- సీఐ సస్పెన్షన్‌కు సీఎం చంద్రబాబు ఆదేశం
- డీజీపీ, సీఎస్, ఉన్నతాధికారులతో సమీక్ష
- పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్
అమరావతి(చైతన్యరథం): విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసు కుంది. ఈ వ్యవహారంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును సస్పెం డ్ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై సచివాలయంలో సీఎం చంద్రబాబు బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో సమీ క్షించారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ హాజరయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి వచ్చిన సీఎం వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఘటన కు సంబంధించిన వివరాలను సీఎం, డిప్యూటీ సీఎంకు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సహా పోలీసు ఉన్నతాధికారులు వివరించా రు. సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగ రాజుపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశాలిచ్చారు. దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవా లని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సూచనలు చేశారు. ఈ సమావేశానికి సీఎస్ సాయిప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు తదితరులు హాజరయ్యారు.
















