చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏపీ తలెత్తుకునే ఘట్టం!

మీడియా సమావేశంలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
Oct 16, 2025 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఏపీ తలెత్తుకునే ఘట్టం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సమష్టి కృషివల్లే రాష్ట్రానికి గూగుల్‌
  • రాష్ట్ర ప్రజలంతా గర్వించే సమయమిది..
  • 20లక్షల ఉద్యోగాల సాధనకు నిరంతరం కృషి
  • ఇక ప్రతివారం ప్రాజెక్టు అనౌన్స్‌మెంట్లు ఖాయం
  • 17నెలల్లో ఇన్వెస్టిమెంట్‌ అట్రాక్ట్‌ స్టేట్‌గా ఏపీని నిలపాం
  • రాష్ట్రానికి రావొద్దంటూ గూగుల్‌కూ మెయిళ్లు పెట్టారు
  • వైసీపీతో రాష్ట్రానికి చేటు.. ఆ పార్టీతో అంతా విధ్వంసమే
  • మీడియా సమావేశంలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్‌

అమరావతి (చైతన్య రథం): చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా కేవలం చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి నారా లోకేష్‌ ఉద్ఘాటించారు. ఉండవల్లి నివాసంలో బుధవారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘2014-19 నడుమ ఇండియా లార్జెస్ట్‌ ఆటోమోటివ్‌ ఎఫ్‌డిఐ కియాను చంద్రబాబు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తున్నాం. ఇండియా సింగిల్‌ లార్జెస్ట్‌ ఎఫ్‌డిఐ ఇన్వెస్టిమెంట్‌ ఇన్‌ హిస్టరీ, ఏపీలో గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడుతుంది. అమెరికా వెలుపల గూగుల్‌ లార్జెస్ట్‌ డేటా సెంటర్‌ ఇది. అనేక దేశాలు, రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఏపీకి వెళ్తేనే ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌’ వల్ల పెట్టుబడి పెట్టగలం, ఇబ్బంది ఉండదని గ్రహించి రాష్ట్రానికి వచ్చారు. గూగుల్‌ రాక ఏపీ గెలుపు కాదు, భారతదేశం గెలుపు. గతంలో మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌ రూపురేఖలు మార్చిన విధంగానే… ఇప్పుడు గూగుల్‌ విశాఖ రూపురేఖలు మార్చబోతోంది. ఇది కేవలం ఒక్క డాటా సెంటర్‌ గురించి మాత్రమే కాదు. కేబుల్‌ ల్యాండిరగ్‌ స్టేషన్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ, ఏఐకి సంబంధించి అనేక అనుబంధ కంపెనీలు విశాఖకు వస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం దీనిద్వారా 25రెట్ల ఆర్థిక ప్రభావం ఉంటుంది. అలాంటి ఎకనమిక్‌ యాక్టివిటీ గూగుల్‌ చేయబోతోంది. ఈ ఒక్క పెట్టుబడివల్ల 1,88,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థపై ఐదేళ్లలో రూ.48వేలకోట్ల ప్రభావం చూపుతుంది’’ అని స్పష్టం చేశారు.

