- కమ్మ కులానికే మొత్తం పోస్టులంటూ ప్రచారం
- తప్పుడు ఆరోపణలేనని ఫ్యాక్ట్ చెక్‌లో వెల్లడి
అమరావతి(చైతన్యరథం): డీఎస్సీపై 270 కేసులు వేశారు.. ప్రతి కేసు కోర్టు కొట్టేసింది.. పేపర్ లీక్ అన్నారు.. మెరిట్ లిస్టు ఇవ్వలేదన్నారు..నవీన్ అనే వ్యక్తి గురించి చెప్పారు..స్పోర్ట్స్ కోటా వద్దు అన్నారు..మహిళా రిజర్వేషన్ వద్దు అన్నారు..దివ్యాంగులకు రిజర్వేషన్ వద్దు అన్నారు.. వీటన్నింటిపై విద్యాశాఖ అధికారుల వివరణతో గొడ్డలి పార్టీ తోక ముడిచింది. నేడు మళ్లీ మరో ఫేక్ తో ఏకంగా కులాన్ని తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కులానికే టీచర్ పోస్టులు అన్నీ ఇచ్చేశారని పేటీఎం బ్యాచ్‌తో ప్రచారం చేయిస్తూ అడ్డంగా దొరికిపోయారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 372 మందిలో ఓసీలు 12% మంది ఎంపికై తే కమ్మ కులానికి చెందిన వారు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. అలాంటిది స్పోర్ట్స్ కోటా కింద 372 మందిని ఒకే కులం వారితో నింపేశారని ఫేక్ ప్రచారం చేయిస్తూ డీఎస్సీపై మరో కుట్రకు వైసీపీ తెరలేపింది.
తన అనుకూల సోషల్ మీడియా, తన అనుకూల వ్యక్తుల ద్వారా కమ్మ కులానికి టీచర్ పోస్టులంటూ ప్రజలను, నిరుద్యోగ యువతను తప్పుదారిపట్టిం చేలా తప్పుడు విశ్లేషణలను జగన్‌రెడ్డి పేటీఎం బ్యాచ్ చేయి స్తోంది. 2014-19 మధ్య కాలంలో కమ్మ కులానికి చెందిన డీఎస్పీలకే ప్రమోషన్లు అంటూ నాడు తప్పుడు ప్రచారం చేసింది. ఇప్పుడు డీఎస్సీ-2025 విషయంలో మళ్లీ అదే విధంగా తెర మీదకు తెస్తూ గొడ్డలి పార్టీ విషం చిమ్ముతోంది. డీఎస్సీపై గొడ్డలి పార్టీ ఆరోపణలకు గట్టిగా కౌంటర్లు ఇస్తుండటంతో దుష్ప్రచా రానికి ఎప్పటికప్పుడూ కొత్తదారులు వెతుక్కుంటోంది. డీఎస్సీ-2025 నిర్వహణను అడ్డుకునేలా 241 కేసులు, ఆ తర్వాత పేపర్ లీక్ పేరుతో డ్రామాలు, ఫిజికల్ వెరిఫికేషన్‌కు పిలిచి ఉద్యోగాలు ఇవ్వలేదని – హారిజాంటల్ రిజర్వేషన్ల అంటూ మోసం చేశారం టూ రకరకాల ఆరోపణలు చేసింది. ప్రతి దానికీ కేస్ బై కేస్ వివరణలు, క్లారిటీ ఇవ్వడంతో దిక్కుతోచక స్పోర్ట్స్ కోటాపై ఆరోపణలకు గొడ్డలి బ్యాచ్ దిగింది. స్పోర్ట్స్ కోటాలోనూ ఎలాంటి అవతవకల్లేవని.. కావాలంటే నిరూపించుకోవాలని అధికారుల ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే.
తిరుపతిలో వైసీపీ నేతలు చర్చకు రాకుండా తోక ముడిచారు. ప్రతి అంశంపైనా క్లియర్ కట్ కౌంటర్లు ఇస్తోండటంతో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా రిక్రూట్‌మెంట్‌లో కమ్మ కులానికి చెందిన వారికే టీచర్ పోస్టులు ఇచ్చారంటూ సరికొత్త దుష్ప్రచారానికి వైసీపీ తెర లేపి నేడు అడ్డం గా పేటీఎం బ్యాచ్ దొరికిపోయింది. స్పోర్ట్స్ కోటాలో మొత్తంగా 372 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తే… ఓసీలకు కేవలం 42 టీచర్ పోస్టులు కేటాయించారని అధికారులు క్లారిటీ ఇచ్చారు. అందులో కమ్మ కులానికి కేవలం 9 టీచర్ పోస్టులు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. ఓసీల్లో అందరికంటే ఎక్కువగా 16 మంది కాపులకు, 10 రెడ్లకు, 9 కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి టీచర్ పోస్టులు ఇచ్చారని అధికారులు తేల్చిచెప్పారు. వైశ్య, క్షత్రియ, బ్రహ్మణులకు చెరో 2 టీచర్ పోస్టులు, మైనార్టీలకు 1 టీచర్ పోస్టు కేటాయించినట్లు లెక్కలతో ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.
స్పోర్ట్స్ కోటా 372 పోస్టుల్లో ఎంపికలు
బీసీలు : 50%
ఎస్సీలు : 30%
ఎస్టీలు : 8%
ఓసీలు : 12%
ఓసీ వర్గానికి చెందిన స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు:
కమ్మ సామాజిక వర్గం : 9 మంది
కాపు సామాజిక వర్గం : 16 మంది
రెడ్డి సామాజిక వర్గం : 10 మంది
వైశ్యులు : 2 మంది
క్షత్రియులు : 2 మంది
బ్రాహ్మణులు : 2 మంది
ముస్లిం మైనారిటీ : 1 వ్యక్తి
ఒకే సామాజిక వర్గానికి స్పోర్ట్స్ కోటా పోస్టులు కేటాయించారనే ప్రచారం పూర్తిగా అవాస్తవం.















