- శిరోముండనం కేసులో శిక్ష పడిన..
- తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి బహిష్కరించాలి
- జగన్ పాలనలో దళితులపై పెరిగిన దాడులు
- దళితుల హత్యలన్నీ జగన్ సర్కార్ హత్యలే
- ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది
అమరావతి (చైతన్యరథం): జగన్ పాలనలో దళితులపై దాడులు పెరిగిగాయని.. రాష్ట్రంలో జరిగిన హత్యలన్నీ సర్కార్ హత్యలే అని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. దళితులపై ఏమాత్రం గౌరవం ఉన్నా.. శిరోముండనం కేసులో 18 నెలలు శిక్ష పడిన తోట త్రిమూర్తులను జగన్ రెడ్డి వెంటనే బహిష్కరించాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్రిమూర్తులు లాంటి నాయకులకు టికెట్ ఇస్తే దళితుల మాన ప్రాణాలకు రక్షణ ఉండదన్నారు. అంబేద్కర్ రాజ్యంగంపై జగన్ కు ఏమాత్రం గౌరవం ఉన్నా తోట త్రిమూర్తులను వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో 185 మంది దళితులపై హత్యలు, అత్యాచారాలు జరిగాయి. బీహార్ కంటే దారుణంగా రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగాయి. పోలీస్ స్టేషన్ లోనే దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేయడం దేశంలోనే సంచలనాత్మకమైన విషయం. 18 నెలలు జైలు శిక్ష పడిన తోట త్రిమూర్తులను పార్టీలో కొనసాగిస్తే శిరోముండనాన్ని జగనే ప్రోత్సహిస్తున్నట్లు అవుతుంది. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్‌ను నడి రోడ్డుపై బట్టలు లేకుండా తిప్పారు. డాక్టర్ అనితను వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టినా చర్యలు తీసుకోలేదు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోర్ డెలివరీ చేసిన అనంత బాబుకు జగన్ లైసెన్స్ ఇచ్చాడు. డాక్టర్ అచ్చెన్న హత్య, నెల్లూరు నారాయణ ఆత్మహత్య, కావలి కరుణాకర్ ఆత్మహత్య, దోమతోట విక్రమ్ హత్య వీటన్నింటిని జగన్ సర్కార్ చేసిన హత్యలు గానే భావించాలి. దళితుల హత్యలన్నీ జగన్ ప్రభుత్వ హత్యలే ఇలాటి రాక్షస పాలనలో దళితులకు రక్షణ లేదని జవహర్ అన్నారు.
జగన్‌కు రాజ్యంగం పై గౌరవం లేదు…
కడప జిల్లాలో దళిత మహిళ నాగమ్మ హత్య ను ఖండిరచడానికి వెళితే టీడీపీ నాయకులు అనిత, ఎమ్‌ఎస్ రాజుపై అట్రాసిటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. అంబేద్కర్ రాజ్యంగంపై జగన్ కు అసలు గౌరవం లేదు. అంబేద్కర్ విదేశీ విద్యను జగన్ విదేశీ విద్యగా మార్చాడు. జగన్ సంక్షేమాన్ని మరచి హత్యలను ప్రోత్సహించాడు. పేరుకు మాదిగ, మాల, రెల్లి, కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దళితుల పిల్లల అందాల్సిన లబ్ధిని అందకుండా చేశాడు. దళితులకు జగన్ కంస మామ. లిడ్ క్యాప్ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించి అన్యాయం చేశాడు. దళితుల ఎదుగుదలను అడ్డుకుని.. దళితులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడని జవహర్ మండిపడ్డారు.
దళితులను అణచివేయడమే జగన్ లక్ష్యం…
జగన్ రెడ్డిని నమ్మి దళితులు మోసపోవద్దు. జగన్ లక్ష్యం దళితులను అణిచివేయమే. శిరోముండనం కేసులో శిక్ష పడిన త్రిమూర్తులును బహిష్కరిస్తే తప్పా జగన్ ను నమ్మే పరిస్థితి లేదు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దళితులపై అధిక దాడులు జరిగాయి. దళితులపై దాడులు చేయడానికే త్రిమూర్తులు లాంటి వ్యక్తులను పార్టీలో ఉంచారు. జగన్ అనే వ్యక్తి దళిత వ్యతిరేకి. మలుపు పథకం పోయింది. ముందడుగు పథకం పోయింది. ఇలాంటి అనేక పథకాలు రద్దు చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి దళితులకు జగన్ తీవ్ర అన్యాయం చేశాడు. దళితుల విశ్వసనీయతను జగన్ కోల్పోయాడు.. దళితులకు తీవ్ర అన్యాయం చేసిన జగన్‌కు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఆ వర్గాలు బుద్ధి చెబుతాయని జవహర్ స్పష్టం చేశారు.