- రాష్ట్రంలో అమలుకు కార్యాచారణ ప్రణాళిక
- రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి
- అస్సాంలో ముగిసిన రెండురోజుల పర్యటన
అమరావతి(చైతన్యరథం): అస్సాం రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం (రోడ్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్) విజయవంతంగా అమలవుతోందని, అత్యాధునికమైన పరికరాలతో రోడ్ల వివరాలను సేకరిస్తున్న తీరు ఆదర్శవంతంగా ఉందని రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి అన్నారు. ఇటువంటి అత్యాధునిక విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అధికారు లకు సూచించారు. రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానంపై సమగ్ర అధ్యయ నం కోసం మంత్రి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం అస్సాంలో రెండురోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానమైన రోడ్లతో ప్రజలు అవస్థలను దృష్టిలో ఉంచుకుని నేడు మెరుగైన రోడ్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుందన్నారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనలో అధు నాతనమైన విధానాలను అవలంభించాలనే ఆలోచనతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, అభివృద్ధిలో అమలవుతున్న సరికొత్త విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు సమగ్ర అధ్యయనం చేస్తోందన్నారు. తొలిరోజు మంత్రి నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందానికి అస్సాం పబ్లిక్ వర్స్క్ డిపార్ట్మెంట్ రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం అమలు తీరుతెన్నులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
రెండోరోజు పర్యటనలో రోడ్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను విజయవంతంగా అమలుచేస్తున్న తీరు తెన్నులను ఈ బృందం క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించింది. నెట్వర్క్ సర్వే వెహికల్‌ను సందర్శించడానికి అస్సాంలోని మీర్జాకు వెళ్లారు. ప్రత్యక్ష డేటా సేకరణపై ప్రదర్శన కోసం అసోమ్ మాల కారిడార్‌లోని ‘‘పలాస్ బారి- మిర్జా-చాందుబీ రోడ్డును’’ సందర్శించారు. అస్సాం మాల పథకం కింద అస్సాం ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక రోడ్డును కూడా పరి శీలించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో తయారైనా హాక్ ఐ వెహికల్, అత్యాధునికమైన అమెరికాలో తయారైన పాత్ రన్నర్ వెహికల్ రెండిరటినీ పరిశీలించారు. ఈ వాహనంలో ప్రయాణించిన మంత్రి రోడ్ వివరాల సేకరణ ఎలా జరుగుతుందో ప్రత్యక్షంగా పరిశీలిం చారు. అలాగే రోడ్డు రెసిడ్యువల్ స్ట్రెంగ్త్ కనుక్కునే పాలింగ్ వైట్ డిఫ్లెక్టో మీటర్ పనితీరును క్షేత్రస్థాయిలో మంత్రి స్వయంగా పరిశీలించారు. దీంతోపాటు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ వ్యవస్థ పనితీరును కూడా పరిశీలించారు. ఇటువంటి అత్యాధునికమైన పరికరాలతో రోడ్డు వివరాలను సేకరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన మంత్రి రాష్ట్రంలో అమలుకు ప్రతిపా దనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, రిటైర్డ్ స్పెషల్ సీఎస్ శ్యామ్‌బాబు, ఆర్అండ్బీ ఈఎన్సీ నయిముల్లా, ఆర్టీసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.