెట్టాం.
• ఈ ప్రభుత్వం వచ్చాక కమీషన్ల కక్కుర్తితో రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును సైతం గోదాట్లో కలిపేశారు.
• టిడిపి అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తిచేసి ప్రతిఎకరాకు సాగునీరు అందిస్తాం.
• కుమ్మరికుంట చెరువుతోపాటు గ్రామీణ చెరువులకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.