నియోజవర్గంలో రూ.7,121 కోట్లతో
17 పరిశ్రమలు తీసుకొచ్చారు
సంజీవని హెల్త్ క్లినిక్స్‌తో ఆరోగ్య భరోసా
కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి
పెద్దకోటమకనపల్లి మహిళలతో సమావేశం
కుప్పం(చైతన్యరథం): చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా రెండోరోజు గుడిపల్లి మండలం పెద్దకోటమకనపల్లి గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరి మహిళలతో సమా వేశమయ్యారు. చంద్రబాబును 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా ఉండటంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి నేను కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. ప్రజల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తున్నాను. రాష్ట్రాన్ని బాగుచేయడం చంద్రబాబు వల్లే సాధ్యమని ప్రజలు నమ్మి ఓటేశారు. కుప్పం నియోజక వర్గానికి రూ.7,121 కోట్ల విలువైన పెట్టుబడులతో 17 పరిశ్రమ లు తీసుకొచ్చారు. వీటి ద్వారా పెద్దఎత్తున ఉపాధి లభిస్తుంది. కుప్పంలో అడిడాస్ కంపెనీ ఫుట్ వేర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. కుప్పంలో సోలార్ ఎనర్జీ వినియోగం పెంచేందుకు చర్యలు చేపట్టారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కుప్పం డిగ్రీ కాలేజ్‌లో జాబ్ మేళా సందర్భంగా 5 వేల ఉద్యోగాల కల్పనకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి.
నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథ కం కింద 37,824 మంది లబ్ధి పొందుతున్నారు. 42,232 మందికి తల్లికి వందనం అందుతోంది. స్వచ్ఛ కుప్పంలో భాగం గా చెత్త నుంచి సంపద సృష్టించేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టారు. స్వర్ణ కుప్పంలో భాగంగా సీసీ, బీటీ రోడ్లు వేస్తున్నారు. సంజీవని హెల్త్ క్లినిక్స్ ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తు న్నారు. కుప్పానికి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చా రు. గత ప్రభుత్వంలో చంద్రబాబుపై నిందలు మోపి అక్రమంగా అరెస్ట్ చేశారు. యావత్ తెలుగు ప్రజలు అండగా నిలబడ్డారు. మద్దతుగా మహిళలు పెద్దఎత్తున బయటకు వచ్చి పోరాడారని గుర్తుచేసుకున్నారు. అంతకు ముందు స్థానిక మహిళలతో కలిసి కోలాటం ఆడారు.
















