- విద్వేష, వికృత, విధ్వంసకర ప్రభుత్వ విధానాలు
- ఏపీకి రావడానికి భయపడుతున్న పెట్టుబడిదారులు
- ఇతర రాష్ట్రాలకు తరలిన రూ.17లక్షల కోట్ల పెట్టుబడులు
- పరిశ్రమలు తరలివెళ్లడంతో కోల్పోతున్న ఉద్యోగ అవకాశాలు
- నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న యువత
- మెరుగైన పారిశ్రామిక విధానాలకు చర్యలు తీసుకోవాలి
- సీఎం జగన్‌రెడ్డికి యనమల బహిరంగలేఖ
అమరావతి, నవంబరు 1 (చైతన్యరథం): రాష్ట్రాభి వృద్ధి విషయంలో అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం గత మూడున్నరేళ్లుగా అధోగతి పాలైందని తెలుగుదేశంపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసన మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆవే దన వ్యక్తం చేశారు. మైనస్ గ్రోత్, నిరుద్యోగం, ద్రవ్యో ల్బణం, సున్నా పెట్టుబడులతో బడుగుల సంక్షేమం సంక్షోభంలో చిక్కుకుందని మంగళవారం ఒక ప్రకట నలో ఆయన వివరించారు. టీడీపీ హయాంలో పారిశ్రామిక, సేవా రంగాలు జెట్ స్పీడ్ తో పరుగులుతీశాయి. ప్రస్తుతం అన్నిరంగాలు తిరోగమనంలో నడుస్తున్నాయి. ప్రభు త్వ విద్వేష, వికృత, విధ్వంసకరమైన విధానాలతో రాష్ట్రానికి కొత్తగా ఒక్కటంటే ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. ఉపాధి కల్పనలేదు. మరోవైపు, ప్రభుత్వ నిర్ణ యాల వల్ల ఏపీలో ఏర్పాటు కావాల్సిన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి.రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రతి పనిలో నీకది-నాకిది (కమిషన్లు)కు భయపడి పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడుతున్నారు.
ఇతర రాష్ట్రాలకు తరలిన రూ.17లక్షల కోట్ల పెట్టుబడులు
గత మూడున్నరేళ్లలో రూ.17లక్షల కోట్ల పెట్టు బడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. రాష్ట్రా నికి ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. కియా అనుబంధ సంస్థలు చెన్నై, హైదరాబాద్ వెళ్లిపోయాయి. అదానీ డేటా సెంటర్‌రద్దు చేశారు. లులూ, ఫ్రాంక్లిన్ టెంపు ల్టన్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ వంటి సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేశారు. ప్రకా శం జిల్లాలో ఏర్పాటుకావాల్సిన ఏషియన్ పల్ప్ పేపర్ పరిశ్రమ పెట్టుబడులు ఉపసం హరించుకుంది. బీ ఆర్ శెట్టిసంస్థలు, సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టులు, రేణిగుంటలో రిలయన్స్ పెట్టుబడులు, వరల్ట్ బ్యాంకు రుణాలు రూ.2,100 కోట్లు, ఏషియన్ బ్యాంకు రుణా లు రూ.1,400 కోట్లు వెనక్కు వెళ్లాయి. ఒంగోలు నుంచి ఏపీపీ పేపర్ కంపెనీ, విశాఖ రుషికొండ ఐటీ సెజ్ నుంచి కంపెనీలు తరలిపోయాయి. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లో వచ్చిన పెట్టుబడులెన్ని, నెలకొల్పిన పరిశ్రమలెన్ని, కల్పించిన ఉద్యోగాలెన్ని? సీబీఐసీ కారిడార్ పురోగతి ఏమిటి? చెన్నై-బెంగళూ రు పారిశ్రామిక కారిడార్‌కు వచ్చిన పెట్టుబడులెన్ని, నెలకొల్పిన పరిశ్రమలెన్ని, కల్పించిన ఉద్యోగాలెన్ని? వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏమైం ది? దానివల్ల రాష్ట్రానికిగాని, యువతకు గాని ఒరి గిందేమిటి? ఇలా ఒక్కటేమిటి.. గత ప్రభుత్వం కుదు ర్చుకున్న ఒప్పందాలు రద్దుచేశారు. కేటాయించిన భూములు వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాల తో పెట్టుబడులు, పరిశ్రమలు ఏపీకి దూరం కావడమే కాకుండా రాష్ట్ర యువత పెద్ద ఎత్తున ఉద్యోగ అవకా శాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా కనీసం పత్రికా స్వేచ్ఛ కూడా లేని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు మాత్రం ఎందుకు వస్తారో ఆలోచించుకోవాలి.
జాబ్ కేలండర్ హామీ పేపర్లకే పరిమితం
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదు. ప్రతి ఏటా జనవరి లో జాబ్ కేలండర్ హామీ పేపర్లకే పరిమితమైంది. విద్యాధికులైన యువత ఉద్యోగాల్లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీనవర్గా ల ప్రజల ఆర్థిక స్థితిగతులు తలకిందులవుతు న్నాయి. ఉద్యోగాలు,ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువ త మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలకు బానిసలవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ నవోదయం, వైఎస్సార్ -జగనన్న బడుగు వికాసం, 2020-23 నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చింది. కానీ, ప్రోత్సాహ కాలకు మాత్రం ఎలాంటి నిధులివ్వకుండా నీరుగార్చా రు. దావోస్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యే కంగా కమిటీ వెళ్లినప్పటికీ పైసాపెట్టుబడి వచ్చినట్లు ఎక్కడా ఎవరూ చెప్పలేదు.
