ప్రభుత్వ విధానాలు, వ్యవహారాలను నిర్వహించటమే పరిపాలన. ప్రజోపయోగకర విధానాలు రూపొందించి అమలుజరపటం పరిపాలనా సామర్ధ్యానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబునాయుడు పరిపాలనా సామర్ధ్యం ఒక ప్రామాణికంగా నిలిచింది. అందుబాటులో వున్న వనరులను సమర్ధంగా వాడుకుంటూ దేశంలోనే ఒక ఆదర్శ పాలనకు శ్రీకారం చుట్టారు. సంస్కరణలకు మానవీయ కోణాన్ని జోడించి చంద్రబాబు పాలించిన తీరు మేధావులను సైతం అబ్బురపరచింది. రాజకీయాలను ఎన్నికలవరకే పరిమితం చేసి, తర్వాత పాలనపై దృష్టి కేంద్రీకరించటం వల్లనే చంద్రబాబు ఎన్నో అద్భుతాలు సాధించగలిగారు.
దేశానికి ‘సుపరిపాలన’ అనే భావనను తొలిసారిగా పరిచయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇప్పుడా భావన దేశమంతా అనుసరించటమేగాక, విశ్వమంతా వ్యాప్తి చెందింది. మానవవనరులు, సాంకేతిక పరిజ్ఞానం, సమాచార వ్యవస్థ, ఎలెక్ట్రానిక్ మీడియా లను ఒకదానితో ఒకటి అనుసంధానం గావించటం ద్వారా చంద్రబాబు సుపరిపాలన నమూనాను దేశానికి చూపించగలిగారు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకోవటంలో చంద్రబాబు అందరికంటే ముందుండేవారు. మార్కెట్ ఇంటెలిజెన్స్, పౌరసేవల కంప్యుటరీకరణ, టెలీమెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్ వంటి వాటిని సామాన్యులకు చేరువ చేసి వాటి ద్వారా మంచి ఫలితాలు సాధించారు.
కాల్ సెంటర్ ల ఏర్పాటు ద్వారా సమాచార వ్యవస్థను ఏ విధంగా వినియోగించుకోవచ్చో ఆచరణలో చూపారు. ఎలెక్రానిక్ మీడియా ను ఉపయోగించుకొని ‘మీకోసం’ వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులలో బాధ్యత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రతి స్థాయిలోనూ సిటిజెన్ ఛార్టర్ ఏర్పాటు చేసి, ప్రజాసమస్యల పరిష్కారానికి నిర్ధిష్ట కాలవ్యవధి నిర్దేశించారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి పౌర సేవలను ప్రజల ముంగిటకు చేర్చారు. ఆవిఈతిని అరికట్టడంలో భాగంగా పలు నూతన చట్టాలకు రూపకల్పన చేశారు. అవినీతి అధికారుల ఆస్తుల స్వాధీనం బిల్లు, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ లో పారదర్శకత బిల్లు, పెర్ఫార్మెన్స్ అకౌంటబిలిటీ బిల్లు తో పాటు ఈ ప్రొక్యూర్మెంట్, టెండరు సంస్కరణలు వంటివి వాటిలో ముఖ్యమైనవి.
పోటీప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి, అందుకోసం సుపరిపాలన అవసరమవుతుంది అని చంద్రబాబు భావించారు. సంస్కరణల కారణంగా వనరులను సమర్ధంగా వినియోగించుకోడానికి వీలు కలుగుతుంది. వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం వల్ల బలహీన వర్గాలకు మౌలిక సదుపాయాల కల్పన, జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన ఎక్కువ నిధులు అందుబాటులోకి వచ్చేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ కారణంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం మూడుపూవులు, ఆరుకాయలుగా విరాజిల్లింది.