వెంకటగిరి బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ రామ్ కుమార్ రెడ్డి గారి గురించి తెలుసుకున్న తరువాత ఆశ్చర్యం వేసింది. ఆయన ముందు ఎవరూ కూర్చో కూడదు అంట నిలబడి మాట్లాడాలి అంట. ప్రశాంతంగా ఉండే వెంకటగిరిని వైసిపి నాయకులు దౌర్జన్యాలు, భూకబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు. కలువాయి మండలంలో వైసిపి నేతలు 600 ఎకరాలు కబ్జా చేసారు. ఎమ్మెల్యే గారికి తెలిసి కొన్ని పట్టాలు రద్దు చేయించగలిగారు. ప్రస్తుతం లోకాయుక్తా లో కేసు నడుస్తుంది. వైసిపి నేతలు పెన్నా నది నుండి ఇసుకను దోపిడీ చేస్తున్నారు.
వెంకటగిరి, రాపూరు, కలువాయి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం మండలాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని వైసిపి నేతలు కబ్జా చేసారు. దళితుల భూములు కూడా వదలడం లేదు. వెంకటగిరి టైలర్స్ కాలనీలో పార్కులు, గుడులు, బడులు కోసం వదిలిన స్థలాన్ని వైసిపి లీడర్స్ ప్లాట్లు వేసి అమ్మేసారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ ఎల్. కె. ఆర్. పోలీస్ స్టేషన్ల లో పంచాయతీల నుండి ఎర్రచందనం, ఇసుక, గ్రావెల్ దందా మొత్తానికి డాన్ ఆయనే.
ఈ ఎల్. కె. ఆర్ వెంకటగిరి బజార్ సెంటర్ లో 10 కోట్లతో అక్రమంగా ఒక భవనం కూడా నిర్మించాడు. వెంకటగిరి మున్సిపాలిటీ లో బిల్డింగ్ కట్టాలంటే వైసిపి నేతలకి కప్పం కట్టాల్సిందే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన శ్యాంప్రసాద్ రెడ్డి ఏకంగా సోమశిల కెనాల్ ని ఆకిల వలస దగ్గర పూడ్చి పెట్టాడు.