- పార్టీ బలోపేతంపై చర్చ
మంగళగిరి(చైతన్యరథం): చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వాహక అధ్యక్షుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎసఐఆర్ ప్రక్రియపై మంత్రి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపైనా సమావేశంలో చర్చించా రు. త్వరలోనే పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తి చేస్తామని చెప్పా రు. కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా తలెత్తుతున్న సమస్యలను నేతలు, కార్యకర్తలు లోకేష్ దృష్టికి తీసు కువచ్చారు. జోనల్ ఇన్‌ఛార్జ్, నియోజకవర్గ పరిశీలకులను పంపి సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు.

















