చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

సత్కార్యానికి సహకరించక.. ‘పీ-4’పై దుష్ప్రచార దాడి ఎందుకు?

ఏపీ ట్యాక్స్‌ పేయర్స్‌ సంఖ్యను రెండు రెట్లు కుదించిన ‘వర్ధెల్లి మురళి కుతంత్రం`17’

by చైతన్యరధం
April 8, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ బిచ్చంతోనే జనం బ్రతకాలా?
  • పేదలు సొంతకాళ్లపై నిలబడడం ఆ ముఠాకు ఇష్టంలేదా?
  • డ్వాక్రా పేరుతో చంద్రబాబు మహిళల్ని చెడగొడుతున్నారని ఆరోజు నిందించలేదా?
  • నేడు 60 వేల కోట్ల బ్యాంకు లావాదేవీలతో.. కోటిమంది డ్వాక్రా మహిళలు సొంత కాళ్లపై నిలబడుతున్నది నిజంకాదా?
  • ఏపీ ట్యాక్స్‌ పేయర్స్‌ సంఖ్యను రెండు రెట్లు కుదించిన ‘వర్ధెల్లి మురళి కుతంత్రం`17’
06.04.2025 ఆదివారం అవినీతి పుత్రిక ‘సాక్షి’ ఎడిట్‌ పేజీలో తమ యజమాని అవలక్షణాల్ని చంద్రబాబుకు అంటగడుతూ వర్ధెల్లి మురళి మరో భారీ వ్యాసం రాశారు. ఏరు దాటకముందు ఓడమల్లన్న… ఏరు దాటాక బోడిమల్లన్న అనే సామెత సరిగ్గా జగన్‌కు వర్తిస్తుందిగాని, మీరు చెప్పినట్టు చంద్రబాబుకు కాదు. మద్యనిషేధం హామీపై మాటతప్పి మడమ తిప్పారు. పైగా మీ అవినీతి కోసం విషపూరిత మద్యం పోసి 35 లక్షలమంది పేదల్ని రోగాలపాలు చేశారు. మూడు రెట్లు మద్యం ధరలుపెంచి, పేదల సంపాదన కొల్లగొట్టి, పేదల్ని నిరుపేదలుగా మార్చారు. రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం చేశారు. మెగా డిఎస్సీపై మొండిచేయి చూపి వేలాదిమంది యువతను ఆత్మహత్యలపాలు చేశారు. అలాగే గంజాయి, డ్రగ్స్‌ మాఫియాతో కుమ్మక్కయి యువతను నిర్వీర్యం చేశారు. ఇలా జగన్‌ మేనిఫెస్టోలో 85శాతం హామీలకు ఎగనామం పెట్టారు. అమ్మఒడికి రూ.13 వేలు ఇచ్చి నాన్న బుడ్డిలోనుంచి రూ.లక్ష కొట్టేశారు. డ్రైవర్‌కు రూ.10 వేలు ఇచ్చి.. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచి రూ.లక్ష కొట్టేశారు. మత్స్యకారునికి రూ.10 వేలు ఇచ్చి, చెరువులపై వారికి ఉన్న హక్కుల్ని తొలగిస్తూ జీవో నెంబర్‌ 217 తెచ్చారు. ఇలా నవరత్నాల్ని నవమోసాలు చేశారు. ఇవీ బోడి మల్లన్నకు అతికే సత్యాలు!
కోతల గాంభీర్యమేగాని కుప్పంలో విత్తులులేని డీబీటీ
డీబీటీికి రూ.2.73 వేల కోట్లు ఇచ్చి పేదల్ని ఉద్ధరించినట్టు నాన్‌స్టాప్‌ కాకి గోల చేస్తున్నారు. పేదల్ని సొంత కాళ్లపై నిలబెట్టే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.లక్ష కోట్లు దారిమళ్లించారు. ఒక్క విషపూరిత మద్యంలోనే రూ.99 వేల కోట్లు పేదల సంపాదన కొల్లగొట్టారు. 9సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తారాస్థాయికి పెంచారు. ఇలా ధరలు, పన్నులు, చార్జీల బాదుడుతో వేలకోట్లు పేదలవద్ద పిండుకున్నారు. ఇలా పది రూపాయలిచ్చి.. పేదలవద్ద వంద కొట్టేశారు. పేదల పేరుతో ఆరు లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. సెంటు పట్టా పేరుతో రూ.7 వేల కోట్లు అవినీతి చేశారు. 5 లక్షల ఎకరాలకుపైగా పేదల అసైన్‌మెంట్‌ భూములు కబ్జా చేశారు. విదేశీ విద్య రద్దు చేశారు. పేదలు సొంత కాళ్లపై నిలబడే పథకాల్ని రద్దు చేశారు. పేదల్ని నిరుపేదలుగా చేసి.. మాయమాటలతో మభ్యపెట్టడమే డీబీటీపై చేసే అతి ప్రచారం. మాయమాటలకు, కపట ప్రేమలకు పేదలు ఎల్లకాలం మోసపోరు. తగిన శాస్తి చేశారు. భవిష్యత్తులో కూడా చేస్తారు.
సూపర్‌ సిక్స్‌ ఎగ్గొట్టేందుకే ‘పీ-4’ తెచ్చారనేది పచ్చి అబద్ధం
సూపర్‌-6లో భాగంగా ఇప్పటికే కోటిమందికి పైగా మహిళలు గ్యాస్‌ తీసుకుంటున్నారు. జులై నెలలోపు ఎంతమంది పిల్లలుంటే వారందరికీ ‘తల్లికి వందనం’ ఇవ్వబోతున్నారు. మత్స్యకారులకు వేట నిషేద భృతి రూ.20 వేలు ఇవ్వబోతున్నారు. ఈనెల నుండే 16,347 ఉపాధ్యాయ నియామకాలకు డిఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు.
