టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ సర్కారు తెచ్చిన జీవో 217ను రద్దు చేస్తాం అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు వెల్లడించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగాగురువారం పెందుర్తి లో మత్స్యకారులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మత్స్యకారులు వారి సమస్యలను చద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
వాటన్నింటిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
స్థానిక చేపల చెరువులోని చేపలను పట్టుకునే హక్కు స్థానిక మత్స్యకారులకే ఉండేలా నాడు అనుమతులు ఇచ్చామని చెప్పారు. మత్స్యకారుల పడవలకు డీజిల్ పై ఆరు రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమన్నారు. జగన్ జీవో నెంబర్ 217 తెచ్చి మత్సకారులు స్థానిక నీటివనరులు, చెరువుల్లో చేపలు పట్టుకునే అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులను బోట్లు కొనుక్కోడానికి సబ్సిడీ ఇచ్చింది టీడీపీయేనని చెప్పారు. నేడు సవాలక్ష ఆంక్షలు, షరతులతో మత్స్యకారుల వృత్తినే దెబ్బతీశారన్నారు.
తెలుగు దేశం ఆవిర్భావం తరువాత బిసిలకు రాజకీయ అవకాశాలు వచ్చాయి.
బిసి వర్గాలకు తెలుగు దేశం ఇచ్చిన రాజకీయ రిజర్వేషన్ల వల్లనే వారి నాయకత్వం పెరిగింది.
టిడిపి హయాంలో 34 శాతం ఉన్న బిసిల రిజర్వేషన్లు జగన్ అసమర్థత కారణంగా 24 కు శాతానికి తగ్గాయని ఆరోపించారు.
ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి బీసీలకు ఏం చేశాడు? ఒక్క పథకం అయినా ఇచ్చాడా అని ప్రశ్నించారు. పది రూపాయిలిచ్చి వంద దోస్తున్నాడు. పప్పు, ఉప్పూ, గ్యాస్ సహా అన్నింటిలో ధరలు పెంచేశారు.
మద్యంపై జే ట్యాక్స్ వేసి దోచుకుంటున్నాడు. నాణ్యత లేని మద్యంతో మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు అని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సహజ వనరులను దోచుకుంటున్నారు. విశాఖను దాదాపుగా కబ్జా చేసేశారు.
మత్స్యకారుల సమస్యలపై చర్చించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆదుకుంటామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.