చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రూ.వెయ్యి కోట్ల ఆస్తిపై పేదలకు శాశ్వత హక్కు

ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లోకేష్‌ ఉద్ఘాటన

by చైతన్యరధం
Apr 5, 2025 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రూ.వెయ్యి కోట్ల ఆస్తిపై పేదలకు శాశ్వత హక్కు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పేదల రెండున్నర దశాబ్దాల కల నేరవేర్చాం
  • నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడే చెప్పా
  • కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో ఛాలెంజ్‌ చేశా
  • మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తాం
  • మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తా
  • యర్రబాలెం గ్రామానికి చెందిన 248 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్‌

మంగళగిరి (చైతన్యరథం): బహిరంగ మార్కెట్‌లో రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తిపై పేద ప్రజలకు శాశ్వత హక్కు కల్పిస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తొలి విడతలో 3వేల మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామన్నారు. మన ఇల్లు-మన లోకేష్‌.. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మంగళగిరి డాన్‌బాస్కో ఉన్నత పాఠశాల పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో యర్రబాలెం గ్రామానికి చెందిన 248 మంది పేద కుటుంబాలకు బట్టలు పెట్టి శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేశారు. మొదట బొక్కసం సంధ్య, పూర్ణచంద్రరావు దంపతులకు బట్టలు పెట్టి శాశ్వత ఇంటి పట్టా అందజేశారు. మధ్యాహ్నం నీరుకొండ గ్రామానికి చెందిన 99 కుటుంబాలు, మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన 199 మంది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. శుక్రవారం మొత్తం 546 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మనల్నే మార్చివేస్తాయి. 2019 ఎన్నికల్లో నేనొక నిర్ణయం తీసుకున్నా. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందున నేనేంటో మీకు తెలియదు, మీరేంటో నేను తెలుసుకోలేకపోయా. నేనొచ్చిన 20 రోజులకే ఎన్నికలు ముగిశాయి. 5,300 ఓట్ల తేడాతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధకలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసిపెంచింది. కష్టపడి మంగళగిరి ప్రజల మనస్సు గెలుచుకోవాలని ఆనాడు నిర్ణయించుకున్నా. ఏ మెజార్టీతో ఓడిపోయానో దానిపక్కన సున్నా పెట్టుకుని గెలవాలనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మీకోసం పనిచేశానని మంత్రి లోకేష్‌ చెప్పారు.

మంగళగిరి ప్రజల కోసం 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరిలో దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఎన్టీఆర్‌ సంజీవని పేరుతో తాడేపల్లి, మంగళగిరిలో క్లినిక్‌తో పాటు దుగ్గిరాలలో మొబైల్‌ క్లినిక్‌ పెట్టి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాం. ఇప్పటికీ మందులు కూడా అందిస్తున్నాం. నీటి సమస్య ఉంటే వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాం. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ అందించాం. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. నిరుపేద కుటుంబాలు సొంత కాళ్లపై నిలబడాలనే ఆలోచనతో తోపుడు బండ్లు అందించాం. మహిళల ఆర్థిక స్వాతంత్య్రం కోసం కుట్టుమిషన్‌ శిక్షణ అందించడంతో పాటు వారికి కుట్టుమిషన్లు కూడా అందించాం. కోవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌, మందులు సరఫరా చేశాం. అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్‌ లైన్‌లో చికిత్స కూడా అందించాం. అవసరమైన మందులు ఇచ్చాం. ఈ విధంగా మంగళగిరి ప్రజల కోసం సొంత ఖర్చుతో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశామని మంత్రి లోకేష్‌ వివరించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు.

అందరికీ దిమ్మతిరిగే విధంగా గెలిపించారు
2024లో జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మతిరిగే విధంగా 91వేల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. 2024 ఎన్నికల ముందు రచ్చబండ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలను కలిశాను. అక్కడ పార్టీ జెండాలు, బ్యాక్‌ డ్రాప్‌లు లేవు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. రెండున్నర దశాబ్దాల కల అయిన శాశ్వత ఇంటి పట్టాలు అందించాలని ఆనాడు ప్రజలు నన్ను కోరారు. మూడు విడతలుగా ఇంటి పట్టాలు అందిస్తామని చెప్పా. సులభంగా చేసే వాటిని ప్రభుత్వ నిర్ణయం మేరకు మొదటి విడతగా అందిస్తాం. ఎండోమెంట్‌ భూములు, రైల్వే భూముల విషయంలో కొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని కాలువ, అటవీ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వడం. అందరితో చర్చించేందుకు రెండు, మూడేళ్ల సమయం పడుతుందని, కానీ నేను చేసి తీరతానని ఆనాడు హామీ ఇచ్చానని మంత్రి లోకేష్‌ గుర్తు చేశారు.

