- పార్టీకి అది ఒక భావోద్వేగం
- తెలుగువారు ఆసక్తిగా చూసే కార్యక్రమం
- రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాం
- పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెడదాం
- కార్యకర్తలు ఎదుగుదలకు క్లస్టర్ విధానం
- టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): టీడీపీ మహానాడు 2026ను ఈసారి పూర్తిగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నామని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, గ్రామ స్థాయి కార్యకర్త లతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు నిర్వహణ, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు. గతంలో కొవిడ్ సమయంలో కూడా డిజిటల్ పద్ధతిలో మహానాడు నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థి తులను దృష్టిలో ఉంచుకుని మరోసారి వర్చువల్ విధానాన్నే ఎంచుకున్నామని చెప్పారు. ఇంత పెద్దఎత్తున వర్చువల్ రూపంలో మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. తెలుగువారు ఆసక్తిగా ఎదురు చూసే కార్యక్రమం మహానాడు అని, పార్టీకి అది ఒక భావోద్వేగమని పేర్కొన్నారు. మహానాడు ద్వారా పార్టీ ప్రజలకు ఏ సందేశం ఇస్తుందో అన్న ఆసక్తి అందరి లో ఉంటుందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 1845 క్లస్టర్ల పరిధిలో మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ ఎదుగుదలకు, కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి క్లస్టర్ విధానం ఉపయో గపడుతుందని వివరించారు. ఈసారి ‘స్త్రీశక్తి’ థీమ్‌తో మహానాడు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో జరిగే మహానాడులో రాష్ట్రస్థాయి నాయకులు కూడా పాల్గొంటారని తెలిపారు. మహానాడులో సరైన మార్గనిర్దేశం చేసుకుని వాటిని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధు లు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రతిఒక్కరిలో జవాబుదారీ తనం ఉండాలని.. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. పార్టీ కార్యకర్తలు అన్నివిధాలా సాధికారత సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించడంతో పాటు రాష్ట్రా భివృద్ధికి పునరంకితమయ్యేలా మహానాడును నిర్వహించుకుందా మని పిలుపునిచ్చారు.














