విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ప్రసంగించారు.
విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ప్రసంగించారు. ఈ వర్క్‌షాప్‌కు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటి బిల్డింగ్‌లో అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలిచినందుకు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, ఏపీఎస్ డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలపర్తి వెంకటేశ్వరరావులకు అవార్డును అందజేశారు.