- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అత్యుత్తమం
- 30 రోజుల్లో వచ్చి పాలసీలను పరిశీలించుకోవాలి
- సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
- సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సులో సీఎం చంద్రబాబు
సింగపూర్: సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 30 రోజుల్లో రాష్ట్రానికి వచ్చి అమలు ఉన్న పాలసీలను పరిశీలించా లని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు పిలుపుని చ్చారు. సింగపూర్‌లో సెమీకాన్ రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధా నాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడు లకు భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని, అందులో ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన రాష్ట్రమని వివరిస్తూ పెట్టుబడులకు ఇది సరైన సమయమని పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీకి ఏపీలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. రాయ లసీమలో త్వరలోనే ఓ సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అవుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రా నిక్స్, ఫైటర్ జెట్‌ల తయారీ సహా ఆటోమొబైల్ తయారీ కేంద్రం గా రాయలసీమ ప్రాంతంలో అవకాశాలున్నాయని తెలిపారు. సెమీకండక్టర్లపై ఏర్పాటు చేసిన సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశానికి సింగపూర్‌లోని వివిధ సెమీకండక్టర్ తయా రీ పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. గ్లోబల్ ఫౌండ్రీస్, ఎనఎక్స్‌పీ, ఏఎసఎంపీటీ, ఒన్ సిస్టమ్ టెక్నాలజీస్, టెక్సెండ్ ఫొటోమాస్క్, ఆక్వాటెక్ తదితర సెమీకండక్టర్ తయారీ సంస్థలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాయి.
















