చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

యుద్ధంలో గెలిచాం.. తరువాత!?

సమూలంగా.. డ్రెయినేజీ వ్యవస్థ ప్రక్షాళన

by చైతన్యరధం
September 16, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మహానగరానికి రక్షణ కవచంపైనే దృష్టి
  • సురక్షిత స్థాయికి రాజధాని అమరావతి
  • ప్రకాశం బ్యారేజీ డిశ్చార్జి సామర్థ్యం పెంపు
  • బుడమేరు ప్రవాహాన్ని సులువు చేయడం..
  • సమూలంగా.. డ్రెయినేజీ వ్యవస్థ ప్రక్షాళన

అమరావతి (చైతన్య రథం): అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదలకు చిగురుటాకులా వణికిపోయిన విజయవాడ నగరం నెమ్మదిగా తేరుకుంటోంది. యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టిన వరద నివారణ చర్యలు, బాధితులకు సహాయక చర్యలతో.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతోంది. క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌లో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ‘ఆపరేషన్‌ ఫ్లడ్‌’ అద్భుత ఫలితాలు ఇచ్చిందనడానికి.. తేరుకున్న నగరమే నిదర్శనం. ఇక వరద మిగిల్చిన అపార నష్టాన్ని అధిగమించడానికీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వప్రయత్నమే చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితిని కేంద్రానికి నివేదించి.. తగు సాయం అందుకోవడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తోన్న గట్టి ప్రయత్నాన్ని చిన్నది చేసి చూడలేం. మరోపక్క `బుడమేరు విలయాన్ని కళ్లారా చూసిన.. చంద్రబాబు పిలుపును అందుకున్న దాతలూ.. సహాయ నిధికి శక్తిమేర విరాళాలు అందిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కాని, భారీ వరద విజయవాడ మహానగరం ముందు ఒక ప్రశ్నను వదిలివెళ్లింది.

భవిష్యత్‌లో మరోసారి కనుక విరుచుకుపడితే.. నగరం పరిస్థితి ఏమిటి? ఇదే చర్చనీయాంశమవుతున్న అంశం. విపత్తు ఏ క్షణాన విరుచుకుపడుతుందో అంచనా వేయడం అంత సులువేమీ కాదు. లిప్తకాలంలో సంభవించే ప్రమాదాన్ని నివారించేందుకు అప్పటికప్పుడు చేయగలిగేదీ ఏమీ ఉండదు. వరద బాధితులను పరామర్శించి.. ప్రభుత్వ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించిన అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాపదేశంగా ప్రస్తావించిన అంశం ఇదే. ప్రకృతినుంచైనా.. మానవ తప్పిద ప్రమాదమైనా.. వచ్చిన వరద లోపాల్ని ఎత్తి చూపి కళ్లు తెరిచేలా చేసిందన్నది నిజం. దశాబ్దాలుగా పెను నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని బుడమేరు విలయం నొక్కిచెప్పింది. భవిష్యత్తులో ఇంతకుమించిన జల ప్రళయాలొచ్చినా.. ఎదుర్కోవడానికి ఎంత సన్నద్ధంగా ఉండాలో చాటిచెప్పింది.

మారుతున్న కాలంలో.. మహానగరాలు వరద ముప్పు, ముంపులను ఎదుర్కొంటోన్న ఘట్టాలు కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు ముంబయి, గుజరాత్‌, హైదరాబాద్‌లాంటి నగరాలు ఎలా విలవిల్లాడాయో చరిత్ర పుటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు `బెజవాడ వరదతో స్వయంగా అనుభవించాం. కృష్ణా నదికి ఒక ఒడ్డునున్న విజయవాడ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. మరోఒడ్డున రాజధాని అమరావతి నగర నిర్మాణం వేగంగా జరగబోతోంది. ఈ రెండు నగరాలకు ముంపు సమస్య తలెత్తకుండా పటిష్ఠమైన రక్షణ కవచం అవసరమన్నదే ప్రస్తుత ప్రాధాన్యతాంశం. సాధారణానికి కాస్త ఎక్కువ వాన కురిస్తేనే విజయవాడలోని వీధులన్నీ కాల్వలవుతున్నాయి. బుడమేరు ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుంది. కృష్ణా నదికి భవిష్యత్తులో భారీ వరదలు పోటెత్తవన్న గ్యారెంటీ లేదు! వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. భారీ ఆర్థిక ప్రణాళికే అయినా.. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావించి చేపట్టాని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనో, ప్రపంచబ్యాంకు వంటి సంస్థల రుణ సహకారంతో మహానగరానికి రక్షణ కవచాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని బలంగా ప్రస్తావిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత నీటి ప్రవాహ సామర్థ్యం 11.9 లక్షల క్యూసెక్కులు. 2009 అక్టోబరు 5న ప్రవహించిన 10.94 లక్షల క్యూసెక్కుల నీరే ఇప్పటి వరకూ రికార్డు. అయితే, సెప్టెంబరు 2న బ్యారేజీనుంచి రికార్డుస్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. నాలుగు గంటలపాటు నిరంతరంగా సాగిన ప్రవాహం.. ఒక దశలో 12 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశముందన్న హెచ్చరికలూ జారీ అయ్యాయి. విజయవాడలోని కృష్ణలంకవంటి లోతట్టు ప్రాంతాల్ని వరద ముంచెత్తింది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు మధ్యలో మున్నేరు, కట్టలేరు, వైరా, పాలేరు, కీసర, బుడమేరు వంటి వాగులు వచ్చి కృష్ణాలో కలుస్తాయి. భవిష్యత్‌లో క్యాచ్మెంట్‌ ఏరియాలో భారీ వర్షాలు పడితే వాగులు పొంగి.. ప్రకాశం బ్యారేజీకి ఇప్పటికంటే ఎక్కువ వరద పోటెత్తే ప్రమాదం లేకపోలేదు. ఈ అంచనాల నేపథ్యంలో.. ప్రకాశం బ్యారేజీ డిశ్చార్జ్‌ సామర్ధ్యాన్ని కనీసం 15 లక్షల క్యూసెక్కులకు పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు.

