- ఎడతెరపిలేని వర్షాలపై సీఎం నిరంతర సమీక్ష
- సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు
- రౌండ్ ద క్లాక్ వివరాలు తెలుసుకున్న చంద్రబాబు
- నష్ట నివారణపై దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశాలు
- వివిధ ఘటనల్లో భారీ వర్షాలకు 8 మంది దుర్మరణం
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం
- ఉత్తరాంధ్ర కలెక్టర్లకు సన్నద్ధతపై ప్రత్యేక ఆదేశాలు
- హుద్‌హుద్ నివారణ చర్యలు గుర్తుచేసిన సీఎం
- ప్రభావిత జిల్లాలకు తక్షణ సాయానికి నిధుల విడుదల
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో భారీవర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షించారు. ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని ఎడతె రపిలేని వర్షాలపై నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. రాష్ట్రంలో మరో మూడురోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని, కిందిస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పు డు పరిశీలించాలని సూచించారు.
తెగిపడిన విద్యుత్ తీగలపై స్పందించాలి
పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీస్థాయిలో నీరు చేరి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందని, పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల న్నారు. ప్రజలకు తగు సూచనలు చేస్తూ అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండా లని ఆదేశించారు. మ్యాన్ హోల్స్ దగ్గర, విద్యుత్ తీగలు తెగిపడి ప్రమాదాల జరగకుండా చూడాలని, ఫిర్యాదు వచ్చిన వెంటనే అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు.
వాగుల దగ్గర రాకపోకలు నిలిపివేయాలి
పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజల ను, వాహనాలను అనుమతించరాదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న వంతెనలపై రాకపోకలు నిలిపివేయాలని సూచించారు. ఈ విషయంలో కఠినంగా ఉండాలని తెలిపారు. భారీవర్షా లు ఉన్న ప్రాంతాల ప్రజలకు సెల్‌ఫోన్ మెసేజ్ ద్వారా అలెర్ట్ పంపాలని సూచించారు.
అవసరమైతే డ్రోన్లను వినియోగించండి
వాట్సాప్ గ్రూపుల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకుని సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుంది. క్రైసిస్ మేనేజ్‌మెంట్ విషయంలో డ్రోన్ల వంటి టెక్నాలజీని విరివిగా వాడాలి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలని సూచించారు.
సహాయక చర్యలకు జిల్లాకు రూ.3 కోట్లు
సహాయ చర్యలకు ఎక్కువ ప్రభావమున్న జిల్లాకు రూ.3 కోట్లు, కాస్త తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలకు రూ.2 కోట్లు చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోయినట్లు వివరించగా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. వర్షాలు తగ్గే వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు తక్షణ చర్యలకు దిగాల్సిన అవసరం ఉంది. పొక్లెయినర్లు పెట్టి నీటి ప్రవాహా లకు ఉన్న అడ్డంకు లను తొలగించి నీరు బయటకు వెళ్లేలా చూడాలని, ఓపెన్ డ్రైన్స్‌లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అలాంటి ప్రాంతాలలో హెచ్చరికలు జారీ చేసి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తీరం వెంబడి గ్రామాలపై కలెక్టర్లకు ఆదేశాలు
శ్రీకాకుళం నుంచి విశాఖ మధ్య శనివారం అర్థరాత్రి తుఫాన్ తీరం దాటుతుందని, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయా లని కలెక్టర్లను ఆదేశించారు. రాత్రి అంతా మేలుకుని అయినా సరే ప్రజల రక్షణ కోసం పనిచేద్దామని తెలిపారు. తుఫాను తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వివరించగా గాలుల వేగంపై స్పష్టమైన అంచనాలతో సన్న ద్ధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. సైక్లోన్ షెల్టర్లను సిద్ధం చేసి పునరా వాసం కోసం ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
దుర్గ గుడిలో ప్రమాదం విచారకరం
బుడమేరులో నీటి ఉధృతి తీవ్రంగా ఉందని, బుడమేరు ఆక్రమణ వల్ల వరద సమయంలో సమస్యలు వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులు వివరించారు. సమస్య పరి ష్కారానికి అవసరమైన ప్రణాళికతో రావాలని సీఎం సూచించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి పంట కాలువలకు నీటి విడుదల నిలిపివేసినట్లు అధికారులు వివరించారు. విజయవాడ నగరంలో రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిం చారు. కనకదుర్గమ్మ గుడిలో ప్రమాదం విచారకరమని, అవవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొండ ప్రాంతాల్లో ఉన్న వారిని అవసరమై ఖాళీ చేయించాలని సూచించారు. గర్భిణుల వివరాలు సేకరించి…అవసరమైన సాయం అందిం చేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ముగ్గురి మృతిపై ఆరా…సెలవు ఇవ్వలేదా అని ప్రశ్న
పెదకాకాని ఉప్పలపాడు వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతిచెందిన ఘటనపై అధికారులను వివరణ కోరారు. పాఠశాలకు సెలవు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. మధ్యా హ్నం తరువాత సెలవు ప్రకటించి విద్యార్థులను పంపామని చెప్పారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని, ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని తెలిపారు. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ముందురోజే సెలవుపై ప్రకటన చేయాలన్నారు. ప్రమాదం జరిగిన తరువాత ప్రభుత్వం సహాయం చేయ డం కాదు….ప్రమాదం జరగకుండా చూడాలని సూచించారు.
హుద్‌హుద్ చర్యలను ఆనుసరించాలి
భారీ వర్షాలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. అధికారులు కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం తెప్పించుకుని వేగంగా స్పందించాలి. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటన జరిగినా సహించేది లేదు. విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. హుద్ హుద్ తుఫాన్ సమయంలో అనుసరించిన విధానాలను కలెక్టర్లు స్టడీ చేయాలని, నాడు తీసుకున్న ముందస్తు చర్యల ద్వారా ప్రాణనష్టం లేకుండా చేశామని వివరించారు. ఆ విధానాలను అనుసరించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
కలుషిత ఆహారం ఘటనలపై విచారణ చేపట్టాలి
వర్షాలు, వరదల కారణంగా తాగునీరు, ఆహారం కలుషితమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అల్లూరి జిల్లాలో కలుషిత ఆహారం ఘటన జరిగింది. వీటిపై అధికారులు సీరియస్ గా దృష్టిపెట్టాలి. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించేలా చర్యలు చేపట్టాలని సూ చించారు. కలుషిత ఆహారం ఘటనలకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయా లని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో జ్వరాల బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీటి నిల్వలను నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలకు ఆదేశాలు ఇచ్చాం. ప్రాజెక్టుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం..అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.