రెండున్నర దశాబ్దాల కల నెరవేర్చాం
ప్రజాప్రభుత్వం ఏర్పడి 10 నెలలైంది. పది నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్‌ చేశాం. ఇంటి కొలతలు తీశాం. అధికారులు, అన్ని పార్టీల నాయకులు వచ్చారు. కొలతలు తీసి వివరాలు కనుక్కున్నారు. తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనేకసార్లు చర్చించి, ఏకంగా కేబినెట్‌కు తీసుకెళ్లి, కేబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందరూ ఒక్కసారి గుండెపై చేయిపెట్టి ఆలోచించాలి. గత రెండున్నర దశాబ్దాల కల ఇది. అనేక మంది నాయకులను మీరు కలిశారు. జిరాక్స్‌ ప్రింటింగ్‌లకే ఎక్కువ ఖర్చు అయింది. అలాంటిది మేం కష్టపడి, మీ దగ్గర బాటిల్‌ నీళ్లు కూడా తాగకుండా, మీ కోసం కష్టపడి, అవినీతికి తావులేకుండా ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. మొదటి విడతలో మార్కెట్‌లో రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కు కూటమి ప్రభుత్వం పేదలకు కల్పిస్తోందని మంత్రి లోకేష్‌ చెప్పారు.
అహర్నిశలు మీ గురించే ఆలోచన
నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడే చెప్పా. వంద పడకల ఆసుపత్రి కోసం కేబినెట్‌లో అడిగితే ఎవరూ కాదనలేకపోయారు. దానికి కారణం..మీరు నాకిచ్చిన మెజార్టీ. దేవాలయ అభివృద్ధికి నిధులు అడిగితే కాదనలేకపోయారు. భూగర్భ డ్రైనేజీ, భూగర్భ గ్యాస్‌, భూగర్భ వాటర్‌.. చివరకు భూగర్భ కరెంట్‌ కూడా మంగళగిరిలో వచ్చే రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తాం. దీనికి కారణం మీరు నాకిచ్చిన మెజార్టీ. మీరు నాపైనా భరోసాతో గెలిపించారు. నాపై బాధ్యత పెట్టారు. అహర్నిశలు మీ గురించే ఆలోచిస్తున్నా. మీ తరపున పనిచేస్తున్నా. చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి లోకేష్‌ అన్నారు.

ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తాం
ఓ వైపు సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలతో పాటు మంగళగిరిలో పార్క్‌లు, చెరువుల అభివృద్ధితో పాటు కల్యాణ మండపాలు, జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ పార్క్‌, హ్యాండ్‌ లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటుచేసి నేనిచ్చిన హామీలు నిలబెట్టుకుంటా. వంద పడకల ఆసుపత్రికి ఈ నెల 13న శంకుస్థాపన చేసి ఏడాదిలో 2026, ఏప్రిల్‌ 13న ప్రారంభిస్తాం. కూటమి ప్రభుత్వంలో మేం అందరం మీ కోసం వచ్చాం, మీకు సేవ చేసేందుకు వచ్చాం, మీ కోసం పోరాడేందుకు వచ్చాం. అహర్నిశలు మీ కోసం కష్టపడతాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చారు.

కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చెప్పా
ఎన్నికలప్పుడు అందరం సర్వేలు చేస్తాం. సర్వేలో కుప్పం కంటే మంగళగిరి వెనుకబడి ఉంది. ఎంతపని చేశావు.. మంగళగిరి వెనుకబడి ఉందని చంద్రబాబు చెప్పారు. కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చెప్పా. అప్పుడు ఎగతాళి చేశారు. కుటుంబ సభ్యులం అందరం ఉన్నాం. మీరెప్పుడైతే మెజార్టీ చూపించారో, చంద్రబాబు డిసైడ్‌ అయిపోయి కష్టపడ్డారని ప్రశంసించారు. మీ దగ్గర నుంచి మిగతా నియోజకవర్గాలు నేర్చుకోవాలని చెప్పారు. దానికి కారణం మీరు నాపై చూపించిన ప్రేమ, అభిమానం. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని ఆనాడే చెప్పానని మంత్రి లోకేష్‌ తెలిపారు.

Previous Post

ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరం

Next Post

ఎప్పటికీ మీరే మంగళగిరికి మారాజు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

కార్యకర్త
@ August 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist