విశాఖపట్నం: మరో మూడు నెలల్లో సీఎం జగన్ జైలుకెళ్లడం ఖాయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలుచేశారు. జగన్‌్ పక్కా 420అన్నారు. ‘సిద్ధం’ సభలో జగన్ ‘శిలువ’ మీద క్యాట్‌వాక్ చేశారని ఎద్దేవాచేశారు. జగన్ డబ్బా కొట్టుకుంటు నట్టుగా అతడు అర్జునుడు ఏం కాదని.. సిద్ధం సభలో చెప్పిందంతా సోదేనని దుయ్య బట్టారు. రాజమహేంద్రవరం పదాన్ని సైతం జగన్ స్పష్టంగా ఉచ్ఛరించలేక పోయారని విమర్శించారు. ఎన్నికల య్యాక లండన్‌లో లేదా మరెక్కడ దాక్కున్నా.. జగన్‌ని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. టీడీపీ అధి కారంలోకి వచ్చిన వెంటనే.. జగన్ తిన్న డబ్బులన్నింటినీ కక్కిస్తామని ఉద్ఘాటించారు.
ఇదేం న్యాయం..?
ఒక ఎస్సీని చంపిన వ్యక్తిని పక్కన పెట్టుకొని.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారా? అని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. రాజధాని చేస్తానని చెప్పి విశా ఖను జగన్ నిండా దోచేశారని, చివరికి విశాఖ కోడి పుంజులను కూడా పట్టుకుపోయారని తూర్పా రపట్టా రు. జగన్ 98శాతం హామీలు ఎక్కడ అమలు చేశాడని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధం.. వంటివి ఏమీ అమలు చేయలేదన్నారు. అమరావతి రాజధాని కాదన్నారు.. మూడు రాజ ధానులు కూడా లేవన్నారు. సజ్జల రామకృష్ణరెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే అని విరుచు కుపడ్డారు. రూ.3వేల పెన్షన్ విషయంలోనూ జగన్ ప్రజలను మోసం చేశారన్నారు. ఇళ్ళ విషయంలోనూ జగన్ మోసం చేశారని ఫైర్ అయ్యారు.
సమాధానమివ్వండి సీఎం?
గాదిరాజు ప్యాలెస్ మీద కూడా కన్నేశారని.. భారతి కి నచ్చితే ఆ ప్యాలెజ్‌ని కాజేస్తారా అని అయ్యన్న పాత్రు డు నిలదీశారు. ప్రజల పాస్ బుక్ మీద, ఆఖరికి సర్వే రాళ్ల మీద జగన్ ఫోటో ఎందుకు ఉందని ప్రశ్నించారు. భూముల రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన ఒరిజినల్‌పేపర్స్ మీదగ్గర పెట్టుకోవడం ఏంటి? అమ్ముకోవడానికా? అని అడిగారు. రాత్రుల సమయంలో తనని చంపేస్తా మని బెది రింపు కాల్స్ చేస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని అయ్యన్న చెప్పారు.
అందుకే గన్ లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నానన్నారు. గన్‌మెన్లను పంపిస్తానని జిల్లా ఎస్సీ తనకు చెప్పారని… తాను వద్దని చెప్పానని తెలిపారు. తను ఎక్కడ ఉన్నానో గన్‌మెన్లే సమాచారం ఇస్తారని చెప్పారు.
తన కుమారుడు అనకాపల్లి స్థానానికి దరఖాస్తు చేశాడని… ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్ పరిశీ లిస్తోందని తెలిపారు. అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం తన తనయుడు దరఖాస్తు చేసుకుంటే తప్పే ంటని తిరిగి ప్రశ్నించారు. అనకాపల్లిలో వైసీపీ నేతలు 1200ఎకరాలకు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని.. తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఈ భూ కుంభకోణాలపై సీఐడీ పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరిన ఆయన.. న్యాయం కోసం న్యాయస్థానానికి కూడా వెళ్తానన్నారు.
షర్మిలకు భద్రతను పెంచాలి..
జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశే ఖరరెడ్డి ఆయన ఆస్తిలో షర్మిలకు వాటారాశారని… ఆ వాటాను షర్మిలకు జగన్ ఇవ్వడం లేదని చెప్పా రు.షర్మిలను అంతమొందించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని… ఆమెకు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు.