చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

వాళ్లకు.. ‘డేటా’పై దృష్టే లేదు!

మండలిలో బొత్స వ్యాఖ్యలకు మంత్రి లోకేష్‌ ఫైర్‌ కౌంటర్‌

by చైతన్యరధం
March 20, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
విద్యా శాఖ భారం కాదు, బాధ్యత
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఎంతమంది విద్యార్థులు ఏ స్కూల్లో చదువుతున్నారో లెక్కలు లేవు
  • దౌర్భాగ్య పరిస్థితికి.. ఆనాటి విద్యా మంత్రి బొత్స సమాధానం చెప్పాలి
  • సర్కారీ బడులకు దూరమైన 12 లక్షలమంది విద్యార్థులపై చర్చకు సిద్ధం
  • హౌస్‌ అజెండా బీఏసీ నిర్ణయిస్తుంది, వైసీపీ కాదు..
  • మండలిలో బొత్స వ్యాఖ్యలకు మంత్రి లోకేష్‌ ఫైర్‌ కౌంటర్‌

అమరావతి (చైతన్య రథం): వైసీపీ హయాంలో ఎంతమంది విద్యార్థులు ఏ స్కూలులో చదువుతున్నారో డేటా లేదని, ఆ పరిస్థితికి ఆనాడు విద్యా మంత్రిగా పనిచేసిన బొత్స సమాధానం చెప్పాలని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్‌లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారనే అంశంపై మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. విద్యారంగంపై సభలో చర్చ జరిగినప్పుడు వైసీపీ సభ్యులు పారిపోయారు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. హౌస్‌ అజెండా బీఏసీ నిర్ణయిస్తుంది. విద్యలో సంస్కరణలపై చర్చ జరగాలని వైసీపీనే కోరింది. మేం సన్నద్ధమై సభకు వచ్చాం. హౌస్‌ ఛైర్మన్‌ ఆదేశాల ప్రకారం నడుస్తుంది. ప్రతిపక్ష పార్టీ చెప్పినట్లు నడవదు. తమకు కావాల్సినప్పుడు చర్చ పెట్టాలని, ఈ రోజు మూడ్‌ బాగాలేదు, మేం బయటకు వెళ్లాలని, వేరే పనులున్నాయని, పార్టీ మీటింగ్‌లు ఉన్నాయని వాయిదా వేయాలనుకుంటే అందుకు ప్రభుత్వం, ఛైర్మన్‌ సిద్ధంగా లేరని మండిపడ్డారు. బొత్స సీనియర్‌ నాయకులని, మంత్రిగా పనిచేశారని, ఆలోచించి మాట్లాడాలని అన్నారు. విద్యారంగంపై సభలో విపులంగా చర్చించడం జరిగింది. నోట్‌ కూడా ఇచ్చాం. అది చదవాలని వైసీపీ సభ్యులకు సూచించారు.

సర్కారీ స్కూళ్ల డ్రాపవుట్స్‌పై చర్చకు రెడీ
ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్‌ విద్యలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారనే వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా. బొత్స మంత్రిగా ఉన్నప్పుడు పాఠశాల విద్యలో ఎంతమంది విద్యార్థులు చదివారో లెక్కలు చెప్పాలని సవాల్‌ చేశారు. దీనిపై చర్చకు సిద్ధం. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్లారు, ఏ ప్రైవేటు పాఠశాలలో సంఖ్య పెరిగిందో మేం చెబుతాం. వైసీపీ హయాంలో డ్రాప్‌ బాక్స్‌ విధానం తీసుకువచ్చారు. గ్రాస్‌ ఎన్‌ రోల్‌ మెంట్‌ రేషియో పెంచేందుకు విద్యార్థులను డ్రాప్‌ బాక్స్‌ లో పెట్టారు. 17 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న విద్యార్థులు లక్ష మంది పాఠశాల విద్యలో ఉన్నారు. ఆ వివరాలన్నీ ఇవ్వగలం. టోఫెల్‌ గురించి మాట్లాడుతున్నారు. నేషనల్‌ అచీవ్‌ మెంట్‌ సర్వే చూస్తే.. 2017లో ఇంగ్లీష్‌ లో భారతదేశంలో నాలుగో స్థానంలో ఉన్నాం. వైసీపీ హయాంలో 14 స్థానానికి ఎందుకు పడిపోయామో సమాధానం చెప్పాలి. పదో తరగతి సోషల్‌ సైన్స్‌ లో 6వ స్థానం నుంచి 24వ స్థానానికి ఎలా పడిపోయామో చెప్పాలి. సైన్స్‌ విషయానికి వస్తే మొదటిస్థానం నుంచి 15వ స్థానానికి పడిపోయాం. గణితంలో మొదటిస్థానం నుంచి 12వ స్థానానికి ఎలా పడిపోయామో చెప్పాలి.

‘ఐబీ’ని అమలు చేసిన పాఠశాలలేవీ?
ఐబీ విషయానికి వస్తే కేవలం ఒక కన్సల్టింగ్‌ రిపోర్ట్‌ కోసం రూ.4.86 కోట్లు ఖర్చు పెట్టారు. ఐబీ కరిక్యులమ్‌ అమలు చేశామని ఎలా చెబుతారు? ఏ పాఠశాలలో అమలు చేశారు ఐబీ? సమాధానం చెప్పాలి. సీబీఎస్‌ఈ విషయంలో విద్యార్థులను సన్నద్ధం చేయలేదు. మాక్‌ టెస్ట్‌ నిర్వహిస్తే కనీసం ఒక సబ్జెక్ట్‌ లో 90శాతం మంది ఫెయిల్‌ అయ్యారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా, పిల్లలను సన్నద్ధం చేయకుండా సీబీఎస్‌ఈ తీసుకువచ్చారు. ఇప్పుడు పరీక్షలకు అనుమతిస్తే.. వారు ఫెయిల్‌ అయితే సోషల్‌ ఇష్యూస్‌ వస్తాయి. చిన్న వయసులోనే పెళ్లిచేస్తారు. సీబీఎస్‌ఈ విధానాన్ని మేం ఉపసంహరించలేదు, వాయిదా వేశాం. టోఫెల్‌ కు రూ.60 కోట్లు ఖర్చుపెట్టారు. ఎందుకు ఇంగ్లీష్‌ పడిపోయిందో సమాధానం చెప్పాలి. ఆ రోజు నేను సుదీర్ఘంగా చర్చించాం. అప్పుడు చర్చలో పాల్గొనకుండా ఈ రోజు వచ్చి మాట్లాడటం సరికాదు. హౌస్‌ రూల్స్‌ బొత్స గారికి తెలుసు. ఏ అంశంపైనైనా చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం.

కనీసం ఎంతమంది పిల్లలు, ఏ స్కూల్‌ లో చదువుతున్నారో డేటా లేకుండా వైసీపీ చేసింది. రెండేళ్లు మంత్రిగా పనిచేసిన బొత్స.. డేటా ఎందుకు లేదో సమాధానం చెప్పాలి. ఏ టీచర్‌ ఏ స్కూల్‌ లో పాఠాలు చెబుతున్నారో డేటా లేదు. సమాధానం చెప్పాలి. ఏ డేటా లేక బేసిక్‌ డ్యాష్‌ బోర్డ్‌ తయారు చేయలేకపోతున్నాం. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిప్పుడు 6నెలల్లో డ్యాష్‌ బోర్డు రూపొందించాం. గ్రిప్‌ వచ్చింది. విద్యారంగంలో ఇప్పుడిప్పుడే డ్యాష్‌ బోర్డ్‌ తయారవుతోంది.
విద్యార్థులను సభలకు వాడుకునే కుసంస్కారం మాకు లేదు
నూటికి నూరు శాతం ఉపాధ్యాయులు పాఠాలే చెప్పాలనే విధానానికి కట్టుబడి ఉన్నాం. యాప్‌ ల భారం తగ్గిస్తున్నాం. సింగిల్‌ యాప్‌ తీసుకువస్తున్నాం. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. పిల్లలను రాజకీయ కార్యక్రమాలకు పంపడం లేదు. గత వైసీపీ పాలనలో మాదిరిగా సీఎం కార్యక్రమానికి పిల్లలను తీసుకెళ్లి దారిపొడవునా నిల్చోబెట్టడం లేదు. పిల్లలు స్కూల్‌ లో ఉండాలి. వారు ప్రయోజకులుగా మారాలనేదే మా లక్ష్యం. మేం పరదాలు కట్టుకుని తిరగడం లేదు. ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. పాజిటివ్‌ వాతావరణం తీసుకువస్తున్నాం. ఉపాధ్యాయులు సహకరిస్తున్నారు కాబట్టే విద్యారంగంలో సంస్కరణలు తీసుకురాగలుగుతున్నాం.