గూగుల్‌ కోసం చట్టాల్లో సవరణలు చేశాం
సెప్టెంబర్‌ 2024లో గూగుల్‌ ప్రతినిధులు విశాఖకు వచ్చినపుడు డాటాసెంటర్‌ స్థలం చూపించాను. నెల తర్వాత నేను అమెరికా గూగుల్‌ క్లౌడ్‌ లీడర్‌ షిప్‌ను కలిశాను. అనంతరం నవంబర్‌లో వారు ముఖ్యమంత్రి కలిశారు. ఆ సమయంలో గూగుల్‌ ప్రతినిధి బృందం ఏపీలో కాకుండా దేశంలోనే కొన్ని చట్టాలను సవరించాలని కోరారు. దీనిపై నేను అశ్వనీవైష్టవ్‌ దృష్టికి తీసుకెళ్లాను. ఈ అంశంపై ముఖ్యమంత్రి పలుమార్లు నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ప్రధాని మంత్రిని గూగుల్‌ పెట్టుబడిపై రెండుసార్లు కలసి చర్చించిన తర్వాత చట్టాల్లో అవసరమైన సవరణలు చేశారు. అందువల్లే ఇంతపెద్ద ఇన్వెస్టిమెంట్‌ ఏపీకి, భారతదేశానికి వచ్చింది. ఐటి సెక్రటరీ భాస్కర్‌, కార్తికేయ మిశ్రావంటి సీనియర్‌ అధికారులు ఈ ప్రాజెక్టు కోసం గ్రౌండ్‌ వర్క్‌ చేశారు. అందరం కలసికట్టుగా సమన్వయంతో పనిచేసి విశాఖపట్నానికి ఈ భారీ పెట్టుబడి తెచ్చాం. ఏపీ సాధించింది. భారతదేశం సాధించింది. ఇది అందరం గర్వపడాల్సిన సమయం. ఈరోజు ప్రపంచమంతా భారతదేశం గురించి మాట్లాడుతోంది. భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వచ్చిందని చర్చించుకుంటోంది’’ అని లకేష్‌ ఉత్సాహంగా ప్రకటించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యం
‘‘మా లక్ష్యం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. కియా మోటారుతో అనంతపురాన్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం. నార్త్‌ అనంతపురం, కర్నూలులో ఇప్పటికే పెద్దఎత్తున రెన్యూవబుల్‌ ఎనర్జీ, పంప్డ్‌ స్టోరేజీ పెట్టుబడులు వస్తున్నాయి. కర్నూలులో రెండు కొత్త సిమెంట్‌ ఫ్యాక్టరీలకు అనుమతులిచ్చాం. మరో అయిదారు సిమెంట్‌ ఫ్యాక్టరీలు తెస్తాం. చిత్తూరు, కడప జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఎకోసిస్టమ్‌ తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే అనేక పెట్టుబడులు వచ్చాయి. నెల్లూరు జిల్లా శ్రీసిటీలో మా ప్రభుత్వం వచ్చాక అనేక పెట్టుబడులు తీసుకువచ్చాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే దేశంలో 50శాతం ఏసీలు ఏపీలో తయారవుతున్నాయి. డైకిన్‌, బ్లూస్టార్‌ విస్తరణకు వెళ్తున్నారు. అవి పూర్తయితే 80శాతానికి చేరుకునే అవకాశం ఉంది. స్పేస్‌ సిటీ రావాలన్న ఉద్దేశంతో ఇండియా స్పేస్‌ ఎక్స్‌ సంస్థ స్క్రై రూట్‌కు 300 ఎకరాలు, ఎకరా 5 లక్షలకు ఇచ్చాం. ప్రకాశం జిల్లాలో రిలయన్స్‌ సిబిజిపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ వస్తోంది. జనవరినుంచి క్వాంటమ్‌ కంప్యూటర్‌కు సంబంధించి ఎకో సిస్టమ్‌ ఇక్కడకు తీసుకువస్తున్నాం. ఉభయగోదావరి ఆక్వా పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్‌ సంస్థలను తీసుకువస్తున్నాం’’ అని లోకేష్‌ వివరించారు.

ఉత్తరాంధ్రకు భారీఎత్తున పెట్టుబడులు
‘‘ఉత్తరాంధ్రకు భారీఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఆర్సెలర్‌ మిట్టల్‌ ఇండియా లార్జెస్ట్‌ స్టీల్‌ ప్లాంట్‌, గూగుల్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, యాక్సెంచర్‌, రహేజావంటి నిర్మాణసంస్థలు, మెడికల్‌ డివైస్‌, ఫార్మా సంస్థలు వచ్చాయి. అన్ని ప్రాంతాలను సమగ్రాభివృద్ధి చేసి 2024నాటికి ఏపీని 2.4 ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్లస్టర్‌ బేస్డ్‌ విధానంలో వర్టికల్‌, హారిజంటల్‌ ఇంటిగ్రేషన్‌తో ముందుకెళ్తున్నాం. 100 కి.మీ.ల పరధిలో ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చేస్తున్నాం. ప్రధాన సంస్థల అనుబంధ యూనిట్లన్నీ ఆ చుట్టుపక్కల వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. హారిజంటల్‌ విభాగంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎక్విప్‌మెంట్‌, టెస్టింగ్‌వంటివాటికి ప్రాధాన్యతనిస్తున్నాం. అందుకే జోన్‌లవారీగా అభివృద్ధి చేస్తున్నాం. క్లస్టర్‌ బేస్డ్‌ అప్రోచ్‌తో ముందుకెళ్తున్నాం’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా గ్రేటర్‌ విశాఖ
గ్రేటర్‌ విశాఖ ఎకనమిక్‌ కారిడార్‌ను ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీ చేయాలన్నదే మా లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించి, ఇంటిగ్రేటెడ్‌ ప్రణాళికలు (ఎయిర్‌ పోర్టు, రైల్వే, రహదారులు) రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌ అభివృద్ధికి 30ఏళ్లు పడితే, పదేళ్లలోనే విశాఖను అదేతరహాలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. విశాఖ, అమరావతి, రాయలసీమ ఎకనమిక్‌ కారిడార్‌లను ప్రపంచస్థాయి అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీనిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ నెం.1గా నిలబడుతుంది. ఎంఓయులను పట్టించుకోకుండా నేరుగా ఎగ్జిక్యూషన్‌కే వెళ్తున్నాం. ఆర్సెలర్‌ మిట్టల్‌తో ఇప్పటికీ ఎంఓయు లేదు. నవంబర్‌లో భూమి పూజ చేస్తున్నాం. టీసీఎస్‌కు ఎంఓయు లేకపోయినా నవంబర్‌లో ప్రారంభించబోతున్నామని లోకేష్‌ స్పష్టం చేశారు.

