- తనిఖీలకు ప్రైవేటు సైన్యంతో మైనింగ్ అధికారులు
- మద్యం మత్తులో, కారంపొడి, కర్రలతో వచ్చిన వైసీపీ గూండాలు
- మార్టూరులో టీడీపీ వారి గ్రానైట్ ఫ్యాక్టరీల్లో తనిఖీల పేరిట బెదిరింపులు
- నిలదీసిన ఎమ్మెల్యే ఏలూరిపైనా దాడికి యత్నం
- తిరగబడటంతో పరారైన వైనం
- అధికారుల తీరుపై మండిపడ్డ ఏలూరి
- గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ప్రైవేటు సైన్యం నడుపుతున్నారని విమర్శ
మార్టూరు: వాహనాల్లో మద్యం మత్తులో ఉన్న గూండాల్లాంటి వ్యక్తులు. వారి వెంట కర్రలు, కారం పొడి పొట్లాలు. వీరంతా గ్రానైట్ ఫ్యాక్టరీల్లో సోదాలకు వచ్చిన మైనింగ్ అధికారులంట. వారు వచ్చిన కొన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్‌లు కూడా లేకపోవడం గమ నార్హం. జగన్‌రెడ్డి పాలనలో తప్ప ఎక్కడాచూడని విపరీ త పోకడలకు బాపట్లజిల్లా పర్చూరు నియోజకవర్గం లోని మార్టూరు వేదికయింది. జగన్‌రెడ్డి హయాంలో విచ్చలవిడి దోపిడీకి చిరునామాగా మారిన గనుల శాఖ, ఇప్పుడు ప్రైవేటు సైన్యంతో టీడీపీ సానుభూతి పరుల గ్రానైట్ ఫ్యాక్టరీల్లో సోదాల పేరిట భౌతిక దాడు లకు దిగే నీచానికి దిగజారింది. పర్చూరు నియోజక వర్గమంటే గుర్తు కు వచ్చేది అధికార వైసీపీకి గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు. అధికార పార్టీ పాల్పడుతున్న ఓట్ల అక్రమాలపై అలుపెర గని పోరాటం సాగిస్తున్న ఆయనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం, కసితీరక ఆయన అనుచరులు, టీడీపీ నేతలకు చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీల్లో సోదాలంటూ మంగళవారం మైనింగ్ అధికా రులను పంపించింది. మైనింగ్ అధికారులైతే సరే.. వారివెంట ప్రైవేటు సైన్యంలా వైసీపీ గూండాలు కూడా వచ్చి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు. మైనింగ్ ఏడీ ప్రతాపరెడ్డితో విశాఖపట్నంకు చెందిన వైసీపీ గూండా శ్రీనివాసరావు కూడా వచ్చి ఫ్యాక్టరీ యజమా నులపై దురుసుగా ప్రవర్తించాడు. బెదిరింపులకు దిగా డు. వారి ఫోన్లలో తెలుగుదేశంపార్టీ సానుభూతిపరుల గ్రానైట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన లొకేషన్ వివరాలు ఉండ డాన్ని బట్టే ఎంత పకడ్బందీగా కుట్రకు పథకం పన్నా రో తెలిసిపోతోంది. ఏడీతోి వచ్చిన కోరుకొండ శ్రీని వాసరావు, ఏడీ తీసుకొచ్చిన కారులో కారప్పొడి పొట్లా లు, కర్రలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఏలూరి అక్కడకు రావటంతో ఆయనపైనా దాడికి ప్రయత్నించారు. దీంతో టీడీపీ శ్రేణులు తిరగబడటం తో పరారయ్యారు.