ప్రతి నెలా పింఛన్లకే చంద్రబాబు ప్రభుత్వం రూ.1.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. అన్న క్యాంటిన్ల ద్వారా వేలాదిమంది పేదలు ఆకలి తీరుస్తోంది. ఉచిత ఇసుక విధానం ద్వారా 40 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పనితోపాటు 125 వృత్తులు, వ్యాపారాలు లబ్ది పొందుతున్నాయి. నాణ్యమైన మద్యం ద్వారా పేదల ఆరోగ్యాలు కాపాడబడుతున్నాయి. ధాన్యం సేకరించిన 24 గంటల్లో నిధులు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు. ఇప్పటికే రూ.7 లక్షల కోట్ల పెట్టబడులు ఆకర్షించి 4 లక్షల మందికి ఉద్యోగ కల్పనకు అవకాశాలు కల్పించారు. ఇక పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకుంది. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపబడిరది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు దారిమళ్లించకుండా స్వయం ఉపాధి ప్రారంభమైంది. ఇలా 9 నెలల్లోనే 50 శాతానికి పైగా మేనిఫెస్టో హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేసింది. ఐదేళ్లలో జగన్‌ 85శాతం హామీలకు ఎగనామం పెట్టారు. ఏపీలోగాని, దేశంలోగాని ఏ పార్టీ కూడ మొదటి ఏడాదే మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేసిన పరిస్థితి లేదు. జగన్‌ మొదటి ఏడాది అమలు చేసిన హామీలకన్నా కూటమి ప్రభుత్వం ఎక్కువరెట్లే హామీలు అమలు చేసింది. సూపర్‌-6లోని ప్రతి హామీ అమలు చేసి తీరుతుంది.
పీ-4 అంటే జగన్‌ ముఠాకు ఎందుకంత వణుకు?
పేదరికంలేని సమాజ నిర్మాణం గొప్ప సంకల్పం. ఇందుకు పెద్దమనసు ఉంటే చేయూతనివ్వాలిగానీ దానికి విరుద్ధంగా జగన్‌ ముఠా ఎందుకు విషం కక్కుతోంది? అబద్ధపు ప్రచారం ఎందుకు చేస్తోంది? పేదరికం శాశ్వతంగా ఉండాలని, వారు తనపై ఆధారపడి బతకాలని, సొంత కాళ్లపై పేదలు నిలబడకూడదనేది జగన్‌ రెడ్డి ఫ్యూడల్‌, ఫ్యాక్షనిస్టు సిద్ధాంతం. పేదలకు బిస్కెట్లు వేసి అధికారానికి వచ్చి రాష్ట్ర సహజ వనరులు, ప్రభుత్వ ఖజానాను లక్ష కోట్లు కొల్లగొట్టడం జగన్‌ కుటుంబ మార్క్‌ రాజకీయం. తెలుగు వారు ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలనేది చంద్రబాబు మార్క్‌ విజన్‌. నూటికి 80 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేదలు పేదరికంలో మగ్గుతూ అశాంతికి గురైతే ఎవరికీ రక్షణ ఉండదు. రాష్ట్రం ప్రగతి సాధించలేదు. కనుక కేంద్ర జాతీయ మల్టీ డైమన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ (ఎండీపీఐ) ప్రకారం ఏపీలో 7.2 శాతం పేదలు అంటే 20 లక్షలమంది ఉన్నారు. ముందుగా ఈ కుటుంబాలను అభివృద్ధి చేయాలనేది చంద్రన్న సంకల్పం. గతంలో జన్మభూమి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేశారు. స్వర్ణాంధ్రవిజన్‌ 2047 లక్ష్యాలలో భాగంగా నేడు కుటుంబాల్ని అభివృద్ధి చేయుటకు ‘మార్గదర్శి- బంగారు కుటుంబం’ అమలుకు కృషి చేస్తున్నారు. సదుద్దేశం ఉండేవాళ్లయితే ఒకటి, రెండేళ్లు చూసి దానిపై విమర్శలు చేయాలిగాని ప్రారంభంలోనే దానిపై దుష్ప్రచార దాడి దురుద్దేశం కాదా?
ఏపీలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న అధికాదాయవారు 8 లక్షల మంది అన్న జగన్‌ మాట అబద్ధం. నేడు ఏపీలో 22 లక్షలకు పైగా అధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారున్నారు. వీరితోపాటు లక్షలాదిమంది తెలుగు ఎన్నారైలు ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో స్థిరపడి మంచి స్థానంలో ఉన్న తెలుగు ప్రముఖులున్నారు. వీరందరిని భాగస్వాముల్ని చేయడం ద్వారా 20 లక్షల పేద కుటుంబాల్ని పేదరికం నుండి ఉన్నతికి తీసుకరావడం సాధ్యమే. మనసుంటే మార్గం ఉంటుంది. అమరావతి అభివృద్ధి ద్వారా దాని చుట్టూ ఉన్న వేలాది పేదలు పేదరికం నుండి బయట పడతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల నిధులు దారి మళ్లించకుండా స్వయం ఉపాధి పథకాలు అందించడం ద్వారా రాబోయే ఐదేళ్లు కొన్ని లక్షల మంది పేదలు పేదరికం నుండి ఉన్నత స్థితికి వస్తారు. 20 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ ద్వారా వచ్చే ఉద్యోగాలు, ఉపాధి పేదల అభివృద్ధికి దోహదపడుతుంది. ఇలా ఎన్నో విధాల 20 లక్షల పేదల అభివృద్ధితోపాటు రాష్ట్ర అభివృద్ధి కూడా సాధ్యమే. ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ కోటిమంది డ్వాక్రా అభివృద్ధి మన కళ్లుముందు ఉంది.
తెల్లకార్డులు కోటి నలభై ఎనిమిది లక్షలు ఉన్నాయన్న జగన్‌ రెడ్డి తన పాలనలో ఆ కార్డులు ఉన్నవారందరికీ నవరత్నాలు ఎందుకు ఇవ్వలేదు? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మల్టీ డైమన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ ప్రకారం రాష్ట్రంలో ఉన్న పేదలు సుమారు 20 లక్షలమంది మాత్రమే.
పేదల్ని అవమానించింది.. హత్యలు చేసింది జగన్‌ ముఠానే
చంద్రబాబు పేదల్ని అవమానించారనేది వాస్తవాల్ని వక్రీకరించి చూసే అబద్ధపు ప్రరాచమే. రైతు బిడ్డలు చదువుకోవాలని చంద్రబాబు అంటే దాన్ని వక్రీకరించి ముందు, వెనుక మాటలు కత్తిరించి వ్యవసాయం దండగ అన్నారని దుష్ప్రచారం చేశారు. ఇలాంటివే మిగిలిన ఆరోపణలు కూడా.
జగన్‌ పాలనలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని నిలబెట్టి మంత్రులు కుర్చీలో కూర్చొన్నారు. బీసీ మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ.. వైవి సుబ్బారెడ్డి ముందు మోకరిల్లజేశారు. జగన్‌ కూర్చొని వుంటే బీసీ, ఎస్సీ మంత్రులంతా ముని కాళ్లపైనే నిలబెట్టేవారు. 5 లక్షలకు పైగా పేదల అసైన్‌మెంట్‌ భూములు కబ్జా చేశారు. లక్ష కోట్లు సబ్‌ ప్లాన్‌ నిధులు దారిమళ్లించారు. ప్రశ్నించిన బీసీ, పస్సీ, ఎస్టీ వర్గాలవారిని 600లకు పైగా హత్యలు చేశారు. దుర్మార్గ లక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి తాము తప్పించుకోవడానికి చెప్పిన అబద్ధమే వందసార్లు చెబుతున్నారు.
రైతు ద్రోహి జగన్‌
వైఎస్‌ పాలనలో 14,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్‌ పాలనలో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు పాస్‌ పుస్తకాలపై, పొలాలపై ఆయన బొమ్మలు వేసుకున్నారు. చంద్రబాబు పాలనలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గించారు. రైతు బాంధవుడు చంద్రబాబు.. రైతు ద్రోహి జగన్‌!!
గురజాల మాల్యాద్రి
ఛైర్మన్‌, టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌
Previous Post

లోకేష్‌ మాటంటే మాటే!

Next Post

‘ఆక్వా’పై స్టడీ కమిటీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
బీసీలకు 40% సీట్లు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ పునరుద్ధరణ పనులకు సిబ్బందిని పంపండి

November 2, 2026
Next Post
‘ఆక్వా’పై స్టడీ కమిటీ

‘ఆక్వా’పై స్టడీ కమిటీ

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026
0

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026
0

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026
0

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026
0

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.