2021-22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సా హకాల కింద రూ.24.40 కోట్లు, బీసి పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలుగా రూ.101 కోట్లు, జనరల్ కేటగిరీ వారికి రూ.191కోట్లు మాత్రమే ఖర్చు చేయ డమంటే ఏ స్థాయిలో పారిశ్రామిక వేత్తలను నిర్వీర్యం చేస్తున్నారో అర్ధమవుతోంది. ఇలాంటి ప్రోత్సాహకాలు బడుగు బలహీనవర్గాల పారిశ్రామిక వేత్తలను ఎదగ నీయకుండా చేయడమే. బీసీ, ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాధిని పూర్తిగా అటకెక్కించారు. టీడీపీ హయాంలో ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్లను గుర్తించి వాటిపైనే పూర్తి గా దృష్టిపెట్టి జీఎస్డీపీ పెంపునకు కృషిచేశాం.ఫలితం గా నాలుగేళ్లు డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యమైంది. గత మూడున్నరేళ్లపాలనలో గ్రోత్‌ఇంజన్లన్నీ రివర్స్‌లో నడు స్తున్నాయి. హార్టీకల్చర్(-8శాతం), లైవ్‌స్టాక్(-6.5శా తం),మత్స్య ఆక్వారంగం(-14శాతం), మొత్తం అగ్రిక ల్చర్ సెక్టార్(-4.8శాతం), తయారీరంగం(-5.4శా తం), నిర్మాణరంగం(-2.6శాతం), పారిశ్రామిక రం గం (1.4శాతం), ట్రేడ్ అండ్ రెస్టారెంట్ (-4శాతం), సేవారంగం(-1.7శాతం) ఓవరాల్ జీఎస్డీ పీగ్రోత్(-1.8)గా నమోదయింది.చంద్రబాబు హయాంలో తల సరి ఆదాయం రెండంకెల్లో ఉంటే, గత మూడున్నర సంవత్సరాలుగా సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది.
పెట్టుబడుల ఆకర్షణలో 13వ స్థానానికి దిగజారింది
ఈమూడేళ్ళలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల ఆకర్షణ లో రాష్ట్రం 13వ స్థానానికి పడిపోయింది.అదే 2018 -19లో తెలుగుదేశం ప్రభుత్వం రూ.19,671 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణతో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. 2019 అక్టోబరు-2021 జూన్ మధ్యలో తమిళనాడు రూ.30వేల కోట్లు, కర్ణాటక రూ.1.49లక్షల కోట్లు, తెలంగాణ రూ.17,709 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించగా,2019 అక్టోబర్-2021 జూన్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిన పెట్టుబడులు రూ.2,577 కోట్లు మాత్రమే. 2018-19లో జీవీఏ లెక్కల ప్రకారం ఏపీ పారిశ్రామికవృద్ధి రేటు 10.24 శాతం కాగా, 2020-21లో పారిశ్రామిక రంగం వృద్ధిరేటు -3.26శాతం నమోదైంది. 2019 అక్టోబర్ – 2020 డిసెంబర్ మధ్య ఏపీకి కేవలం రూ.1975 కోట్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా వచ్చిన ఎఫ్డీఐలలో కేవలం 0.32శాతం మాత్రమే.
రాష్ట్రంలో వనరులు,పరిశ్రమల ఏర్పాటులో మనం కల్పించే సౌలభ్యాలను, ప్రోత్సాహకాలను, ప్రాజెక్టుల ను నాయకుడి చిత్తశుద్ధి, సమర్ధత ఆధారంగా పరి శ్రమలు ఏర్పాటుకు సుముఖత చూపిస్తారు. పారిశ్రా మికాంధ్ర ఆవిష్కారానికి చంద్రబాబునాయుడు ఐదేళ అన్ని విధాలా అవిరళ కృషిచేశారు. అందుకే పెట్టుబడి దారులు బారులుతీరారు. ఆటోమొబైయిల్ రంగంలో ఇసుజు, కియా మోటార్, అపోలో టైర్లు, అశోక్ లే లాండ్, భారత్ పోర్డ్, హీరో గ్రూపు రాగా, సెల్ ఫోన్ తయారీ రంగంలో ఫాక్స్ కాన్, సెల్‌కాన్, ప్లెక్స్ ట్రాని క్స్, డిక్సన్, రిలయన్స్, టీసీయల్, ఓల్టాస్ వంటి సం స్థలు వచ్చాయి. ఏది ఏమైనా, ఎవరు ఏమన్నా టీడీపీ ఐదేళ్ల పాలనలో పారిశ్రామికాంధ్ర ఆవిష్కారానికి కృషి జరిగింది.జగన్‌రెడ్డి అధికారంలోకిరాగానే విద్యుత్ పీపీఏలను రద్దుచేశారు. రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టు సంస్థలను వెంటబడివేధించారు. సాగునీటి కి కీలకమైన పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రశ్నార్థకంచేశారు.రాజధాని ఏదిఅంటే చెప్పు కోలేని దుస్థితి కల్పించారు.ఇలాంటి రాష్ట్రంలో పెట్టు బడి పెట్టేందుకు ఎవరైనా ముందుకువస్తారా?.ఈ విష యాన్ని పరిశీలించి, రాష్ట్ర అభివృద్ధికి దోహద పడేలా నిర్ణయాలుతీసుకోవాలని యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రికి బహిరంగలేఖలో సూచించారు.