వరద నష్టాల అంచనాకు వచ్చిన కేంద్ర బృందానికి సైతం.. ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని విస్పష్టంగా వివరించడం ఇక్కడ ప్రస్తావనార్హం. బ్యారేజ్‌ డిశ్చార్జ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తగిన ఆర్థిక సాయం కేంద్రం నుంచి తీసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణా నది పొడవు 80కి.మీ.లకు పైగాఉంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23వ కి.మీ. వద్ద వైకుంఠపురంలో 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించొచ్చు. అది ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తకుండా అడ్డుకోవడంతోపాటు, అక్కడ నిల్వ చేసే నీరు ఈ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. బ్యారేజీకి దిగువన 16 కి.మీ.ల వద్ద చోడవరం సమీపంలో 1.70 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి, 67 కి.మీ.ల దిగువన బండి కొల్లంక వద్ద 4.70 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించుకునే అవకాశముంది. భవిష్యత్‌లో రాజధాని అమరావతికి ముంపు ప్రమాదం లేకున్నా.. కృష్ణా కరకట్టలను బలోపేతం చేయాల్సి ఉంది. భవిష్యత్‌లో వరద ఉధృతి పెరిగినా.. రాజధాని నగర వాసులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా ఉండాలంటే.. కరకట్టలు బలహీనపడిన ప్రాంతాలను గుర్తించి బలోపేతం చేయక తప్పదు. ప్రకాశం బ్యారేజీ వద్ద 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా.. రాజధానిలోకి చుక్క నీరు ప్రవేశించకుండా రాజధాని పొడవునా పటిష్టమైన కాంక్రీట్‌ కట్టడం నిర్మించడం మరింత ఉపయుక్తం.

కొండవీటివాగుకు మెరుపులా వచ్చే వరదల నుంచి ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు సీడబ్ల్యూసీ అబ్జర్వేటరీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. బుడమేరు వాగు పుట్టుకు ప్రదేశం నుంచి కొల్లేరులో కలిసే వరకు అవసరమైన మేరకు వెడల్పు చేయడం, వాగులో పూడిక, ప్రవాహ మార్గంలోని అనధికారిక కట్టడాలు, ఆక్రమణల తొలగింపు.. ఇవన్నీ ప్రభుత్వం ముందున్న సవాళ్లే. అంతకంటేముందు, వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద బుడమేరు డిశ్చార్జి సామర్ధ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచడం, బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచడం, గత ప్రభుత్వం నిలిపివేసిన బుడమేరు విస్తరణ పనుల్ని తక్షణం పూర్తి చేయడంలాంటి చర్యలతో భవిష్యత్‌ ముప్పునుంచి మహానగరాన్ని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది.

Previous Post

అబద్ధాల కుప్పిగంతులు!

Next Post

బాధితులను పట్టించుకోకపోగా ప్రభుత్వంపై విమర్శలా?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

November 6, 2026
ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు
ఆంధ్రప్రదేశ్

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు

November 6, 2026
కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం
ఆంధ్రప్రదేశ్

కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం

November 6, 2026
‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం
ఆంధ్రప్రదేశ్

‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం

November 6, 2026
‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు
ఆంధ్రప్రదేశ్

‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు

November 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

November 5, 2026
Next Post
బాధితులను పట్టించుకోకపోగా ప్రభుత్వంపై విమర్శలా?

బాధితులను పట్టించుకోకపోగా ప్రభుత్వంపై విమర్శలా?

ముఖ్య వార్తలు

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

by కార్యకర్త
November 6, 2026

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు

ప్రజా తీర్పును గౌరవించడం జగన్ డీఎన్ఏలోనే లేదు

by చైతన్యరధం
November 6, 2026

విధ్వంసం, అసత్య ప్రచారం వైసీపీ నైజం ఓటు వేయని జగన్కు ఎన్నికలపై మాట్లాడే నైతిక హక్కు లేదు రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకంగా, ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు ప్రభుత్వంపై బురదజల్లేందుకు...

కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం

కడప, పులివెందుల్లో గొడవలకు జగన్ రెడ్డే కారణం

by చైతన్యరధం
November 6, 2026

అమరావతి (చైతన్యరథం): జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ అబద్ధాలు, అరాచకాలు, భయభ్రాంతుల ద్వారా ఓటర్లను మభ్యపెట్టి గెలవాలని ప్రయత్నిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక...

‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం

‘పరిషత్’ పోలింగ్ ప్రశాంతం

by చైతన్యరధం
November 6, 2026

ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు రాష్ట్రవ్యాప్తంగా 67.24 శాతం పోలింగ్ నమోదు స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సుల తరలింపు రేపు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.