టిడ్కో ఇల్లు మీ ఆస్తి.వదలిపెట్టొద్దు అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గురువారం పెందుర్తి అసెంబ్లినియోజకవర్గంలోని టిడ్కో ఇళ్ల లబ్దిదారులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. తెలుగు దేశం హయాంలో సకల వసతులతో నిర్మించిన ఇళ్లను ఇప్పటికీ తమకు కేటాయించకపోవడంపై లబ్దిదారులుచంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వారినుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ 1983లో ఎన్టీ రామారావు పక్కా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారన్నారు. పేదవాడి సొంతింటి కల నిజం చేయాలనేదే
నా లక్ష్యం అని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ సహాయ సహకారాలతో టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించాను.నీరు, రోడ్లు, కరెంటు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాం.
300, 365,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాం.
7.50 లక్షల ఇళ్లు నాడు పేదలకు మంజూరు చేశాం. మొత్తం ఇళ్ల నిర్మాణంపై 30 వేల కోట్లు ఖర్చు చేశాం అని చంద్రబాబు వివరించారు.
మంజూరు చేసిన టిడ్కో ఇళ్లలో 3.15 లక్షల ఇళ్లు పూర్తి చేశాం.
పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామనినాడే చెప్పాం.
40 నుంచి 60 అడుగుల రోడ్ల తో టిడ్కో ఇళ్ల ప్రాంగణాలు డిజైన్ చేశాం అని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక సెంటు స్థలం ఇస్తామంటున్నారు. 12 అడుగుల రోడ్డు మాత్రమే జగన్ చెప్పిన కాలనీల్లో రోడ్డు వస్తుంది. ఈ రోడ్డుపై రెండు వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది అన్నారు. టిడ్కో కాలనీల్లో సిమెంటు రోడ్లు వేశాం. పార్కులు కట్టాం. డ్రైనేజి, అంగన్ వాడి సెంటర్ లు ఏర్పాటు చేశాం.
ఆస్తి విలువ పెంచాలని చూశాం.గ్రానైట్ రాళ్లతో కిచెన్, వాష్ ఏరియా, ట్యాప్ లు ఉండేలా వసతులు కల్పించాం.
మీ ఇంటికి ఏ కలర్ వేసుకోవాలనో ఆ ఛాయిస్ కూడా మీకే ఇచ్చాం.
గవర్నమెంట్ కలర్ వేస్తే గవర్నమెంట్ ఇల్లు కట్టిచ్చినట్లు అవుతుంది. మీ ఇల్లు కాబట్టి మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు అని చెప్పాం.
మీ అభిప్రాయాలు గౌరవించాం అని వివరించారు. మనం కట్టిన ఇళ్లకు రంగులు వేసుకుని జగన్ దిష్టిబొమ్మల్లా పెట్టాడు.ఆనాడు లక్షా 50 వేలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చాం. కేంద్రం లక్షా 50
వేలు ఇచ్చింది. ఈ 3 లక్షలు కాకుండా కామన్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ కి నిధులిచ్చామన్నారు. మంచి ఇళ్లు ఈ సైకో సీఎం వచ్చి చెడగొట్టాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్లు పెట్టాం.
వన్ టైమ్ సెటిల్ మెంట్ అని దానికి కూడా డబ్బులు కట్టించుకున్నాడు అని చెప్పారు. ఐదేళ్లు గడుస్తున్నా ఒక్క ఇంటికి కూడా ప్రణాళిక తయారు చేయలేకపోయాడు. నాలుగేళ్లలో 5 ఇళ్లు కట్టాడు. జగన్
ఉండే ఇంటిలోనేమో వంద గదులు ఉండాలి. ఊరికో ప్యాలెస్ కావాలి. పేదవారికిమంచి ఇల్లు ఉండకూడదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.