అమరావతి(చైతన్యరథం): ఏపీ మంత్రి నారా లోకేష్‌ను దక్షిణా ఫ్రికా వెటరన్ స్టార్ క్రికెటర్ జాంటీ రోడ్స్ కలిశారు. క్రీడలు, యువజన అభివృద్ధి, క్రీడారంగంలో ఆవిష్కరణలపై చర్చించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా లోకేశ్ వెల్లడించారు. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు అవలంబించడం, రాబోయే తరం ఛాంపియన్లను తీర్చిదిద్దడంపై ఇద్దరం చర్చించాం. ఏపీని ప్రపంచస్థాయి క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రపంచవ్యాప్త క్రీడాకారుల్లో జాంటీ రోడ్స్ స్ఫూర్తి నింపారు. ఆయనను కలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని లోకేష్ పేర్కొన్నారు.

