మార్టూరులోని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అనుచరుల గ్రానైట్ ఫ్యాక్టరీల్లో మైనింగ్ అధికారులు మంగళవారం కొంతమంది వైసీపీ గూండాలతో కూడిన ప్రైవేట్ సైన్యంతో సోదాలు నిర్వహించారు. మార్టూరులో నాగరాజుపల్లి రోడ్డులో ఉన్న తెదేపా పట్టణ అధ్యక్షుడు కామినేని జనార్ధన్ కు చెందిన అనంత గ్రానైట్స్ లో తొలుత దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా వివిధ ప్రాంతాలకు ప్రాంతాలకు చెందిన అధికారులు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు చెందిన ఫ్యాక్టరీలపై దాడులు నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ఏలూరి అక్కడికి చేరుకుని తనిఖీ చేస్తున్న అధికారులను నిలదీశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎందుకు దాడులు నిర్వహిస్తున్నారని అడిగారు. దాడుల్లో ప్రైవేటు వ్యక్తులను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మద్దతు దారుల ఫ్యాక్టరీలపైన మాత్రమే దాడులు నిర్వహించడాన్ని ఆక్షేపించారు. రాజకీయ కక్ష సాధింపు లో భాగంగానే భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఇలాంటి పరిణామాలు సబబు కాదని గట్టిగా హెచ్చరించారు. దీంతో అధికారుల వెంట వచ్చిన వైసీపీ గుండాలు.. ఎమ్మెల్యే ఏలూరిపై దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యే ఏలూరి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని, అధికారులను, వైసీపీ రౌడీ మూకల తీరుపై గట్టిగా తిరగబడ్డారు. మైనింగ్ అధికారుల వెంట ప్రైవేట్ వ్యక్తులు రావడం ఏమిటని నిలదీశారు. అధికారలు వాహనాల్లో కర్రలు, కారప్పొడి తీసుకురావడం ఏమిటని నిలదీశారు. దీంతో వైసీపీ గూండాలు పరారయ్యారు.
అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి..
ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలతో మైనింగ్ అధికారులు మార్టూరులోని తెదేపా నేతలకు చెందిన పలు గ్రానైట్ పరిశ్రమలతోపాటు తనిఖీలు చేపట్టారని, జగన్ ప్రభుత్వ కక్షసాధింపులకు ఇది నిదర్శనమని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఇతరజిల్లాల అధికారులు సోదా లకు ఎలా వస్తారని ప్రశ్నించారు. టీడీపీ సానుభూతి పరుల ఫ్యాక్టరీల్లోనే ఈ సోదాలు నిర్వహిస్తు న్నారని, ఈ ప్రాంతంలో ఉన్న మిగిలిన గ్రానైట్ పరిశ్రమల్లో ఎందుకు తనిఖీలు నిర్వహించలేదని ప్రశ్నించారు. అందరికీ ఒకే న్యాయం ఉండాలన్నారు. అధికారులు తీరు సరిగా లేదన్నారు. వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు లో భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని ఏలూరి అసహనం వ్యక్తం చేశారు.
ప్రైవేటు మాఫియాను నడుపుతున్న వెంకటరెడ్డి..
రౌడీ మూకలతో వచ్చిన మైనింగ్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలోని అరాచకపాలనకు ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనమన్నారు. గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి గత 5 ఏళ్లుగా ప్రైవేటు మాఫియాను నడుపుతున్నారనారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వానికి సమాంతరంగా ప్రైవేటుసైన్యంతో వ్యవస్థలను నడుపుతున్నారని మండి పడ్డారు. నష్టాల్లో కూరుకుపోయిన పారిశ్రామిక రం గాన్ని మరింత అప్పుల్లోకి ఈ ప్రభుత్వం నెట్టిందన్నా రు. వేలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమపై బెదిరింపులకు పాల్పడుతూ వసూ ళ్ల పర్వానికి తెరలేపి అధికారపార్టీ నాయకులు అందిన కాడికి దోచుకుంటున్నారన్నారు. ఇతర జిల్లాలకు చెం దిన గ్రానైట్ అధికారులతో విజిలెన్సు బృందాలను నియమించి, ప్రైవేటు వ్యక్తులతో కలిసి తనిఖీలు నిర్వహిస్తూ తెలుగుదేశంపార్టీ సానుభూతిపరుల పరిశ్ర మలను కుట్రపూరితంగా దెబ్బతిస్తున్నారని మండిప డ్డారు. మార్టూరు ప్రాంతంలో పందిళ్లపల్లి నుంచి ప్రైవే టు సైన్యంతో చెక్ పోస్టులు ఏర్పాటుచేసి నిత్యం కప్పం వసూలు చేస్తున్నా అడిగేవారు, పట్టించుకునే వారు లేరన్నారు. మద్యం మత్తులో ఉన్న ప్రైవేటు సైన్యాన్ని తీసుకొచ్చి మైనింగ్ ఏడీ దాడులకు పురిగొల్పడాన్ని కఠినంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. పై అధి కారులు చెప్పారని వేధింపులకు గురి చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఏలూరి ప్రశ్నలకు అధికారులు నోరు మెదపలేదు.ఇలాంటి చర్యలు ఆపకపోతే న్యాయ స్థానంలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఏలూరి హెచ్చరించారు.