- యాక్షన్ ఆపి ప్రజా సమస్యలపై దృష్టిపెట్టండి ఆర్కే
- అధికారం ఇచ్చింది ఇళ్లు కూల్చడానికా?
- ఉండవల్లి కొండపై యథేచ్ఛగా గ్రావెల్ దోపిడీ
- అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు 10వేల ఇళ్లు
- ఉండవల్లి బాదుడే బాదుడులో టిడిపి యువనేత నారా లోకేష్
మంగళగిరి : సార్.. సార్.. సార్… అంటూ కేసుల మాఫీకోసం ప్రధాన మంత్రిని వేడుకోవడం తప్ప ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రానికి సాధించిందేమీ లేదని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశా రు. తాడేపల్లి మండలం ఉండ వల్లిలో మంగళవారం బాదుడే బాదుడే కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడు తూ.. ఎన్నికల ముందు పెద్దపెద్ద మాటలు చెప్పిన జగన్ నేడు ప్రధానమంత్రి ముందు మ్యావ్ మ్యావ్ అంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడం మాని మా చిన్నాన్నని చంపాం. మాకు కేసులు ఉన్నాయి. మాఫీ చెయ్యం డని ప్రధానిని దేబిరిస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డికి పెద్దగా ఇంగ్లీష్ వస్తదని నేను అనుకోవటం లేదు, జగన్ రెడ్డి ఎక్కడ డిగ్రీ చేశాడో ఎవరికీ తెలియదు, అప్పట్లో టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వీరుడు జగన్ రెడ్డి అని తూర్పారబట్టారు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే ని రెండు సార్లు గెలిపిస్తే ఆయన అభివృద్ధిని గాలికొది లేసి ఇళ్లు కూల్చడంలో బిజీ అయ్యారని అన్నారు. భారీఎత్తున అవినీతికి పాల్పడుతూ చేలగట్లు వెంట తిరుగుతూ కుక్కలు, పశువులతో ఆడుతూ నిరాడం బర జీవితాన్ని గడుపుతున్నట్లుగా కమలాసన్ ను తలదన్నేలా నటిస్తున్నారని దుయ్యబట్టారు. ఉండవల్లి యస్సి కాలనీలో భారీఎత్తున అక్రమ క్వారీయింగ్ జరుగుతోంది, ఇది పూర్తిగా ఇల్లీగల్… చట్టాలు ఉల్లం ఘించి అడ్డగోలుగా భారీగా మట్టి తవ్వకాలు సాగిస్తు న్నారు, అడ్డుకున్న టిడిపి నాయకుడిపై పోలీసులు చేయచేసుకోవటం దారుణం, దీనిపై పోరాటం చేసి తీరుతామని తెలిపారు.
గెలిచిన వెంటనే బట్టలుపెట్టి ఇళ్లపట్టాలు
గెలిచిన వెంటనే ఇళ్ళ పట్టాలు ఇస్తానన్న ఎమ్మెల్యే ఆర్కే వందల సంఖ్యలో పేద ప్రజల ఇళ్లు కూల్చారని లోకేష్ పేర్కొన్నారు. 40 ఏళ్లుగా ఇరిగేషన్, అటవీ భూముల్లో నివసిస్తున్న వారికి రాబోయే ఎన్నికల్లో తాను గెలిచిన ఏడాదిలో బట్టలు పెట్టి ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పారు. అదేవిధంగా దేవుడి మాన్యం ప్రాం తంలో 48 గంటల్లోనే రోడ్డు వేయించి జంగిల్ క్లియ రెన్స్ చేయిస్తానని తెలిపారు. గతంలో స్థలం కేటా యించినా మౌలిక సదుపాయాలు కల్పించలేక పోయా మని, ఎండోమెంట్ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తానని చెప్పారు. మౌలిక సదుపాయాలు అన్ని పక్కాగా ఏర్పాటు చేసే బాధ్యత తనదని అన్నా రు. ఉండవల్లి కొండపై యథేచ్చగా గ్రావెల్ దోపిడీ సాగుతోంది, అనుమతి ఇచ్చింది గోరంత… దోచింది కొండంత.. తాను గెలిచిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు 10 వేల ఇళ్లు నిర్మిస్తానని లోకేష్ పేర్కొన్నారు.
ఉండవల్లిలో బాదుడే బాదుడు
ఉండవల్లి గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో యువనేత లోకేష్ పాల్గొన్నా రు. పోలకమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల ఎదు ర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మరణిం చిన టిడిపి కార్యకర్తల ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యు లను పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడు తున్న కార్యకర్తలను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాం క్షించారు. కరెంట్ బిల్లు ఎక్కువోచ్చిందని పెన్షన్ కట్ చేశారని, ఏడాది నుండి పెన్షన్ రావడం లేదంటూ వృద్ధురాలు హైమావతి లోకేష్ ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. ఇరిగేషన్ భూముల్లో నివసిస్తున్న వారికి ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఆర్కే మోసం చేసారని, కనీసం ఇప్పుడు తమను పలకరించడానికి రావడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అటవీ భూ ముల్లో ఉన్నవారికి ఇళ్ళపట్టాలు ఇస్తానన్నారు. మూడు న్నర ఏళ్ళు అయినా హామీ నెరవేర్చలేదని స్థానికులు వాపోయారు.
400 కరెంట్ బిల్లు 3 వేలు అయింది
రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యల తో ఇబ్బంది పడుతున్నాం. చెత్త పన్ను కట్టాలని మున్సిపల్ అధి కారులు వేధిస్తున్నారని ఉండవల్లి వాసులు తెలిపారు. 400 వచ్చే కరెంట్ బిల్లు 3000 వస్తుంది, మీ నాన్న సిఎంగా ఉన్నప్పుడు పండుగ కానుకలు ఇచ్చేవారు, ఇప్పుడు ఏమీ లేవు, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఆర్కే మొహం ఎప్పుడూ చూడలేదు, పట్టాలు ఇస్తానని మోసం చేసాడని ఉండవల్లి కొండప్రాంత ప్రజలు లోకేష్ వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు. దేవుడి మాన్యం ప్రాంతంలో నివసి స్తున్న వారికి అనేక సమస్యలు ఉన్నా అధికారులు కనీసం మా వైపు చూడటం లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను విజయం సాధించిన వెంటనే అందరికీ పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.