ఐటి రంగంలో 5 లక్షల ఉద్యోగాలు
‘‘రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులపై నిరంతరం ఫాలోఅప్‌ చేస్తున్నాం. చాలామంది దావోస్‌ వెళ్లి ఏంచేశారని అడిగారు. దావోస్‌లో గూగుల్‌ క్లౌడ్‌ సిఇఓను ముఖ్యమంత్రి కలిశారు. నేను ముంబాయి వెళ్లినపుడు టీసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌తో పలు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించాను. పెట్టుబడుల కోసం క్రియాశీలకంగా, చురగ్గా ముందుకెళ్తున్నాం. టాప్‌ -10 ఇన్వెస్టర్స్‌ లిస్ట్‌ నా బ్యాగులోనే ఉంటుంది. ప్రతివారం వాటిని మా కార్యాలయం ఫాలోఅప్‌ చేస్తుంది. ప్రతి ప్రాజెక్టుకు ఒక వాట్సాప్‌ గ్రూప్‌ కూడా ఏర్పాటు చేశాం. రిలయన్‌ సిబిజి పరిశ్రమకు ఒకవారం అప్‌డేట్‌ రాకపోతే నేనే రంగంలోకి దిగుతున్నా. బాబు సూపర్‌ 6 తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నాం. ఈ లక్ష్యసాధనకు అహర్నిశలు కష్టపడుతున్నాం. ఒక్క ఐటి రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని చాలెంజ్‌గా తీసుకున్నాం. రాబోయేరోజుల్లో ప్రతివారం కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ ఉంటాయి. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు 17 నెలలు మంత్రులందరం కలసి పనిచేస్తున్నాం. అహర్నిశలు కష్టపడుతున్నాం. 2019-24 నడుమ ఎవరూ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేవారు కాదు. వారి హయాంలో కేవలం విధ్వంసమే. మేం వచ్చాక 17 నెలల్లో ఇన్వెస్టిమెంట్‌ ఎట్రాక్ట్‌ స్టేట్‌గా ఏపీ మారింది. ఇందుకు ప్రధాన కారణం డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ కారణం. ఢల్లీిలో ప్రధాని మోడీ, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కలసికట్టుగా కృషి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తేగా, ఒక్క ఫోన్‌ కొడితే ఏపీలో అమలు చేస్తారనే నమ్మకం వారిలో కలిగింది. లేబర్‌ రిఫామ్స్‌ను కేవలం 15రోజుల్లో చేసి చూపించాం. మేం అనుకున్నది సాధించాలంటే ప్రజల సహకారం చాలా అవసరం. ఏపీని అన్నిరంగాల్లో నెం.1గా చేసేందుకు ప్రజలు మాతో కలసిరావాలని మంత్రి లోకేష్‌ కోరారు.

Previous Post

సమాజ హితమే ఆంధ్రజ్యోతి లక్ష్యం

Next Post

సురక్షా యాప్‌తో..స్కాన్‌ చేశాకే మద్యం విక్రయాలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

కార్యకర్త
@ July 14, 2026
రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!
ఆంధ్రప్రదేశ్

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

కార్యకర్త
@ July 13, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
Load More

ముఖ్య వార్తలు

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist