- చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల స్ఫూర్తిదాయక ప్రసంగాలు
- ఫర్‌ఫెక్ట్ కెమిస్ట్రీ
- ఆలోచన… ఆవేశాల మేలు కలయిక
- భావం ఒకటే.. భాషలు వేరు…
- విధ్వంసక జగన్‌రెడ్డిని కడిగేసిన అగ్రనేతలు
- పలు ప్రశ్నలకు దీటుగా జవాబిచ్చిన పవన్‌కళ్యాణ్
- ఉత్సాహంతో ఊగిపోయిన లక్షలాది సభికులు
- తాడేపల్లిప్యాలెస్‌ను తాకిన విజయదుందుభి
తాడేపల్లిగూడెం, చైతన్యరథం: యుద్ధం ఎలాంటిదైనా గెలవడానికి లోతైన ఆలోచనతో కూడిన ప్రణాళిక, కదనక్షేత్రంలో వీరులకు పోరాట శక్తినిచ్చే ఉత్తేజపూర్వక ఆవేశం ఎంతో అవసరం. మరీ ముఖ్యంగా ప్రత్యర్థి అధికారమదంతో కూడిన దాష్టీకుడైనప్పుడు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికల కురుక్షేత్రయుద్ధం జరగనుంది. రణక్షేత్రంలో ఇరుపక్షాలు ఇప్పటికే మోహరించాయి. ఇతిహాసాల్లో ఆవిష్కరింపబడ్డ పలువురు దానవులను మించిపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒకవైపు…
పీడిత ప్రజల పక్షాన తెదేపా` జనసేన కూటమి మరోవైపు.
రాష్ట్ర ప్రజల సుస్థిర భవిష్యత్ కోసం జరగనున్న ఈ యుద్ధం రూపురేఖలను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం తాడేపల్లిగూడెం వద్ద జరిగిన భారీ బహిరంగసభలో రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమయ్యేలా ఆవిష్కరించారు. ఈ యుద్ధంలో ప్రజల పక్షాన కూటమి గెలుపు ఆవశ్యకతను, రాక్షస సమానుడైన జగన్‌రెడ్డి ఓటమి అనివార్యతను తమ తమ రీతుల్లో ప్రజల మనసులకు హత్తుకునేలా వివరించారు. మూడు గంటలకు పైగా సాగిన కూటమి మొదటి ఉమ్మడి ప్రచార భేరి సంపూర్ణ విజయాన్ని సాధించింది. సభ ఆసాంతం ఇరు పార్టీలు తమ భాగస్వాముల పట్ల ఉన్న గౌరవాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు వెల్లడిరచారు. రెండు పార్టీలకు చెందిన పలువురు అగ్రనాయకుల ప్రసంగాల్లో స్పష్టంగా వెల్లడైన ఈ వైఖరి తెదేపా` జనసేన కూటమిల బలాన్ని రెట్టింపు చేసిందని పరిశీలకులు ముక్తకంఠంతో అంటున్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు దాదాపు చెరో 40 నిమిషాలు ప్రసంగించారు. ఉమ్మడి కూటమి మొదటి ప్రచార భేరి సభను చారిత్రాత్మక దినంగా చంద్రబాబు వర్ణిస్తే.. అహంకారంతో విర్రవీగుతున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి యుద్ధాన్ని చూపిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎంతో ప్రణాళికాబద్దంగా చంద్రబాబు నవ్వాంధ్ర ఏర్పాటు, రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిత కోసం 2014`19 కాలంలో తమ ప్రభుత్వం చేసిన శ్రమ, పవన్ కళ్యాణ్ అందించిన మద్దతు, దాని ఫలితాలు, 2019లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన తీరును, నవ్యాంధ్ర పున:నిర్మాణం కోసం వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు అవసరాలను కళ్లకు కట్టినట్లు వర్ణించారు.
అనంతరం ప్రసంగించిన పవన్ కళ్యాణ్ తన సహజమైన రీతిలో అదే సందేశాన్ని ఎంతో ఆవేశంతో సభికులను ఉత్తేజపరుస్తూ వివరించారు. లోతైన ఆలోచన, ఉత్తేజపూర్వకమైన ఆవేశాల ఈ మేలు కలయిక సూపర్ హిట్ కాంబినేషన్ అని, ఈ సంకీర్ణంతో విజయం తథ్యమని సభకు హాజరైన పలువురు నాయకులు, శ్రేణులు, పరిశీలకులు ముక్తకంఠంతో వ్యాఖ్యానించారు. సాధారణంగా సభల్లో అందరికన్నా సీనియర్ చివర్లో ప్రసంగిస్తారు. 45ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన గతం చంద్రబాబుకు ఉన్నా కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ చివరిగా ప్రసంగించడం… ఒకరు ఎక్కువ కాదు ..ఒకరు తక్కువ కాదు అని సభలో చంద్రబాబు చెప్పినదానికి అక్షర రూపమని పలువురు వ్యాఖ్యానించారు. ఇరు పార్టీల మధ్య పైనుంచి కిందిస్థాయి వరకు పటిష్టమవుతున్న ‘ఫర్‌ఫెక్ట్ కెమిస్ట్రీ’కి ఇది అద్దం పట్టింది.
ఫెర్‌ఫెక్ట్ కెమిస్ట్రీ
చంద్రబాబు రాజకీయ దురంధరుడని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినప్పుడు.. ప్రశ్నించే శక్తిగల సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు అన్నప్పుడు సభికుల కరతాళ ధ్వనులు ఆ ప్రాంత మంతా ప్రతిధ్వనించాయి.
మరో సూపర్‌స్టార్ నందమూరి బాలకృష్ణ ప్రసంగించడానికి వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ తన సీటులో నుండి లేచి వచ్చి బాలకృష్ణ చేయిపట్టుకొని పైకి లేపి విజయసంకేతాన్ని ప్రదర్శించినప్పుడు సభా ప్రాంగణం మార్మోగింది. చంద్రబాబు ప్రసంగం ముగించి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన్ను ఆలింగనం చేసుకోవడం, పవన్ కళ్యాణ్ ప్రసంగం అనంతరం చంద్రబాబు అదేరీతిన చేయడం లక్షలాది సభికులను ఉద్విగ్నతకు గురి చేసింది.
తాడేపల్లిగూడెం సభకు ‘జెండా’ అని పేరేందుకు పెట్టారో పవన్ కళ్యాణ్ వివరించి ఇరు పార్టీల శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపారు. వైసీపీ మూకల ఎటువంటి దాష్టీకాలనైనా ధీరోదత్తంగా… అవసరమైతే కర్రల సాయంతో ఎదుర్కొవాలనే సందేశాన్ని ఇవ్వడానికే ఆ పేరు పెట్టామని చెప్పినప్పుడు శ్రేణుల హర్షధ్వానాలు ఆకాశాన్ని తాకాయి.
ఇద్దరు అగ్రనాయకులు సభా వేదికపైకి వచ్చాక చంద్రబాబు జనసేన జెండాను, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జెండాను పట్టుకొని చిరునవ్వుతో ఊపుతూ లక్షలాది సభికులను ఉత్తేజితులను చేశారు. దీంతో ఏర్పడిన సుహృద్భావ వాతావరణం సభ చివరి వరకు కొనసాగి ఇరు పార్టీల అగ్రనాయకులు తమ తమ శ్రేణులకు ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఎంతో ప్రభావవంతంగా ఇవ్వడానికి తోడ్పడిరది.
అంచనాలకుమించి తాడేపల్లిగూడెం ఉమ్మడి మొదటి ప్రచార భేరి భారీ విజయాన్ని సాధించి ప్రత్యర్ధుల గుండెల్లో కేక పుట్టించింది. ఈ కేక తాడేపల్లి ప్యాలెస్‌ను గట్టిగా తాకి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి గుండెల్లో గుబులు రేపింది.