- ప్రజా సమస్యల పరిష్కారంలో నేతలు ముందుండాలి
- కార్యకర్తలకు అన్నవేళలా అండగా ఉంటాం
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
పి.గన్నవరం (చైతన్యరథం): కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటా చేరేలా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బుడుంగపేట చేరుకున్న ఆయన కూటమి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి నేతలు ఎల్లప్పుడూ ముందుండాలని, కార్యకర్తలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కోనసీమ ప్రాంత సమగ్ర ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. స్థానిక నాయకత్వానికి, శ్రేణులకు తగిన మార్గదర్శనం చేస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు సీఎం మాచవరంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
