ప్రమాణాల పెంపును ఛాలెంజ్‌గా తీసుకున్నాం
సింగిల్‌ టీచర్స్‌ స్కూల్స్‌ విషయానికి వస్తే 12,512 పాఠశాలల్లో సింగిల్‌ టీచర్‌ ఉన్నారు. ఇది వాస్తవం. 30శాతం పాఠశాలల్లో సింగిల్‌ టీచర్‌ ఉన్నారు. అందుకే మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల కింద కనీసం 7,8 వేల ప్రైమరీ స్కూల్స్‌ వస్తే ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడిని అందించే అవకాశం ఏర్పడుతుంది. అందరం కలిసికట్టుగా చేస్తున్నాం. దీనివల్ల లెర్నింగ్‌ అవుట్‌ కమ్స్‌ మెరుగుపడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో సీటుకు రికమెండ్‌ చేయాలని ఎప్పుడైతే ప్రజాప్రతినిధులను తల్లిదండ్రులు అడుగుతారో అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెరిగాయనే నమ్మకం ఏర్పడుతుంది. దీనిని ఛాలెంజ్‌ గా తీసుకున్నామని, ఇందుకు రెండేళ్ల సమయం ఇవ్వాలని, కచ్చితంగా చేసి చూపిస్తామని మంత్రి చెప్పారు.

అంతముందు బొత్స వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ స్పందిస్తూ.. సభలో ఎప్పుడు ఏ చర్చ జరగాలనేది ఛైర్మన్‌ నిర్ణయిస్తారని, విద్యారంగంపై జరిగిన చర్చలో పాల్గొనకుండా ప్రశ్నోత్తరాల సమయంలో విద్యారంగంపై చర్చకు పట్టుబట్టడం, తాము చెప్పిందే జరగాలనే ఆలోచన సరికాదని, ఛైర్మన్‌ నిర్ణయాన్ని తప్పుబట్టేవిధంగా వ్యవహరించిన బొత్స క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Previous Post

వైసీపీవల్లే చదువుకు చేటు

Next Post

ప్రయివేట్‌ రంగంలో వర్శిటీలకు ప్రోత్సాహం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

November 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-11-2026

November 25, 2026
లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

November 25, 2026
ఏపీలో భారీ రైల్వే ప్రాజెక్టుకు టెండర్ల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్

ఏపీలో భారీ రైల్వే ప్రాజెక్టుకు టెండర్ల ఆహ్వానం

November 25, 2026
అమరావతి రీజియన్ అభివృద్ధిపై ముందడుగు
ఆంధ్రప్రదేశ్

అమరావతి రీజియన్ అభివృద్ధిపై ముందడుగు

November 25, 2026
ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు డెడ్‌లైన్
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు డెడ్‌లైన్

November 25, 2026
Next Post
విద్యా శాఖ భారం కాదు, బాధ్యత

ప్రయివేట్‌ రంగంలో వర్శిటీలకు ప్రోత్సాహం

ముఖ్య వార్తలు

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

by చైతన్యరధం
November 25, 2026

సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...

ఐక్యతే మన బలం…

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

by చైతన్యరధం
November 23, 2026

పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

by చైతన్యరధం
November 22, 2026

తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

by చైతన్యరధం
November 22, 2026

కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

by చైతన్యరధం
November 25, 2026

సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

by కార్యకర్త
November 26, 2026

చైతన్యరధం ఈ పేపర్ 25-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 25-11-2026

by కార్యకర్త
November 25, 2026

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

by చైతన్యరధం
November 25, 2026

సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...

ఏపీలో భారీ రైల్వే ప్రాజెక్టుకు టెండర్ల ఆహ్వానం

ఏపీలో భారీ రైల్వే ప్రాజెక్టుకు టెండర్ల ఆహ్వానం

by చైతన్యరధం
November 25, 2026

బిక్కవోలు-దువ్వాడ మధ్య 3, 4 బ్రాడ్ లైన్లు 45 మాసాల్లో పూర్తి చేయడమే లక్ష్యం అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో మరో భారీ రైల్వే ప్రాజెక్టు కు దక్షిణ కోస్తా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.