- చంద్రబాబు ఎక్సైజ్ శాఖ చూడలేదు
- ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలే
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన మద్యం కేసుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. చంద్రబాబుపై జగన్ రెడ్డి తప్పుడు మద్యం కేసు పెట్టారని మండిపడ్డారు. మద్యం షాపులకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసే ఫైలు చంద్రబాబు వద్దకు రాలేదని లోకేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఎక్సైజ్ శాఖ చూడలేదు… ఆ ఫైలుపై సంతకం చేయలేదు అని వెల్లడిరచారు. జగనాసుర కుట్రలో భాగంగానే చంద్రబాబును ఏ3గా చేర్చారని ఆరోపించారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే వరుస కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కేసులో ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని పేర్కొన్నారు.