రాయదుర్గం చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సాంప్రదాయ నృత్యాలు, డప్పులతో తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వర్షాన్ని లెక్క చేయకుండా భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తల అభిమానంతో లోకేష్ తడిసి ముద్దయ్యారు.